Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
స్ట్రాంగ్ అండ్ లాంగ్ హెయిర్ కోసం కర్రీలీవ్స్-కోకనట్ ఆయిల్ హెయిర్ ప్యాక్
హెయిర్ ఫాల్ ప్రస్తుత కాలంలో ఎక్కువగా బాధిస్తున్న సమస్య. తల దువ్వాలంటే భయం, తలస్నానం చేయాలంటే భయం ఎక్కడ ఉన్న జుట్టు ఊడిపోతుందోనని. తల దువ్వుని వెంటనే దువెనలో ఉండే జుట్టు చూసి గుండె దడ? వామ్మో ఇంత జుట్టు ఊడిందేంటీ అని ఒకటే హైరానా పరిపోతుంటారు. జుట్టు రాలడం మొదలైంది, ఇక జుట్టు పల్చబడటం ఖాయం అని చింతిస్తుంటారు?
సెడన్ గా మీరు హెయిర్ ఫాల్ చూసినప్పుడు , మీరు మొదట ఆలోచించాల్సిన విషయం ఆహారపు అలవాట్లు, ఆరోగ్య సమస్యల్లో ఏవైనా మార్పులన్నాయా అన్న విషయం గుర్తించాలి. లైఫ్ స్టైల్, ఫుడ్స్ హ్యాబిట్స్ లో మార్పులే అయితే వెంటనే మార్పులు చేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గించుకోవచ్చు.
అనారోగ్య సమస్యల వల్ల హెయిర్ ఫాల్ అయితే ట్రీట్మెంట్ తో హెయిర్ ఫాల్ తగ్గించుకోవచ్చు.. హెల్తీగా స్ట్రాంగ్ గా ఉండే జుట్టును ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. పుట్టుకతోనే అలాంటి హెల్తీ స్ట్రాంగ్ అండ్ షైనీ జుట్టు పొందనవారు చాలా అదృష్టవంతులు. కానీ ఇతరుల విషయంలో తప్పనిసరిగా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి, హెయిర్ వాల్యూమ్, స్ట్రక్చర్ మరియు హెయిర్ హెల్త్ పెంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

కొన్ని సందర్భాల్లో ఎక్సటర్నల్ గా కాలుష్యం, దుమ్ము, ధూళి, ఫ్రీరాడికల్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా జుట్టు త్వరగా రాలిపోతుంటుంది. హెల్తీగా ఉన్న హెయిర్ ను డ్యామేజ్ చేస్తుంది. ఇంకా చుండ్రు, హెయిర్ ఫాల్ కు గురిచేస్తుంది. అలాంటి జుట్టును ఎవ్వరూ ఇష్టపడురు.
అందమైన , ఒత్తైన పొడవైన జుట్టును పొందాలంటే హెల్తీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. బహిర్గతంగా జుట్టుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్సటర్నల్ గా తీసుకొనే జాగ్రత్తలో కొబ్బరి నూనె మరియు కరివేపాకు హెయిర్ ప్యాక్ గ్రేట్ గా పనిచేస్తుంది . ఈ రెండింటి కాంబినేషన్ హెయిర్ ప్యాక్ వల్ల జుట్టు ఒత్తుగా మరియు పొడవుగా పెరుగుతుంది. అయితే ఈ హెయిర్ ప్యాక్ ను రెగ్యులర్ గా వేసుకోవాలి.
అందుకు కావల్సినవి
కరివేపాకు: ఒక కప్పు
కొబ్బరి నూనె: 2టేబుల్ స్పూన్

కరివేపాకు, కొబ్బరినూనె మిశ్రమం జుట్టుకు కావల్సిన పోషణను అందిస్తుంది . హెయిర్ రూట్స్ ను హెల్తీగా ఉంచుతుంది. దాంతో జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది . ఈ హెయిర్ మాస్క్ హెయిర్ ఫోలిసెల్స్ ను క్రమబద్దం చేస్తుంది. హెయిర్ పెరిగేలా చేస్తుంది . దాంతో హెయిర్ ఫాల్, జుట్టు పల్చబడటాన్ని తగ్గిస్తుంది.
అదనంగా, కొబ్బరి నూనె జుట్టుకు నేచురల్ గా మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. జుట్టును సాప్ట్ గా మరియు సిల్కీగా మార్చుతుంది. కొబ్బరి నూనె మరియు కరివేపాకు కాంబినేషన్ హెయిర్ ప్యాక్ వల్ల హెయిర్ ఫాలీ సెల్స్ స్ట్రాంగ్ గా మారుతాయి మరియు హెయిర్ డెన్సిటి పెంచుతుంది. జుట్టును ఒత్తుగా మరియు బౌన్సీగా పెరిగేలా చేస్తుంది.
ఈ కాంబినేషన్ హెయిర్ ప్యాక్ వల్ల మరో ముఖ్య ప్రయోజనం కూడా ఉంది.తెల్ల జుట్టును నివారిస్తుంది . పొడవాటి నల్ల జుట్టును ప్రోత్సహిస్తుంది.
ఎలా ఉపయోగించుకోవాలి:
ఒక కప్పు కరివేపాకును మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. దీనికి కొద్దిగా కొబ్బరి నూనె మిక్స్ చేయాలి. మిక్స్ చేసి తిరిగి మరోసారి బ్లెండ్ చేయాలి. అంతే మీ హెయిర్ మాస్క్ రెడీ . ఈమాస్క్ ను జుట్టుకు అప్లై చేయాలి. తల , వెంట్రుకలు మొత్తం అప్లై చేసి కొన్ని నిముషాలు మసాజ్ చేయాలి .15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.



Click it and Unblock the Notifications