Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మేకప్ ఎక్కువ సేపు అలాగే ఉండాలంటే కొన్ని చిట్కాలు
అందంగా పుట్టడం, పెరగటం అనేది ఒర వరం. దాన్ని ద్విగుణీకతం చేసుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. చక్కని ముస్తాబు, ఒద్దికైన డ్రెస్సింగ్, ఒంటికి కచ్చితంగా సూటయ్యే నగలతోపాటు మేకప్ లో మెలకువలు తెలుసుకుంటే ఎలాంటి ముగువైనా తనకున్న పార్టీలు పంక్షన్లలో అందంగా కనిపించవచ్చు. ముఖ్యంగా కాస్మోటక్స్ విషయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తే పార్టీలు.. ఫంక్షన్లలో మీరే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అవుతారు. అయితే ఎవరు ఎలాంటి రంగులు వాడాలో తెలుసుకోవాలి. మన చర్మం ఏ రంగులో ఉంటే ఆ రంగు ఉపయోగిస్తే మంచిది. అలాగే వాతావరణం బట్టి మేకప్ సరిగణలోనికి తీసుకోవాలి. వేసవిలో వాడే రంగులు శీతాకాలంలో..శీతాకాలంలో వాడే రంగులు వేసవిలోనూ అంత ఎఫెక్టివ్ గా ఉండకపోవచ్చు. కనుక కాలాన్ని అనుసరించి, వారివారి వయస్సును బట్టి కూడా మేకప్ వేసుకోవాలి.
ఒక అందమైన ముఖానికి మేకప్ వేసుకుంటే మరింత ఎక్సట్రా అందంతో కనబడుతారు. ముఖ్యంగా మహిళలు ఇటువంటి లక్షణాలు కలిగి ఉండటం సహజం. అయితే మేకప్ వేసుకొనే వారు కొన్ని ట్రిక్స్ మరియు టిప్స్ ను ఫాలో అవ్వాలి. లేదంటే, మీరు వేసుకొన్న మేకప్ కొద్ది సమయంలోనే ఫేడ్ అయిపోవడం లేదా పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది. అలా జరగకుండా రోజంతా మేకప్ అలాగే ఉండాలంటే కొన్ని టిప్స్ మరియు ట్రిక్స్ ను మీకోసం ఈ క్రింది విధంగా అందిస్తున్నాము.

ఎక్స్ ఫ్లోయేట్
మేకప్ వేసుకొనే రోజు, మేకప్ వేసుకొనే ముందు, మీ చర్మం హెల్తీగా మరియు క్లీన్ గా ఉండలి. అందువల్ల ఎక్స్ ఫ్లోయేట్ చేయడం వల్ల చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ తొలగింపబడుతాయి. అందుకు మైక్రో బీడ్ స్ర్కబ్ లేదా తిన్ క్లాత్ ను ఉపయోగించాలి.

మాయిశ్చరైజర్
మేకప్ వేసుకోవడానికి ముందు మాయిశ్చరైజర్ ను అప్లై చేయడం వల్ల మేకప్ డ్రై అవ్వకుండా లేదా ప్యాచ్ లాగా మారకుండా ఉంటుంది. అందుకు మీరు ముందుగా ఆయిల్ ఫ్రీ లేదా మ్యాట్ ఫైయింగ్ లోషన్ ను ఎంపిక చేసుకోవాలి. మాయిశ్చరైజ్ తో మొదలు పెట్టాలి.

ప్రైమర్
ప్రైమర్ వల్ల మీ చర్మం మీద లేయర్స్ ఏర్పడం లేదా మీరు ఉపయోగించే బ్యూటీ ప్రొడక్ట్స్ నుండి మీ చర్మానికి రక్షణ కల్పించడం మాత్రమే కాదు, ఇది మేకప్ ను చెదిరిపోనివ్వకుండా, ఎక్కువ సమయం అలాగే ఉంటుంది. అందుకు, ఒక ఉత్తమ ప్రిమర్ ను ఎంపిక చేసుకుంటే, మీ చర్మం హైడ్రేషన్ కు గురికాకుండా ఎక్కువ సిలికాన్ కు గురికాకుండా ఉంటుంది.

ఫౌండేషన్
మధ్యస్థంగా ఫౌండేషన్ ను ఉపయోగించాలి. మీ చర్మం మీద పిగ్మెంటేషన్ ఉన్నట్లైతే, లేదా ఎవిధమైన మచ్చలు లేదా చర్మం మీద చారలను కనబడనీయకుండా హైడ్ చేయాలంటే, ఫౌండేషన్ కు ముందు లైట్ గా కన్సీలర్ ను ఉపయోగించాలి. దీని వల్ల మచ్చలు, చారలులు కనబడనీయకుండా చేస్తాయి . అయితే ఈ కన్సీలర్ ముఖం అంతా వేసుకోకుండా జాగ్రత్త పడండి.కేవలం మచ్చలు, చారలున్న ప్రదేశంలో మాత్రమే కన్సీలర్ ఉపయోగించాలి. మేకప్ ఎప్పుడూ మీడియం కవరేజ్ ఉన్నట్టు వేసుకోవాలి. లేదంటే ప్యాచ్ లుగా తయారవుతుంది. మీ ముఖ చర్మం క్లియర్ గా ఉంటే మాత్రం ఎక్కువ మేకప్ అవసరం ఉండదు, అప్పుడు మీరు షీర్ కవరేజ్ ఫౌండేషన్ లేదా బిబి క్రీమ్స్ ను ఎంపిక చేసుకోవచ్చు.

పౌడర్
మేకప్ వేసుకొనేటప్పుడు ఆయిల్ స్కిన్ రోజు మొత్తం మెయింటైన్ చేయడానికి, పౌడర్ ఒక్కటే ఒక ఫర్ ఫెక్ట్ పరిష్కార మార్గం. అందుకు మీరు ట్రాన్సులూసెంట్ లూజ్ పౌడర్ కు బదులుగా ఒక స్ట్రాంగ్ మ్యాటిఫైయింగ్ ప్రెస్ పౌడర్ ను ఉపయోగించాలి. అలాగే కళ్ళ క్రింది ఫౌండేషన్ సెట్ చేయడానికి పౌడర్ పఫ్ ను ఉపయోగించాలి. అలాగే పెద్ద పౌడర్ బ్రష్ ను కూడా ఉపయోగించి కళ్ళకు మేకప్ చేసుకోవాలి.

బుగ్గలకు క్రీమ్ ఫార్ములాస్ మరియు పౌడర్స్
మీ బుగ్గలు అందంగా చబ్బీచబ్బీగా కనబడాలంటే, మీరు ఖచ్చితంగా క్రీమ్ ఫార్ములాస్ మరియు సేమ్ షాడ్ కలిగిన పౌడర్స్ ను ఉపయోగించాలి .

వాటర్ ఫ్రూఫ్ ఐలైనర్, క్రీమ్ ఐషాడోస్
కళ్ళు అందంగా కనబడాలంటే వాటర్ ఫ్రూఫ్ ఐ లైనర్స్ మరియు మస్కరాలను ఉపయోగించాలి. ముఖ్యంగా కళ్ళ మేకప్ విషయంలో స్మడ్జ్ ఫ్రూఫ్ క్రీమ్ షాడోలను ఎంపిక చేసుకోవాలి. మేబెల్లిన్ బ్రాండ్ లో వివిధ రకాల కలర్స్ అందుబాటులో ఉన్నాయి. వాటర్ ఫ్రూఫ్ క్రీమ్ ఐ షాడోలు ఉన్నాయి మరియు ఇవి కొంచెం రీజనబుల్ గానే ఉన్నాయి.

పెదాలకు మాయిశ్చరైజింగ్ ఫార్ములా
చాలా వరకూ కొన్నిలిప్ కలర్స్ త్వరగా చెరిగిపోతుంటాయి మరియు త్వరగా డ్రైగా మారుతుంటాయి. అందుకోసం ముందుగా లిప్ లైనర్ లేదా లిప్ స్టైన్ తో పెదాలకు ముందుగా కోటింగ్ ఇచ్చి ఆ తర్వాత లిప్ స్టిక్ ను ఉపయోగించాలి. ఇంకా మాయిశ్చర్ మరియు ఫ్లాక్ ఫ్రీ లిప్ ఫార్ములా ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి.

చివరి చిట్కా
అలాగే మీ వెంటతీసుకెళ్లే బ్యాగులో కొన్ని టిష్యు పేపర్స్ ను లేదా పౌడర్ పఫ్స్ ను తీసుకెళ్ళాలి. దాంతో రోజంతా మీరు ఆయిల్ ఫ్రీ స్కిన్ కలిగి, డ్రైగా ఫ్రెష్ గా ఉంటారు. చెమట పట్టినట్లు, లేదా ఆయిలీగా అనిపించినప్పుడు మరియు డ్రై అవుతున్నప్పుడు, టిష్యు లేదా పౌడర్ పఫ్ తో రుద్దకుండా జస్ట్ ప్రెస్ చేసుకోవాలి.



Click it and Unblock the Notifications











