Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
Hair regrowth oil: ఈ 5 రకాల నూనెలను కలిపి పెట్టుకుంటే జట్టు సమస్యలన్నీ తొలగిపోతాయి
మంచి పొడవైన, లావుగా ఉన్న జుట్టు కావాలంటే కొబ్బరి నూనె, బాదం నూనె, ఆలివ్ ఆయిల్‌ను సమపాళ్లలో తీసుకుని దానికి 10 చుక్కల రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ జోడించి వాడుకుంటే మంచి జుట్టు మీ సొంతం అవుతుంది. అనేక సమస్యలకు పరిష్కారం లభిస
పోషకాహారం తినకపోవడం, పర్యావరణ కాలుష్యం, శారీరక శ్రమ లేకపోవడం, చెడు జీవనశైలి, నిర్వహణ సరిగ్గా లేకపోవడం ఇంకా చాలా కారణాల వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. వెంట్రుకలు చిట్లిపోవడం, పెలుసుబారడం, జుట్టు ఊడిపోవడం, వెంట్రుకలు తెల్లబడటం వంటి సమస్యలు వస్తాయి. రోజుకు 100 వెంట్రుకలు ఊడిపోవడం సాధారణమే అయినప్పటికీ అంతకంటే ఎక్కువ వెంట్రుకలు ఊడిపోతే మాత్రం జుట్టు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన సమయం వచ్చిందని అర్థం చేసుకోవాలి.

ఆరోగ్యకరమైన జుట్టు కోసం పలు రకాల నూనెలు వాడాలని చాలా మంది సలహాలు ఇస్తుంటారు. కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, బాదం నూనె సహా పలు నూనెల్లోని పోషకాల వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్ని రకాల నూనెలు కలిపి జుట్టుకు పట్టిస్తే మంచి ఒత్తైన, పొడవైన జుట్టు మీ సొంతం అవుతుంది. వాటిలోని పోషకాలు జుట్టుకు అంది ఆరోగ్యంగా తయారవుతుంది.
ఇక్కడ పేర్కొన్న ఐదు నూనెలను సమాన మొత్తంలో తీసుకుని వారానికి రెండు సార్లు జుట్టుకు పట్టిస్తే మంచి కుదుళ్లు మీ సొంతం అవుతాయి. చిట్లిపోయిన, పొడిబారిన, పలుచనబడ్డ జుట్ట సమస్యలకు ఇది మంచి పరిష్కారం. ఆ ఐదు నూనెలు ఏమిటి.. అందులోని పోషకాలు జుట్టు ఆరోగ్యానికి ఎలా సహాయపడతాయో ఇప్పుడు చూద్దాం.

కొబ్బరి నూనె
కొబ్బరి నూనె జుట్టులో ప్రోటీన్ నష్టాన్ని తగ్గిస్తుంది. కొబ్బరి నూనెను క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల జుట్టు చిట్లిపోదు. పొడిబారడం, పెలుసుగా మారడం లాంటి సమస్యలకు కొబ్బరి నూనె మంచి పరిష్కారం. కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాటీ చైన్స్ క్యూటికల్‌ను ఉపశమనం చేస్తాయి. జుట్టును లోతుగా హైడ్రేట్ చేస్తాయి.

ఆముదం
ఆముదంలో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఆముదం నూనె తలకు పోషణను ఇస్తుంది. జుట్టు షాప్ట్‌కు అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఇది జుట్టును బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అలా మంచి ఆరోగ్యకరమైన, అందమైన, ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది.

స్వీట్ బాదం నూనె
పొడి జుట్టు చివర్ల చిట్లిపోతుంది. బాదం నూనెను జుట్టుకు రాయడం వల్ల ఈ సమస్య తీరుతుంది. తక్కువ డ్యామేజ్ అయిన జుట్టుచివర్లు పొడవాటి, బలమైన జుట్టును అందిస్తుంది. బాదం నూనెలో పెద్ద మొత్తంలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది సహజ యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. అనేక జుట్టూ సమస్యలు బాదం నూనె ద్వారా పరిష్కరించబడతాయి.

ఆలివ్ నూనె
ఆలివ్ ఆయిల్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. డైహైడ్రోటెస్టోస్టిరాన్ లేదా DHT అనే హార్మోన్‌ను నెత్తిమీద బంధించకుండా నిరోధిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలా జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే జుట్టు పెరుగుతుంది. ఆలివ్ నూనె రాయడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటితో పాటు చుండ్రు సమస్య ఎదుర్కొనే వారికి ఆలివ్ నూనె దివ్యౌషధం అనే చెప్పాలి. ఆలివ్ నూనెలోని యాంటీ ఫంగల్ లక్షణాలు దానిని క్లియర్ చేయడంలో సహాయపడతాయి. ఆలివ్ ఆయిల్ యొక్క మాయిశ్చరైజింగ్ లక్షణాలు జుట్టును పొడిబారకుండా చేసి పెరుగుదలకు ఉపయోగపడుతుంది.

రోజ్మేరీ నూనె
రోజ్మేరీ నూనె జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి మినాక్సిడిల్ వలె ప్రభావవంతంగా పని చేస్తుందని పలు అధ్యయనాలు తేల్చాయి. మగవారిలో వచ్చే బట్టతల సమస్యకు రోజ్మేరీ ఆయిల్ మంచి ఎంపికగా చూస్తారు వైద్యులు.
మంచి పొడవైన, లావుగా ఉన్న జుట్టు కావాలంటే కొబ్బరి నూనె, బాదం నూనె, ఆలివ్ ఆయిల్‌ను సమపాళ్లలో తీసుకుని దానికి 10 చుక్కల రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ జోడించి వాడుకుంటే మంచి జుట్టు మీ సొంతం అవుతుంది. అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.



Click it and Unblock the Notifications
