Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్!
షీకాకాయలో దాగున్న పవర్ ఫుల్ హెయిర్ కేర్ బెన్ఫిట్స్
షాంపూలో హానికారక రసాయనాలు ఉంటాయని మీ మమ్మీ మీకు ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తోందా ? కానీ టీవీలో వచ్చే యాడ్స్ అందరినీ టెంప్ట్ చేస్తున్నాయి. పొడవాటి, ఒత్తైన, సీల్కీ హెయిర్ మీకు అందిస్తుంది అంటూ రకరకాల ప్రొడక్ట్స్ కళ్ల ముందు చూపిస్తుంటే.. ప్రతి ఒక్కరూ ఎట్రాక్ట్ అవుతూ ఉంటారు.
కానీ షీకాకాయ జుట్టుకి చేసే అద్భుతం గురించి చాలా మందికి తెలియదు. జుట్టు ఆరోగ్యానికి పవర్ ఫుల్ రిజల్ట్స్ ఇచ్చే వాటిలో షీకాకాయ ఒకటి. ఒక శతాబ్దాలుగా షీకాకాయను జుట్టు సంరక్షణకు వాడుతూ వస్తున్నారు. మన అమ్మలు, అమ్మమ్మలు కూడా వీటినే ఉపయోగించేవాళ్లని వింటూనే ఉంటాం. ఎందుకంటే.. ఇందులో అనేక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి. అయితే.. షీకాకాయ ఉపయోగించడం వల్ల జుట్టుకి జరిగే మేలు గురించి తెలుసుకుంటే.. మీరు కూడా ఇప్పుడే వాడటం మొదలుపెడతారు. మరి షీకాకాయ బ్యూటీ సీక్రెట్స్ తెలుసుకుందామా..

గాఢత తక్కువ
షీకాకాయ హెర్బల్ ఆయిల్ ఉపయోగించడం వల్ల డ్రై స్కాల్ఫ్ నివారించవచ్చు. అలాగే చిట్లిపోతున్న జుట్టుని కూడా అరికట్టవచ్చు. జుట్టుని స్మూత్ అండ్ సాఫ్ట్ గా మార్చేస్తుంది.

చుండ్రు
చుండ్రు నివారించడానికి షీకాకాయ చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, న్యూట్రీషనల్ గుణాలు.. చుండ్రుని తగ్గించడంతో పాటు, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. చుండ్రు నివారించవచ్చు.

తెల్లజుట్టు
వయసు పెరిగేకొద్దీ చర్మంపై ముడతలు, స్పాట్స్, తెల్లజుట్టు సమస్య వేధిస్తుంటాయి. షీకాకాయ ఉపయోగించడం వల్ల నల్లటి ఒత్తైన జుట్టు సొంతం చేసుకోవచ్చు. షీకాకాయ, ఉసిరి వంటి వాటితో.. హెయిర్ ప్యాక్ తయారు చేసుకుని రెగ్యులర్ గా వాడటం వల్ల తెల్లజుట్టుని నివారించవచ్చు.

హెయిర్ లాస్
జుట్టు రాలే సమస్య కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి కారణమవుతుంది. దీనివల్ల జుట్టు రాలే సమస్య మరింత ఎక్కువవుతుంది. ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉండటం వల్ల షీకాకాయ జుట్టు రాలడాన్ని అరికట్టి.. వేగంగా జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టు చిట్లిపోవడాన్ని నివారిస్తుంది.

బలమైన జుట్టుకి
షీకాకాయ జుట్టుని న్యాచురల్ గా సాఫ్ట్ గా, స్మూత్ మారుస్తుంది. ఇందులో విడుదలయ్యే ఎసెన్షియల్ ఆయిల్స్, విటమిన్స్ జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. ఇది జుట్టు షైనింగ్ గా, బలంగా మారడానికి సహకరిస్తుంది.

పేను తగ్గించడానికి
తలలో పేను ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇవి తలలో దురదనే కాదు.. స్కాల్ఫ్ కి హానిచేస్తాయి. అలాగే ఇవి చాలా వేగంగా స్ప్రెడ్ అవుతాయి. దీనికి ఎన్ని షాంపూలు, ఆయిల్స్ పనిచేయవు. షీకాకాయలో ఉండే పీహెచ్ లెవెల్స్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు.. తలలో పేను లను త్వరగా తగ్గిస్తాయి.

తలలో గాయాలను
తలలో కొంతమందికి ఇబ్బందిపెట్టే గాయాలను షీకాకాయ నయం చేయగలదు. ఎండిన షీకాకాయలను పొడి చేసి వాడటం వల్ల తలలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా తగ్గిపోతాయి.

కూలింగ్ హెయిర్ ప్యాక్
షీకాకాయలో జుట్టుని స్మూత్ గా మార్చే సత్తా ఉంది. షీకాకాయ, ఉసిరికాయ, పెరుగు, సోప్ నట్ అన్నింటిని కలిపి జుట్టుకి ప్యాక్ లా వేసుకుంటే.. చాలా చల్లటి అనుభూతి కలుగుతుంది. సమ్మర్ లో ఈ ప్యాక్ మంచి ఫలితాన్నిస్తుంది. తలనొప్పి తగ్గించి, రిలాక్సేషన్ ఇస్తుంది.



Click it and Unblock the Notifications











