Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
ఒత్తైన, పొడవైన జుట్టు పెరుగుదలకు 6 నేచురల్ ఆయిల్స్..
మనం అందరం మన జుట్టు పోషణకు మరియు జుట్టు పెరుగుదల కోసం కొన్ని బెస్ట్ ఆయిల్స్ ను ఎంపిక చేసుకుంటాం. తలకు, ఆయిల్ మసాజ్ చాలా మంచిది. ఆయిల్ మసాజ్ హెయిర్ గ్రోత్ ను పెంచుతుంది, తల, జుట్టుకు సంబంధించి కొన్ని సమస్యలను అరికడుతుంది మరియు పొడిబారిన కేశాలను మరియు చిక్కుబడిన కేశాలకు నేచురల్ గా చికిత్సనందిస్తుంది. జుట్టు సంరక్షణలో చాలా రకాల నూనెలు ఉన్నాయి వాటిలో కొబ్బరి నూనె చాలా ప్రసిద్ది చెందినది.
జుట్టుకు పెరుగుదల కోసం ఉపయోగించే నూనెల్లో చాలా రకాలు ఉన్నాయి. అయితే ఎన్ని రకాల నూనెలున్నప్పటికి జుట్టుకు సంబంధించనంత వరకూ నేచురల్ గా పెరిగేలా చేసే నూనెలు మన ఇండియన్ ఆయిల్సే. ఈ ఆయుర్వేద జుట్టు రహస్యాన్ని పురాతన గ్రంథాలలో రాసినట్లు చెప్పబడింది. ఆయుర్వేదంలో చాలా రకాల మూలికా తైలాలు ఉన్నాయి. అవి మీ హెయిర్ డ్యామేజ్ ను అరికడుతుంది మరియు జుట్టుకు కావల్సిన పోషణను అందించడానికి సహాయపడుతాయి. ఈ నూనెలను మందారపువ్వులు, పెరుగు లేదా నిమ్మరసంలో కలిపి హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల కేశాలను చాలా మేలు చేస్తుంది.
జుట్టు పోషణకు వివిధ రకాల నూనెలు ఉన్నాయి. అందులో కొన్ని జుట్టు పెరుగుదలతో పాటు జుట్టు రంగును(నల్లగా) మార్చే నూనెలు కూడా ఉన్నాయి. జుట్టు పెరుగుదలకు మరికొన్ని సాధారణ నూనెలు( కొబ్బరి నూనె మరియు బాదాం నూనె) వంటివి ఉన్నాయి. ఇంకొన్ని హెర్బల్ ఆయిల్స్(బ్రహ్మి ఆయిల్ మరియు బ్రింగ్ రాజ్ ఆయిల్స్)వంటి నూనెలో తలకు..తల మాడుకు చల్లదనాన్నిచ్చి..చుండ్రు నివారిణులుగా సహాయపడుతాయి.

తల మాడుకు రెగ్యులర్ గా ఆయిల్ మసాజ్ చేయడం మరియు తలలోపలి బాగానికి ముని వేళ్ళతో మసాజ్ చేయడం వల్ల నాణ్యమైన జుట్టును మీరు పొందవచ్చు. మరి జుట్టు పెరుగుదల మరియు పోషణకు హెడ్ మసాజ్ కు కొన్ని ఆయిల్ ఉపయోగించి ప్రయత్నించండి. మీ జుట్టు పెరుగుదలలో మార్పుకు ఆశ్చర్యపడక తప్పదు. మరి జుట్టు పెరుగుదలకు, పోషణకు బెస్ట్ ఆయిల్స్ ఏంటో ఒకసారి చూద్దామా..

1. కొబ్బరి నూనె: మన భారత దేశంలో చాలా వరకూ కేశ సంరక్షణకు ఉపయోగించే నూనెలో కొబ్బరి నూనె ప్రధానమైనది. కొబ్బరి నూనెలోని ఓమేగా 3 యాసిడ్స్ హెయిర్ రూట్స్ కు చక్కటి పోషణను అందిస్తుంది. అంతే కాదు జుట్టు మందంగా మరియు వేగవంతంగా పెరుగడానికి సహాయపడుతుంది. తలస్నానాకి ముందు కొబ్బరి నూనెతో హెయిర్ మసాజ్ వారంలో రెండు మూడు సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలను ఇస్తుంది. జుట్టు సమస్యలను జుట్ట పొడిబారడాన్ని మరియు దురద వంటి సమస్యలను అరికడుతుంది . కొబ్బరి నూనె తలకు మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. మరియు కేశాలకు మంచి మెరుపును ఇస్తుంది . కొబ్బరి నూనెను నిమ్మరసంతో కలిపి, తలకు పట్టించి తర్వాత తలస్నానం చేసుకోవచ్చు. మందార పువ్వులతో కలిపి వేడి చేసి తలకు పట్టించడం వల్ల జుట్టు రాలడాన్ని అరికడుతుంది.

2. బాదాం నూనె: బాదాం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల హెయిర్ గ్రోత్ కు బాగా సహాయపడుతుంది. ఇది కూడా కొబ్బరి మరియు ఆమ్లా నూనెలు మాదిరే ఉంటుంది. అతి త్వరగా జుట్టు పెరగాలనుకొనే వారు బాదాం నూనెను ప్రతి రోజూ తలకు పట్టించాలి.

3. కాస్ట్రోఆయిల్(ఆముదం నూనె): కాస్ట్రో ఆయిల్ కూడా జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. మీ కేశాలకు ఆముదం నూనెతో మసాజ్ చేయాలి. ఆముదం నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలడాన్ని అరికడుతుంది మరియు జుట్టు పెరుగుదను ప్రోత్సహిస్తుంది. జుట్టు సంరక్షణలో ఇది బెస్ట్ ఆయిల్ గా భావించవచ్చు. ఇతి జుట్టు నాణ్యతను పెంచుతుంది.

4. మస్టర్డ్ ఆయిల్(ఆవనూనె): మందపాటి జుట్టు..నల్లటి జుట్టు పొందాలంటే మస్టర్డ్ ఆయిల్ ను ఉపయోగించవచ్చ. మస్టర్డ్ ఆయిల్ తలలో బ్లడ్ సర్కులేషన్ పెంచి జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.

5.మందార నూనె: మందార నూనె మరో హోం మేడ్ ఆయిల్. ఈ నూనెను మీరు జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు మొదళ్ళ నుండి జుట్టును బలోపేతం చేస్తుంది.హైబిస్కస్ హెయిర్ ఆయిల్ కేశాలకు మంచి రంగును అందించడంతో పాటు కేశాలకు ఒక చక్కటి ఆక్రుతిని ఏర్పరుస్తుంది. కొన్ని సార్లు ఎండ వేడికి, ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల, దుమ్మ దూళి వల్ల చాలా అసహ్యాంగా బ్రౌన్ కలర్ లో కనబడుతుంది. అందుకు హైబిస్కస్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల హెల్తీ హెయిర్ మరియు బ్లాక్ హెయిర్ తిరిగి పొందవచ్చు . కేశాలు రంగు మారడాన్ని నిరోధించవచ్చు.

6. ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్ ను కొబ్బరి నూనెతో మిక్స్ చేసి, డ్యామేజ్ హెయిర్ కు వారానికి రెండు సార్లు అప్లై చేస్తుంటే, జుట్టు సమస్యలను తొలగిస్తుంది.



Click it and Unblock the Notifications