Latest Updates
-
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.!
రాత్రిపూట ఫాలో అయ్యే ఈ అలవాట్లే జుట్టు డ్యామేజ్‌కి కారణాలు..!
ప్రతిరోజూ డ్యామేజ్ హెయిర్‌తో ఇబ్బందిపడుతున్నారా.. జుట్టు కావాల్సిన పోషణ అందిస్తున్నా.. నిర్జీవంగా కనిపిస్తోందని భావిస్తున్నారా. అయితే మీ జుట్టు నిర్జీవంగా ఉంటే.. మీ లుక్ మొత్తంపై దుష్ర్పభావం చూపుతుంది. కాబట్టి జుట్టు ఎట్రాక్టివ్‌గా ఉండటానికి జాగ్రత్త తీసుకోవాలి.
మీకు అన్ హెల్తీ హెయిర్ ఉందంటే.. ట్రెండీ హెయిర్ స్టైల్ ఫాలో అవడం కూడా కష్టమవుతుంది. అయితే హెయిర్ డ్యామేజ్‌కి చాలా కారణాలుంటాయి. పోషకాహారలోపం, హెయిర్ కేర్‌పై శ్రద్ధ తీసుకోకపోవడం, కొన్ని రకాల అనారోగ్య సమస్యలు, కొన్ని మందుల సైడ్ ఎఫెక్ట్స్, పొల్యూషన్ కారణంగా.. జుట్టు డ్యామేజ్ అవుతుంది.
ఒకవేళ ఇవేవీ కారణాలు కాదు.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. అయినా జుట్టు మాత్రం నిర్జీవంగా తయారైంది అంటే.. మీరు పాటించే కొన్ని అలవాట్లే.. కారణమవుతాయి. అది డ్యామేజ్‌కి కారణమవుతాయి. మరి మీ జుట్టు డ్యామేజ్ అవడానికి మీరు పాటించే హ్యాబిట్స్ ఏంటో తెలుసుకుని.. వాటికి దూరంగా ఉండండి.

తడిజుట్టుతో పడుకోవడం
రాత్రిపడుకోవడానికి ముందు తడిజుట్టుతోనే పడుకుంటే.. జుట్టు రాలడానికి కారణమవుతుంది. దిండుపై జుట్టు అలా ఇలా తిరగడం వల్ల.. స్కాల్ప్ మాయిశ్చరైజర్ ని కోల్పోతుంది.

జుట్టుకి బ్రష్ చేయకపోవడం
రాత్రిపడుకోవడానికి ముందు జుట్టుని దువ్వుకోవాలి. దీనివల్ల జుట్టు చివర్లు చిట్లిపోకుండా ఉంటుంది. కాబట్టి.. కొన్ని నిమిషాలు సున్ఇనతంగా దువ్వుకోవాలి.

పోనీటైల్
రాత్రిపూట టైట్ గా పోనీటైల్ వేసుకోకూడదు. దీనివల్ల జుట్టు డ్యామేజ్ అవుతుంది.

టైట్‌గా బ్యాండ్ వేసుకోవడం
రాత్రిపూట టైట్‌గా పోనీటైల్ వేసుకోవడం వల్ల జుట్టు బ్రేక్ అవుతుంది. కుదుళ్లు బలహీనమై.. జుట్టు రాలడానికి కారణమవుతుంది. క్లిప్స్ కూడా టైట్ గా ఉండేవి రాత్రిపూట పెట్టుకోకపోవడం మంచిది.

హెయిర్ ప్రొడక్ట్స్ తో పడుకోవడం
చాలాసందర్బాల్లో సమయం లేకపోవడం వల్ల జుట్టుకి కలర్ వేసుకుని.. వాష్ చేసుకోవడం మరిచిపోయి.. అలానే పడుకుంటూ ఉంటారు. కానీ.. ఇలా పడుకోవడం వల్ల అవి జుట్టుకి హాని చేస్తాయి. 6గంటల కంటే ఎక్కువసేపు జుట్టుపై ఉండటం మంచిది కాదు.

కాటన్ పిల్లో కవర్స్
కాటన్ కాస్త రఫ్ గా ఉంటుంది. ఇవి జుట్టుని డ్రైగా మారుస్తుంది. కాబట్టి సిల్క్ లేదా సాటిన్ పిల్లో కవర్స్ వాడటం మంచిది.

పిల్లో కవర్స్ వాష్ చేయకపోవడం
ఒకే పిల్లో కవర్ ని పదే పదే వాడటం, ఎక్కువ రోజులు వాష్ చేసుకోకపోవడం వల్ల మైక్రోబ్స్ జుట్టుకి హాని చేస్తాయి. చుండ్రు, జుట్టు రాలడానికి కారణమవుతాయి. కాబట్టి శుభ్రమైన పిల్లో కవర్స్ వాడాలి.



Click it and Unblock the Notifications
