Latest Updates
-
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక!
తరచూ షాంపు పెడితే జుట్టు ఊడిపోతుందా? ఇలా చేస్తే పోదు, అలా చేస్తే పోతుంది
షాంపూ చేసినప్పుడు కొద్దిగా జుట్టు రాలుతుంది. కొద్దిగా అంటే పర్వాలేదు. అయితే షాంపూ చేసిన ప్రతీసారి విపరీతంగా జుట్టు రాలుతుంటే మాత్రం సమస్యే. అయితే జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే గాఢత ఎక్కువ ఉండే షాంపూల వల్ల జ
షాంపూ చేసినప్పుడు కొద్దిగా జుట్టు రాలుతుంది. కొద్దిగా అంటే పర్వాలేదు. అయితే షాంపూ చేసిన ప్రతీసారి విపరీతంగా జుట్టు రాలుతుంటే మాత్రం సమస్యే. అయితే జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే గాఢత ఎక్కువ ఉండే షాంపూల వల్ల జుట్టు రాలుతుంది. మరి ఎలాంటి షాంపూలు వాడాలి, ఎలాంటి షాంపూల వల్ల జుట్టు రాలుతుంది, ఎలాంటి షాంపూ వాడితే జుట్టు ఆరోగ్యంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

జుట్టు రాలడం తగ్గాలంటే షాంపూలో ఇవి ఉండొద్దు:
సల్ఫేట్లు:
సోడియం లారిల్ సల్ఫేట్, అమ్మోనియం లారిల్ సల్ఫేట్ వంటి సల్ఫేట్లు షాంపూల్లో సాధారణంగా వాడతారు. ఈ సల్ఫేట్లు డిటర్జెంట్లుగా పనిచేస్తాయి. మురికిని పోగడతాయి. కానీ సల్ఫేట్ల వల్ల జుట్టు పొడిగా మారుతుంది. వెంట్రుకలు చిట్లిపోతాయి. సజహ నూనెలు తొలగిపోతాయి.
సోడియం క్లోరైడ్:
తక్కువ మొత్తంలో వాడే సోడియం క్లోరైడ్ జుట్టుకు మంచిది. అధికంగా ఉండే సోడియం క్లోరైడ్ వల్ల స్కాల్ప్, జుట్టు తంతువులకు నష్టం కలిగిస్తాయి. జుట్టు పొడిబారుతుంది. దీని వల్ల జుట్టు రాలుతుంది.
ఫార్మాల్డిహైడ్:
ఉండాల్సినదాని కంటే ఎక్కువ ఫార్మాల్డిహైడ్ వాడితే జుట్టు రాలుతుంది. తలపై దద్దుర్లు వస్తాయి. ఈ రసాయనాల వల్ల ఆరోగ్య సమస్యలూ వస్తాయి.
ఆల్కహాల్:
ఆల్కహాల్ ను షాంపూలో కొద్దిమొత్తంలో వాడతారు. Cetearyl, Stearyl, Cetyl లాంటి ఆల్కహాల్‌లు, సల్ఫేట్‌లతో కలిసినప్పుడు జుట్టుపై ఉండే సహజ నూనెలు తొలగిపోతాయి. వెంట్రుకలు పొడిబారతాయి. దాని వల్ల జుట్టు ఊడిపోతుంది.
ప్రొపైలిన్ గ్లైకాల్, ప్రొపైల్‌పరాబెన్:
ప్రొపైలిన్ గ్లైకాల్, ప్రొపైల్‌పరాబెన్ షాంపూలకు హ్యూమెక్టెంట్‌గా జోడించబడతాయి. హ్యూమెక్టెంట్ యొక్క అధిక సాంద్ర నెత్తిమీద చికాకు కలిగిస్తాయి. జుట్టు రాలుతుంది. హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. జుట్టు పెరుగుదలను తగ్గిస్తుంది.
ఫ్రాగ్రన్స్:
కృత్రిమ సువాసనలు, రంగుల వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. దీని వల్ల స్కాల్ప్, జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి. అలా జుట్టు రాలుతుంది.
థాలేట్స్:
థాలేట్‌లు షాంపూలు, సౌందర్య సాధనాలకు పెర్ఫ్యూమ్ ఫిక్సెటివ్‌లుగా జోడిస్తారు. థాలేట్స్ కృత్రిమ సువాసనల మాదిరిగానే ఉంటాయి. వీటి వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీసి రాలడానికి కారణం అవుతుంది.

షాంపూ వల్ల జుట్టు రాలడాన్ని ఎలా నివారించాలి?
- స్కాల్ప్, జుట్టు రకానికి సరిపోయే షాంపూను ఎంచుకోవడం కీలకం.
- షాంపూ పెట్టడానికి ముందు జుట్టుకు కొబ్బరి నూనె, జోజోబా ఆయిల్, ఆర్గాన్ ఆయిల్, బాదం నూనె ఏదో ఒక నూనె గోరువెచ్చగా చేసి దానిని తలను పట్టించాలి. నూనె పెడుతున్నప్పుడు నెమ్మదిగా మసాజ్ చేయాలి.
- సల్ఫేట్ లేని షాంపూలను ఎంచుకోవాలి.
- జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వకూడదు. తడిగా ఉన్నప్పుడు జుట్టు తంతువులు బలహీనంగా ఉంటాయి. ఆ స్థితిలో కాంబింగ్ చేయడం వల్ల సాధారణం కంటే ఎక్కవ జుట్టు రాలిపోతుంది.
- జుట్టుకు షాంపూ పెట్టిన తర్వాత హెయిర్ కండీషనర్‌ను అప్లై చేసుకోవాలి. దాని వల్ల జుట్టు పొడిబారకుండా ఉంటుంది.
- నాణ్యమైన హెయిర్ కండీషనర్‌ను ఎంచుకోవాలి. సహజ నూనెలు, వెన్న, హైడ్రోలైజ్డ్ కెరాటిన్ మొదలైనవి ఉండేలా చూసుకోవాలి.
- విటమిన్ బి5, విటమిన్ ఈ ఉన్న జుట్టు సంరక్షణ ఉత్పత్తులను వాడాలి.
- జుట్టు ఆరిన తర్వాత మృదువైన బ్రష్‌ను వాడాలి.
- జుట్టు స్టైలింగ్ ఉత్పత్తులను, సాధనాల వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి.
- బిగుతుగా ఉండే అలంకరణ వస్తువులు వాడొద్దు.
- జుట్టును ఎక్కువగా లాగి వేసే హెయిర్ స్టైల్స్ ప్రయత్నించవద్దు.



Click it and Unblock the Notifications
