For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవి సీజన్లో మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి 5 సులభమైన హెయిర్ హక్స్

|

మనం వసంత రుతువులోకి ప్రవేశించినప్పుడు, వేసవి ఇంకేతో దూరంలో లేదు. వేసవి కాలంలో వాతావరణంలో వేడి వల్ల చీకాకు, కోపం వస్తుంది, ఇది మీ జుట్టును కూడా దెబ్బతీస్తుంది. ఈ సీజన్లో సన్‌స్క్రీన్ మీ చర్మాన్ని రక్షిస్తుంది మరియు చర్మం ఆరోగ్యంగా ఉంచడంలో మీకు సహాయపడుతుంది, మీ జుట్టు విషయానికి వస్తే జుట్టును రక్షించడానికి కవచం ఉండదు. దాంతో మీ జుట్టు పెళుసుగా మారుతుంది మరియు సులభంగా జుట్టు తెగిపోతుంది. వేసవి కాలంలో జుట్టు పొడిగా, రఫ్ గా మారుతుంది. ఎక్కువగా జుట్టు పాడటం సాధారణం.

వేసవి కాలంలో మీ అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి దుస్తులు ధరించాలనే ఆలోచనలో మీరు ఇప్పటికే ఉన్నట్లైతే, మీరు ఇప్పటి నుండి సిద్ధం చేసుకుంటారు. అయితే, అలాగే మీ జుట్టును కూడా జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది, ఒక నెల లేదా అంతకన్నా ఎక్కువ కాలం, ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగినప్పటికీ, అవి మంచిగా కనిపించగలవు.

వేసవి కాలం మీ అందాన్ని మరియు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం 5 హెయిర్ హక్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. చూద్దాం రండి..

హెయిర్ కట్ చేయండి

హెయిర్ కట్ చేయండి

మీరు మీ పొడవాటి జుట్టు అంటే మీకు ఎక్కువ ఇష్టమని మాకు తెలుసు, కాని మీరు వాటిని యుగాలలో కత్తిరించలేదనేది అవి రాలిపోవడానికి కారణం, మరియు చాలా తేలికగా బ్రేక్ అవుతాయి. మన జుట్టు మూలాల నుండి పెరుగుతుంది, మరియు జుట్టు చివరలు డ్రైగా మారి చిట్లిపోయే అవకాశం ఉంది, ఎక్కువ రోజులు జుట్టు కత్తిరించక పోవడం వల్ల జుట్టు చూడటానికి అందవిహీనంగా కనబడుతుంది. కాబట్టి మీ జుట్టు చూడటానికి అందంగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి, కనీసం ప్రతి ఆరునెలలకోసారి జుట్టు చివర్లు కట్ చేయడం చాలా ముఖ్యం. మీ జుట్టు రాలేదని మీరు గమనించవచ్చు మరియు జుట్టు కత్తిరించిన తర్వాత మరింత నిర్వహించగలుగుతారు.

జుట్టుకు క్రమం తప్పకుండా నూనె రాయండి

జుట్టుకు క్రమం తప్పకుండా నూనె రాయండి

మన అమ్మలు మరియు నానమ్మలు మన బాల్యం నుండి ఆరోగ్యకరమైన జుట్టుకు మంత్రాన్ని చెప్పారు, కాని మనం వాటి గురించి తెలుసుకోవడానికి , వినడానికి చాలా మొండిగా ప్రవర్తిస్తుంటాము. వేడి మీ జుట్టును దెబ్బతీస్తుంది మరియు వాటిని క్రమం తప్పకుండా నూనె రాయడం వల్ల అవి పోషకంగా మరియు ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. మీ నెత్తిమీద మరియు జుట్టు యొక్క పొడవుకు నూనెను సున్నితంగా వర్తించండి మరియు రాత్రిపూట వదిలివేయండి. ఉదయం మీ జుట్టుకు షాంపూ మరియు కండీషనర్‌తో తలస్నానం చేయాలి. మీరు కేవలం ఒక ఉపయోగంతో గణనీయమైన వ్యత్యాసాన్ని గమనించవచ్చు. జుట్టు చిట్లడం, జుట్టు రాలడం, ఫ్రిజ్ మరియు పొడిబారడం తగ్గించడానికి దీన్ని క్రమం తప్పకుండా చేయండి.

మీ తలను కప్పుకోండి

మీ తలను కప్పుకోండి

మీరు ఇంటి నుండి ఎక్కువ గంటలు, ముఖ్యంగా పగటిపూట బయటకు వెళ్ళినప్పుడు, మీ తలను కండువాతో కప్పడానికి ప్రయత్నించండి. ఇది వేడి కారణంగా ఇతర ఆరోగ్య సమస్యలను నివారించడమే కాక, మీ జుట్టును వేడి మరియు నష్టం నుండి కాపాడుతుంది. ధూళి, కాలుష్య కారకాలు మొదలైనవి కూడా మీ జుట్టు సమస్యలకు కారణం అవుతాయి.

సహజమైన హెయిర్ మాస్క్ లు

సహజమైన హెయిర్ మాస్క్ లు

మీ చర్మం మరియు జుట్టును విలాసవంతం చేయడానికి మీ హెయిర్ ప్యాక్ లను సహజంగా ఉపయోగించుకోండి. మీ జుట్టుకు తరచూ గుడ్డు లేదా పెరుగు మరియు క్రీమ్ ఇతర సహజ హెయిర్ మాస్క్ లను వేయడం ప్రారంభించండి. ఇటువంటి సహజ హెయిర్ మాస్క్‌లు మీ జుట్టును పోషించుటకు మరియు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. చవకైన హెయిర్ స్పా రొటీన్ కోసం మీ వంటగదిలోని పదార్థాలను ఉపయోగించండి.

సరైన సాధనాలను ఉపయోగించండి -

సరైన సాధనాలను ఉపయోగించండి -

మీరు మీ జుట్టును చాలా తరచుగా స్టైలింగ్ చేయకుండా ఉండాలి. అయితే, మీరు చేసినప్పుడు కూడా, మీరు సరైన సాధనాలను ఉపయోగించాలి. మీ స్టైలింగ్ సాధనాలను స్ట్రెయిట్నెర్స్, కర్లింగ్ చేయడానికి ఉపయోగించే హీటింగ్ టూల్స్ చాలా ఎక్కువ ఉష్ణోగ్రతతో ఉండటం వల్ల జుట్టుకు హాని కలుగుతుంది. శుభ్రమైన హెయిర్ బ్రష్ లేదా దువ్వెన ఉపయోగించండి మరియు ప్రతి 6 నెలలకు ఒకసారి వాటిని మార్చండి. స్టైలింగ్ సాధనాల వేడి నుండి మీ జుట్టును సురక్షితంగా ఉంచడానికి హీట్ ప్రొటెక్షన్లను ఉపయోగించండి.

English summary

Five Easy Hair Hacks For The Summer Season To Keep Your Hair Healthy

Want to keep your tresses happy and healthy all summer long? If so, then do read on, as today at Boldsky, we've zeroed in on the most useful tips for maintaining silky and smooth hair when the weather heats up.
Story first published: Wednesday, March 11, 2020, 16:35 [IST]