చుండ్రుని పూర్తీగా తొలగించే.. సింపుల్ సొల్యూషన్స్..!!

By Swathi

కాలుష్యం, ఒత్తిడి, దూర ప్రయాణాల కారణంగా ప్రతి ఒక్కరిని చుండ్రు సమస్య వేధిస్తుంది. ప్రస్తుత బిజీ లైఫ్ లో చుండ్రుతో బాధపడే వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. ఎన్ని ప్యాక్ లు వేసుకున్నా, ఎన్ని షాంపూలు వాడినా.. చుండ్రు సమస్య నుంచి మాత్రం బయటపడలేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు.

చుండ్రు వల్ల కేవలం ఇది జుట్టుకి మాత్రమే కాదు.. చర్మానికి హాని చేస్తుంది. మొటిమలు, యాక్నెకి కారణమవుతుంది. డ్రైస్కాల్ప్ కండిషన్, సరైన శ్రద్ధ తీసుకోకపోవడం, పోషకాహార లోపం వంటివన్నీ.. డాండ్రఫ్ కి కారణమవుతాయి. యాంటీ డాండ్రఫ్ షాంపూలు.. మంచి కంటే.. ఎక్కువగా డ్యామేజ్ చేస్తాయి.

చుండ్రు వల్ల ఎదురయ్యే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్..! నివారించే సొల్యూషన్స్..

షాంపూలో ఉండే సాలిసైలిక్ యాసిడ్, జింక్ పైరిథియోన్, కోల్ థార్, రిసోర్సిన్, సెలినియం వంటి పదార్థాలు.. జుట్టుకి, స్కాల్ప్ కి హాని చేస్తాయి. జింక్ పైరిధియోన్ కళ్లకు, కోల్ థార్ చర్మానికి, సాలిసైలిక్ యాసిడ్ అలసట, శ్వాసకు ఆటంకం ఏర్పరుస్తాయి.

ఈ కారణాలన్నీ తెలుసుకున్నాక ఇకపై యాంటీ డాండ్రఫ్ షాంపూ ఉపయోగించరనే నమ్ముతున్నాం. మరి.. డాండ్రఫ్ ని ఎలా వదిలించుకోవాలి అని ఆలోచిస్తున్నారా ? సింపుల్.. మీ వంటింటి నేస్తాలే.. మీ చుండ్రుని పూర్తీగా వదిలిస్తాయి. మరి అవేంటో చూద్దామా..

కొబ్బరినూనె, నిమ్మరసం

కొబ్బరినూనె, నిమ్మరసం

కొబ్బరినూనెలో పోషకాలు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. నిమ్మరసం దుమ్ము ధూళిని తొలగిస్తూనే.. చుండ్రుని నివారిస్తుంది.

ఉపయోగించే విధానం

ఒక కప్పులో కొబ్బరినూనెను హీట్ చేయాలి. సమాన మోతాదులో నిమ్మరసం కలపాలి. కాటన్ బాల్ ఉపయోగించి.. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి.. 20 నిమిషాల తర్వాత.. మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి.

బేకింగ్ సోడా, నిమ్మరసం

బేకింగ్ సోడా, నిమ్మరసం

బేకింగ్ సోడాలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి డాండ్రఫ్ తో పోరాడతాయి.

ఉపయోగించే విధానం

బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపి.. తడి జుట్టకి అప్లై చేయాలి. స్కాల్ప్ కి కూడా పట్టించాలి. 5 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

స్కాల్ప్ ఎక్కువగా డ్రైగా లేదా జిడ్డుగా ఉన్నప్పుడు.. డాండ్రఫ్ ఏర్పడుతుంది. స్కాల్ప్ కి పోషణ అందించడంలో ఆలివ్ ఆయిల్ సహాయపడుతుంది.

ఉపయోగించే విధానం

కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకుని.. కొద్దిగా హీట్ చేయాలి. సున్నితంగా స్కాల్ప్ కి మసాజ్ చేయాలి. గోరువెచ్చని టవల్ చుట్టుకోవాలి. 45 నిమిషాల తర్వాత.. ఆలివ్ ఆయిల్ లోని పోషకాలను హెయిర్ గ్రహిస్తుంది. ఇప్పుడు జుట్టుని మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి.

పెరుగు

పెరుగు

పెరులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది.. దురదను తగ్గించి, డాండరఫ్ ని తొలగిస్తుందిం, జుట్టుని బలంగా మారుస్తుంది. డాండ్రఫ్ నివారించడానికి ఇది పర్ఫెక్ట్ రెమిడీ.

ఉపయోగించే విధానం

పెరుగుని మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత జుట్టుకి పట్టించాలి. షవర్ క్యాప్ పెట్టుకుని.. 30 నిమిషాల తర్వాత.. జుట్టుని మైల్డ్ షాంపూ ఉపయోగించి.. శుభ్రం చేసుకోవాలి.

యాపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్్ లో ఎసెటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది... దురదను నివారించి.. డాండ్రఫ్ ని, స్కాల్ప్ ఇన్ఫెక్షన్ ని నివారిస్తుంది.

ఉపయోగించే విధానం

యాపిల్ సైడర్ వెనిగర్, నీళ్లు సమానంగా తీసుకుని మిక్స్ చేయాలి. షాంపూ చేసుకున్న తర్వాత.. చివరగా.. ఈ మిశ్రంతో శుభ్రం చేసుకోండి. 5నిమిషాలు మసాజ్ చేసుకుని.. ప్లెయిన్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.

మెంతులు

మెంతులు

మెంతుల్లో ఉన్న ప్రొటీన్, ఎమినో యాసిడ్ హెల్తీ హెయిర్ గ్రోత్ కి సహాయపడుతుంది. చుండ్రుని నివారిస్తుంది.

ఉపయోగించే విధానం

మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి.. ఉదయం మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని స్కాల్ప్ కి పట్టించాలి. 40 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి.

టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్ లో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అవి డాండ్రఫ్ ని తొలగిస్తాయి. స్కాల్ప్ దురదను తగ్గిస్తుంది.

ఉపయోగించే విధానం

టీ ట్రీ ఆయిల్, నీళ్లు సమానంగా తీసుకుని కలుపుకోవాలి. స్ప్రే బాటిల్ లో వేసుకుని.. షాంపూ చేసుకున్న తర్వాత.. స్కాల్ప్ కి పట్టించాలి. 5 నిమిషాల పాటు మసాజ్ చేసుకున్న తర్వాత.. టవల్ తో శుభ్రం చేసుకోవాలి.

గుడ్డులోని తెల్లసొన

గుడ్డులోని తెల్లసొన

తలకు అప్లై చేసినా.. డైట్ లో చేర్చుకున్నా.. అందులోని ప్రొటీన్స్ జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. డాండ్రఫ్ ని నివారిస్తాయి.

ఉపయోగించే విధానం

గుడ్డులోని తెల్లసొనను ఒక గిన్నెలో వేసుకుని...బ్రష్ ఉపయోగించి.. స్కాల్ప్ కి పట్టించాలి. గంట తర్వాత.. మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. జుట్టుపై ఎగ్ పూర్తీగా పోయేంతవరకు శుభ్రం చేసుకోవాలి.

వెల్లుల్లి

వెల్లుల్లి

వెల్లుల్లిలో అల్లిసిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది యాంటీ ఫంగల్, యాంటీ కాండిడా గుణాలు కలిగి ఉంటుంది. ఇవి.. డ్రాండ్రఫ్ కి కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది.

ఉపయోగించే విధానం

4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలను మెత్తగా చేసి.. 1 టీస్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి, స్కాల్ప్ కి పట్టించాలి. బాగా మసాజ్ చేసి.. 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి అంతే.

ఉప్పు

ఉప్పు

సాల్ట్ డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తుంది. ఐయోడిన్, మినరల్ సాల్ట్ లో ఉండటం వల్ల.. అవి డాండ్రఫ్ ని తొలగిస్తాయి. తలలో న్యాచురల్ ఆయిల్ తొలగిపోకుండా.. చుండ్రుని నివారించడంలో సహాయపడుతుంది ఉప్పు.

ఉపయోగించే విధానం

పాన్ లో నీళ్లు వేడి చేయాలి. 2 టేబుల్ స్పూన్ల సీసాల్ట్ కలపాలి. ఒక సారి అది చల్లారిన తర్వాత.. ఆ నీటితో.. తలను శుభ్రం చేసుకోవాలి. అలాగే స్కాల్ప్ ని సున్నితంగా మసాజ్ చేయాలి. 5 నిమిషాల మసాజ్ తర్వాత.. రెగ్యులర్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి.

వైట్ వెనిగర్

వైట్ వెనిగర్

వెనిగర్ లో యాసిడ్ ఉండటం వల్ల.. దురదగా ఉండే స్కాల్ప్ ని నివారించి.. డాండ్రఫ్ ని తొలగిస్తుంది.

ఉపయోగించే విధానం

ప్యూర్ వెనిగర్ ని స్కాల్ప్ కి పట్టించి.. కొన్ని నిమిషాలు మసాజ్ చేయాలి. వేడిగా ఉన్న టవల్ ని చుట్టుకోవాలి. అరగంట తర్వాత.. మైల్డ్ షాంపూతో తలను శుభ్రం చేసుకోవాలి.

అల్లం

అల్లం

అల్లంలో యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. అవి.. డాండ్రఫ్ కి కారణమయ్యే ఫంగస్ ని తొలగిస్తాయి.

ఉపయోగించే విధానం

మూడు టేబుల్ స్పూన్ల అల్లం రసం, అదే మోతాదులో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసుకోవాలి. సున్నితంగా స్కాల్ప్ ని మసాజ్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత.. శుభ్రం చేసుకోవాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే.. చుండ్రు పూర్తీగా తొలగిపోతుంది.

అలోవెరా

అలోవెరా

అలోవెరాలో పెక్టిన్, పోలిశ్యాచురేట్స్ ఉంటాయి. ఇవి.. బ్యాక్టీరియాని తొలగించి.. చుండ్రు రాకుండా అడ్డుకుంటుంది.

ఉపయోగించే విధానం

1/3 వంతు కప్పు అలోవెరా జ్యూస్, అర టీ స్పూన్ నిమ్మరసం మిక్స్ చేయాలి. కాటన్ బాల్ సహాయంతో.. స్కాల్ప్ కి సున్నితంగా మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత.. హెయిర్ ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

తులసి

తులసి

తులసిలో యాంటీ సెప్టిక్ గుణాలు ఉండటం వల్ల.. టాక్సిన్స్ ని న్యూట్రలైజ్ చేస్తాయి. జుట్టులో టాక్సిన్స్ ని తొలగిస్తాయి. అలా.. ఇన్ల్ఫమేషన్ ని తగ్గించి.. స్కాల్ప్ కి పోషణ అందిస్తాయి.

ఉపయోగించే విధానం

రెండు టేబుల్ స్పూన్ల తులసి ఆయిల్, ఆలివ్ ఆయిల్ తీసుకుని కలపాలి. ఈ మిశ్రామాన్ని స్కాల్ప్ పై మసాజ్ చేయాలి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి.. జుట్టుని బలంగా మారుస్తుంది. డాండ్రఫ్ ని నివారిస్తుంది.

హెన్నా

హెన్నా

హెన్నాలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి స్కాల్ప్ ని హెల్తీగా మారుస్తాయి. ఇన్ఫెక్షన్ కి దూరంగా ఉంచుతాయి.

ఉపయోగించే విధానం

హెన్నా తయారు చేసుకుని స్కాల్ప్ కి పట్టించాలి. 14 నిమిషాల తర్వాత.. ఆరిన తర్వాత.. రెగ్యులర్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి అప్లై చేయడం వల్ల అమేజింగ్ బెన్ఫిట్స్ పొందవచ్చు.

Story first published: Thursday, August 4, 2016, 13:00 [IST]
Desktop Bottom Promotion