మీ జుట్టు రాలడం నివారించి, జుట్టు పొడవుగా ఒత్తుగా పెరగడానికి ఈ ఒక్క నూనె చాలు..!సింపుల్ ట్రిక్స్ కూడా!

మీ జుట్టు రాలడం నివారించి, జుట్టు పొడవుగా ఒత్తుగా పెరగడానికి ఈ ఒక్క నూనె చాలు..!సింపుల్ ట్రిక్స్ కూడా!

భారతీయ ప్రతి వంటగదిలో నిల్వ ఉండే ఆహారపదార్థాల్లో ఒకటి ఉల్లి. ఉల్లిపాయలేనిదే వంటలు పూర్తికావు. వంటల్లో అదనపు రుచిని జోడించే ఈ ఉల్లిపాయలు కేవలం వంటలకు మాత్రమే కాదు, అందంలో ఆరోగ్యంలో దీన్ని విరివిగా ఉపయోగిస్తారు. ఉల్లిపాయలో లెక్కలేనన్ని ఔషధ గుణాలున్నాయి. ఉల్లిపాయలో ఉండే ఔషధ గుణాల వల్ల దీన్ని ఆయుర్వేదం ఔషధ ఉత్పత్తుల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. జుట్టు సంరక్షణకు ఉల్లిపాయ ఆధారిత ఉత్పత్తులను వాడటం చాలా సాధారణం. ఉల్లిపాయలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి సల్ఫర్లు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు అన్ని రకాల సమస్యలను నివారిస్తుంది. ముఖ్యంగా జుట్టు రాలడం నుండి, జుట్టు పల్చబడటం, చుండ్రు, స్కాల్ప్ ఇన్ఫెక్షన్లు , తెల్ల జుట్టు అన్ని సమస్యలను నివారిస్తుంది.

onion oil remedy for hair loss treatment in telugu

ఉల్లియాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ మరియు బ్యాక్టీరియాను నివారించే లక్షణాలు ఉండటం వల్ల దీన్ని హెయిర్ ఆయిల్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలా తయారుచేసిన నూనె తలలో ఎలాంటి సమస్య ఉన్న నివారిస్తుంది. కాబట్టి, ఈ కథనంలో మీరు ఉల్లిపాయ నూనె యొక్క ప్రయోజనాలు మరియు రెమెడీని కనుకొంటారు..

 జుట్టు రాలడానికి గల కారణాలు:

జుట్టు రాలడానికి గల కారణాలు:

పోషకాహార లోపాలు

ప్రతి ఒక్కరిలో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పోషకాహారం చాలా ముఖ్యం. ప్రోటీన్లు జుట్టు పెరుగుదలకు సహాయపడుతాయి. ముఖ్యంగా జింక్, ఐరన్, ఫోలిక్ మరియు మొగ్నీషియం వంటివి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పేలవమైన ఆహారం లేదా క్రాష్ డైట్‌ల వల్ల పోషకాహారలోపంతో జుట్టు నష్టానికి దారి తీస్తుంది.

 హార్మోన్ల అసమతుల్యత

హార్మోన్ల అసమతుల్యత

హార్మోన్ల అసమతుల్యత కారణంగా మహిళల్లో జుట్టు రాలడం చాలా సాధారణం. ముఖ్యంగా మహిళల్లో PCO ఉన్న మహిళల్లో అసాధారణ చర్మం సమస్యలు మరియు జుట్టు రాలడం చాలా సాధారణం.

జన్యుపరమైన సమస్య

జన్యుపరమైన సమస్య

జుట్టు రాలడానికి వంశపారంపర్య కారకాలు కూడా కారణం అవుతాయి. ముఖ్యంగా పురుషుల్లో ఈ సమస్య త్వరగా చూపుతుంది. బట్టతల చాలా త్వరగా ఏర్పడుతుంది. అయితే జుట్టు సమస్యలు స్త్రీలను కూడా ప్రభావితం చేస్తుంది. జన్యు శాస్త్రం జుట్టు రకాన్ని, నాణ్యతను నిర్ణయిస్తుంది. అలాగే కొత్త జుట్టు పెంచే సామర్థ్యాన్ని కూడా తెలుపుతుంది. వంశపారంపర్య సమస్యలు హెయిర్ ఫోలికల్స్ ను ప్రభావితం చేసి జుట్టు రాలడానికి కారణం అవుతాయి.

వయస్సు

వయస్సు

ప్రతి ఒక్కరిలో వృద్ధాప్యం అనేది ఒక సాధారణ జీవ ప్రక్రియ. ఇది చర్మంతో సహా శరీరంలోని ప్రతి భాగాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది చర్మంపై సన్నటి గీతలను బహిర్గతం చేయడం ప్రారంభిస్తుంది. అదేవిధంగా వృద్ధాప్యంలో జుట్టు కూడా ప్రభావితం అవుతుంది. వయసు పెరిగేకొద్దీ, కొత్త జుట్టును ఉత్పత్తి చేసే హెయిర్ ఫోలికల్స్ సామర్థ్యం తగ్గుతుంది, ఫలితంగా జుట్టు పరిమాణం తగ్గుతుంది.

 వైద్య పరిస్థితులు

వైద్య పరిస్థితులు

స్కాల్ప్ ఇన్ఫెక్షన్లు మీ జుట్టు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. చికిత్స చేయకుండా అలాగే వదిలేస్తే, స్కాల్ప్ డిజార్డర్స్ తీవ్రమై జుట్టు రాలడానికి కారణమవుతాయి, ప్రధానంగా ప్యాచ్‌లో, ఇన్ఫెక్షన్ సాధారణంగా ఉంటుంది. ఇంకా, శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం వల్ల, చాలా మంది మహిళలు గర్భం దాల్చిన కొన్ని నెలలకు జుట్టు రాలడం జరుగుతుంది. అదేవిధంగా, థైరాయిడ్, డయాబెటిస్ రోగులు జుట్టు రాలడం సమస్యలను కూడా ఎదుర్కొంటారు.

జుట్టు రాలడం నివారించడానికి ఉల్లిపాయ నూనె

జుట్టు రాలడం నివారించడానికి ఉల్లిపాయ నూనె

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది

ఉల్లిపాయ నూనె తలలో నిర్దిష్ట ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. ఇది జుట్టు పెరుగుదల ప్రోత్సహిస్తుంది. దీని వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది మరియు జుట్టు రాలడం తగ్గుతుంది. ఫలితంగా జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది.

జుట్టు పల్చబడటం మరియు చిట్లడాన్ని నివారిస్తుంది

జుట్టు పల్చబడటం మరియు చిట్లడాన్ని నివారిస్తుంది

ఉల్లిపాయ నూనెలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు చిట్లడం, జుట్టు పల్చబడటం మరియు తెల్లగా వెంట్రులకల సమస్య ను కూడా నివారిస్తుంది. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు బలంగా పెరగడానికి అవసరమైన ప్రొటీన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.

చిన్న తలనంలోనే జుట్టు తెల్లగా మారకుండా ఆలస్యం చేస్తుంది

చిన్న తలనంలోనే జుట్టు తెల్లగా మారకుండా ఆలస్యం చేస్తుంది

ఉల్లిపాయ నూనెలోని కొన్ని ఎంజైమ్‌లు మీ జుట్టును ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుండి రక్షిస్తాయి మరియు ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ ను నివారించడంలో సహాయపడతాయి. అలాగే తెల్ల వెంట్రుకలు ఉన్నవారు ఈ నూనెను వాడితే నెరిసిన జుట్టు నల్లగా మారుతుంది.

తలలో pH స్థాయిని నిర్వహిస్తుంది

తలలో pH స్థాయిని నిర్వహిస్తుంది

మంచి జుట్టుకు కీలకం తలపై పోషణ మరియు సమతుల్యత, ఇది ఉల్లిపాయ నూనె మీ తలలో జుట్టు యొక్క pH స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. ఉల్లిపాయ నూనెను రెగ్యులర్ గా తలకు రాసుకోవడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, చుండ్రు మరియు దురద వంటివి రాకుండా ఉంటాయి.

సహజ కండీషనర్‌గా పనిచేస్తుంది

సహజ కండీషనర్‌గా పనిచేస్తుంది

తలస్నానం చేయడానికి ముందు ఉల్లిపాయ నూనెతో మీ జుట్టుకు మసాజ్ చేయండి, అరగంట లేదా గంట తర్వాత తలస్నానం చేయండి. ఇలా చేయడం వల్ల మీ జుట్టులో సహజ తేమని కోల్పోకుండా సహజ కండీషనర్ గా పనిచేస్తుంది. ఒక వేల తలస్నానానికి ముందు ఉల్లిపాయ నూనెను రాసుకోకపోతే, తలస్నానం తర్వాత ఉల్లి కండీషనర్ ను అప్లై చేయవచ్చు.

 జుట్టు ఆకృతిని మెరుగుపరుస్తుంది

జుట్టు ఆకృతిని మెరుగుపరుస్తుంది

తలకు తరచుగా ఆనియన్ ఆయిల్ పెట్టడం వల్ల మీ జుట్టు మెరిసేలా, మృదువుగా, తేమగా మరియు చిక్కు లేకుండా చేస్తుంది. ఉల్లిపాయ రసం మరియు తేనె కలిపి వాడటం వలన జుట్టు రాలడాన్ని నివారించడంలో చాలా సహాయపడుతుంది. కాబట్టి, ఉల్లిపాయ రసం మరియు తేనె మిశ్రమాన్ని తలకు 30 నిమిషాలు పట్టించండి. దీన్ని ఒకటి నుండి రెండు వారాల పాటు క్రమం తప్పకుండా వాడండి మరియు ఫలితాలను చూడండి.

 నూనెతో చికిత్స

నూనెతో చికిత్స

జుట్టు స్ట్రాంగ్ గా ఉండాంటే గోరు వెచ్చని నూనెను తలకు అప్లై చేయాలి. అందుకు ఉల్లిపాయ నూనెను నేరుగా లేదా ఇతర రెగ్యులర్ నూనెతో కలిపి గోరువెచ్చగా చేసి తలకు పట్టించి మసాజ్ చేయాలి. ఇది కూడా ఒక పద్దతి ప్రకారం చేతిలో నూనె వేసుకుని బాగా రబ్బ చేసి జుట్టు కుదుళ్ళ నుండి అప్లై చేయాలి. తర్వాత సున్నితంగా మసాజ్ చేయండి. రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. మంచి ఫలితాలు చూడాలంటే దీన్ని వారానికి రెండు , మూడు సార్లు రిపీట్ చేయండి.

Desktop Bottom Promotion