Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
జుట్టు సమస్యలను నివారించే షైనీ అండ్ సాప్ట్ హెయిర్ కోసం ప్రోటీన్ రిచ్ హెయిర్ ప్యాక్స్...
సహజంగా జుట్టు సమస్యలు అనేకం...అందుకు కారణాలు కూడా అనేకం. జుట్టు రాలడానికి కారణాలేవైనా, నివారించుకొనే మార్గాల్లో ప్రోటీన్ ట్రీట్మెంట్ ఒకటి . ప్రస్తుత కాలంలో సలూన్స్ లో డిఫరెంట్ టైప్ ప్రోటీన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి . వీటిని మనం ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ఈ హోం మేడ్ ప్రోటీన్ రిచ్ హెయిర్ ప్యాక్ డ్యామేజ్ హెయిర్ ను తిరిగి హెల్తీగా పెరిగేందుకు సహాయపడుతుంది. మరియు జుట్టు హెల్తీగా మరియు షైనీగా పెరగడానికి కూడా సహాయపడుతుంది.
జుట్టు సమస్యలు క్రమంగా తగ్గి, మెరుగుపడుటానికి ఈ ప్రోటీన్ హెయిర్ ప్యాక్స్ గ్రేట్ గా సహాయపడుతాయి . హోం మేడ్ ప్రోటీన్ హెయిర్ ప్యాక్ లో గుడ్డు, పెరుగు, మోయోనైజ్, అవొకాడో, మరియు పాలు వంటి వాటిలో ప్రోటీనులు అధికంగా ఉంటాయి . వీటిని హోం మేడ్ ప్రోటీన్ రిచ్ హెయిర్ ట్రీట్మెంట్స్ లో ఉపయోగించుకోవచ్చు. జుట్టు సమస్యలను నివారించుకోవడానికి ఇంట్లోనే ప్రోటీన్ రిచ్ హెయిర్ ప్యాక్ ను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...

గుడ్డు మరియు పెరుగు:
గుడ్డులో ప్రోటీనులు అత్యధికం మరియు ఇది ఎఫెక్టివ్ మాయిశ్చరైజర్. ఇది జుట్టును మరియు తలను శుభ్రం చూస్తుంది . జుట్టు ఆయిల్ గా ఉన్నట్లైతే ఎగ్ వైట్ ను ఉపయోగించుకోవచ్చు . డ్రై హెయిర్ అయితే గుడ్డులోని పచ్చసొన కూడా ఉపయోగించుకోవాలి. నార్మల్ హెయిర్ ఉన్నవారు ఎగ్ వైట్ అండ్ ఎల్లో రెండింటిని ఉపయోగించండి. గుడ్డు తెల్లసొనలో 5 చెంచాలా పెరుగు చేర్చి మిక్స్ చేసి తలకు అప్లై చేయడం వల్ల ఇది హెయిర్ డ్యామేజ్ ను నివారిస్తుంది. అరగంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

గుడ్డు-తేనె ప్యాక్:
గుడ్డులోని పచ్చసొనకు ఒక చెంచా తేనె మిక్స్ చేసి, అందులోనే బాదం ఆయిల్ కూడా మిక్స్ చేసి, డ్రై హెయిర్ కు ప్యాక్ లా వేసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి. మంచి ఫలితం ఉంటుంది,.

అవొకాడో-కోకనట్ మిల్క్:
కొబ్బరిపాలలో అధిక ప్రోటీనులుంటాయి . అవొకాడోను మ్యాష్ చేసి అందులో 5చెంచాలా పాలు మిక్స్, రెండు చెంచాల ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి . ఇది ఒక ఎఫెక్టివ్ ప్రోటీన్ హెయిర్ ప్యాక్. జుట్టు చాలా ఎఫెక్టివ్ గా పెరుగుతుంది . ఇది డాండ్రఫ్ మరియు హెయిర్ బ్రేకేజ్ ను నివారిస్తుంది.

కోకనట్ మిల్క్ హెయిర్ ట్రీట్మెంట్:
కోకనట్ మిల్క్ లో ప్రోటీనులు అధికంగా ఉంటాయి . దీన్ని హెయిర్ రూట్స్ కు మసాజ్ చేయాలి. అరగంట సేపు షవర్ క్యాప్ ధరించి రాత్రంతా అలాగే ఉంచి, మరుసటి రోజు శుభ్రం చేసుకోవాలి.

బనానా-అవొకాడో హెయిర్ ప్యాక్:
బాగా పండిని అరటిపండు ఒకటి , అవొకాడో ఒకటి , వీట్ జర్మ్ ఆయిల్ మరియు రోజ్ ఆయిల్ తీసుకొని అన్నింటిని మిక్స్ చేయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని పేస్ట్ లా తయారుచేసి తలకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అదే విధంగా కండీషనర్ కూడా అప్లై చేయాలి.

అవొకాడో-మోయోనైజ్:
అవొకాడో మెత్తగా గుజ్జులా చేసి అందులో రెండు మూడు చెంచాలా మోయోనైజ్ మిక్స్ చేసి తలకు కండీషనర్ గా అప్లై చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

అవొకాడో -ఎగ్ హెయిర్ ప్యాక్:
బాగా పండిని అవొకాడో కు రెండు చెంచాలా ఆలివ్ ఆయిల్, ఒక ఎగ్ వైట్ వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు, కేశాలకు పట్టించి 30 తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఈ హెయిర్ ప్యాక్ వల్ల జుట్టు తేమగా మారుతుంది . మరియు హెయిర్ డ్యామేజ్ ను నివారిస్తుంది.

పెరుగు-క్రీమ్-ఎగ్ హెయిర్ ప్యాక్:
మిల్క్ క్రీమ్ లో కొద్దిగా పెరుగు, ఎగ్ వైట్ మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, డీప్ కండీషనర్ గా అప్లై చేయాలి . ఈ హోం మేడ్ ప్రోటీన్ ట్రీట్మెంట్ వల్ల హెయిర్ డ్యామేజ్, హెయిర్ ఫాల్ తగ్గించుకోవచ్చు.

అవొకాడో-కోకనట్ :
బాగా పండిని అవొకాడోను మెత్తగా చేసి అందులో రెండు చేంచాలా కోకోనట్ ఆయిల్ వేయాలి. అలాగే అందులో 10చుక్కల రోజ్మెర్రీ ఎసెన్షియల్ ఆయిల్ కూడా వేసి మొత్తం కలగలుపుకోవాలి. దీన్ని జుట్టు మొదళ్ళకు అప్లై చేయాలి.30నిముషాల తర్వాత తలస్నానం చేయడం వల్ల జుట్టు సాఫ్ట్ గా మరియు సిల్కీగా మారుతుంది.

మోయోనైజ్ ఎగ్ హెయిర్ ప్యాక్:
మోయోనైజ్ మరియు ఎగ్ రెండింటిలో ప్రోటీనులు అధికంగా ఉన్నాయి . రెండు చెంచాలా మోయోనైజ్ లో ఎగ్ వైట్ మిక్స్ చేయాలి. తర్వాత అందులోనే పెరుగు కూడా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి, దీన్ని హెయిర్ ప్యాక్ గా వేసుకోవాడం వల్ల జుట్టు చిక్కును మరియు డ్రై హెయిర్ ను నివారిస్తుంది.



Click it and Unblock the Notifications