Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
న్యూ ఇయర్ పార్టీలో అందంగా కనిపించేందుకు హెయిర్ స్టైల్స్
మంచి హెయిర్ స్టైల్‌తో న్యూ ఇయర్ పార్టీలో అందరినీ ఆకట్టుకోవాలంటే ఈ సెలబ్రిటీ ఇన్‌స్పైర్డ్ స్టైల్స్ చూసేయండి
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న న్యూ ఇయర్ రానే వచ్చేసింది. రేపు శనివారం రాత్రి వేడుకలు జోరుగా జరగనున్నాయి. ఫ్రెండ్స్‌తో, బంధుమిత్రులతో న్యూ ఇయర్ పార్టీని మీరు ప్లాన్ చేస్తున్నట్లయితే ఆ పార్టీలో అందంగా కనిపించడానికి ఎంతో ప్రయత్నిస్తుంటారు. డ్రెస్సులు, మేకప్ ఎలాగూ ఉంటుంది అది పక్కన పెడితే మంచి న్యూ ఇయర్ పార్టీకి ఎలాంటి హెయిర్ స్టైల్‌తో వెళ్లాలని కన్‌ఫ్యూజ్ అవుతున్నారా.. అయితే ఇక్కడ కొన్ని హెయిర్ స్టైల్స్ ఉన్నాయి.. మీకూ, మీ డ్రెస్సుకు సరిగ్గా సరిపోయే హెయిర్ స్టైల్ ఎంచుకోండి.

మంచి హెయిర్ స్టైల్‌తో న్యూ ఇయర్ పార్టీలో అందరినీ ఆకట్టుకోవాలంటే ఈ సెలబ్రిటీ ఇన్‌స్పైర్డ్ స్టైల్స్ చూసేయండి
1. స్టైలిష్ మెస్సీ బన్
మెస్సీ బన్ ఈ మధ్యకాలంలో సెలబ్రిటీ ఫ్యాషన్ ట్రెండ్ అయిపోయింది. జుట్టును కొప్పులా చుట్టి పూలు పెట్టుకున్నా, ఏమీ పెట్టకుండా అలా ఉంచేసినా, మెస్సీ బన్ అయినా కొప్పు హెయిర్ స్టైల్‌కు పడిపోవాల్సిందే. వెస్టర్న్ వేర్‌లకు, సాంప్రదాయ దుస్తులకు, చీరలకు, పార్టీ వేర్‌లకు ఇలా మెస్సీ బన్ దేనిపై అయినా సూపర్ లుక్‌ను అందిస్తాయి. న్యూ ఇయర్‌కు పార్టీ వేర్ వేసుకుని మెస్సీ బన్ హెయిర్ స్టైల్‌తో అదిరిపోయే లుక్‌తో పార్టీని అల్లాడించేయోచ్చు.
2. హై పోనీటైల్
హై పోనీటైల్ ఎవర్‌గ్రీన్ ట్రెండ్. అదీ ఇదీ అని కాకుండా ఎలాంటి దుస్తులపై అయినా హై పోనీటైల్ ఎక్సెలెంట్‌గా ఉంటుంది.మేకప్ గ్లామ్ లుక్ కోసం, మెరిసే ఐషాడో, కోహ్లెడ్ కళ్లు, న్యూడ్ పెదవుల రంగుతో మెరుస్తున్న మేకప్ సరిగ్గా సూట్ అవుతుంది. ఇక్కడ కృతి సనన్ మల్టీ కలర్ ప్రింటెడ్ చీరపై హాఫ్ షోల్డర్ బ్లౌజ్ ధరించి హై పోనీటైల్ హెయిర్ స్టైల్ క్యారీ చేస్తుంటే చాలా అందంగా కనిపిస్తోంది కదూ.
3. బ్రెయిడెడ్ హెయిర్‌స్టైల్
క్రిటిక్స్ ఛాయిస్ ఫిల్మ్స్ అవార్డ్స్ ఫంక్షన్‌లో సమంత ఈ లుక్‌లో కనిపిచింది. డార్క్ గ్రీన్ కలర్ గౌనులో అందం కూడా అసూయ పడేలా కనిపించింది సమంత. స్లిప్ డ్రెస్ నూడిల్ పట్టీలు, సీక్విన్డ్ ఎంబ్రాయిడరీ ప్యాచ్‌లు, ప్లంగింగ్ నెక్‌లైన్, పిగర్-హగ్గింగ్ సిల్హౌట్, ఆంకిల్ లెంగ్త్ హేమ్‌తో కనిపించింది. సమంత డ్రెస్ కూడా ఫ్లోర్ స్వీపింగ్ ట్రయిల్‌తో వచ్చింది. గ్లామ్ కోసం డ్యూవీ బేస్, వింగ్డ్ ఐలైనర్, పింక్ చీక్స్‌తో కనిపించింది. పెర్ల్ స్డడ్ ఇయర్ రింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. బ్రెయిడెడ్ హెయిర్ స్టైల్ సమంత అందాన్ని రెట్టింపు చేసింది. సమంత బ్లాక్ హీల్స్ ధరించింది.
4. సైడ్ స్వీప్డ్ హెయిర్డో
బ్లాక్ కలర్ డ్రెస్, సైడ్ స్వీప్డ్ హెయిర్ స్టైల్ తో అనన్య పాండేను అందాల యువరాణిలా కనిపిస్తోంది. న్యూ ఇయర్ పార్టీ కోసం ఈ హెయిర్ స్టైల్ కచ్చితంగా బాగుంటుంది. సైడ్ స్వీప్డ్ హెయిర్డో కొత్తగా, లేటెస్ట్‌గా కనిపిస్తుంది. సూపర్ కూల్ హెయిర్ స్టైల్ న్యూ ఇయర్ నైట్ పార్టీలో మంచి లుక్ ఇస్తుంది. వేవీ హెయిర్ పార్టీ మూడ్ తీసుకు వస్తుంది.



Click it and Unblock the Notifications