Latest Updates
-
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.! -
సాయంత్రం వేళ ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించాలి?అష్టైశ్వర్యాలు తెచ్చే అద్భుతమైన మార్గం.. -
చేతి గోళ్లు ఇలా ఉంటే కిడ్నీల ఆరోగ్యానికి వార్నింగ్.. మీకూ ఇలా ఉందా.? -
ఈ పద్ధతిలో అల్లం చట్నీ చేస్తే.. ఎవరైనా సరే నాలుగు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి సొరకాయ దోశ..అప్పటికప్పుడు ఈజీగా చేసుకోండిలా.. -
మంచి భర్త కోసం ఉపవాసం చేస్తున్నారా.. కానీ శివారాధనలో అమ్మాయిలు చేసే పొరపాట్లు ఇవే.! -
కుజ- చంద్రుల కలయికతో మహాలక్ష్మి రాజయోగం.. ఎనలేని సంపద సిద్ధించే ఈ రాశుల్లో మీరు ఉన్నారా.! -
చపాతీలో ఫేవరెట్ పనీర్ మెంతి కర్రీ.. రెస్టారెంట్ స్టైల్లో ఇలా అదరగొట్టేయండి.! -
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.! -
నోరూరించే కాజు చికెన్ పకోడీ.. ఇలా చేస్తే ఎంత తిన్నా తృప్తి తీరదు!
ఎండాకాలంలో జుట్టుకు ఆయిల్ రాయాలా? వద్దా? నిపుణులు ఏమంటున్నారో తెలుసా..
ఈ రోజుల్లో చాలామందిని వేధించే సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. అయితే జుట్టుకి ఆయిల్ పెడితే వెంట్రుకలు ఊడిపోవు బలంగా ఉంటాయని తరచుగా పెద్దలు,నిపుణులు చెబుతుండటం మనం చూస్తుంటాం. వాస్తవానికి జుట్టుకు నూనె రాయడం వల్ల చాలా ఉపయోగాలే ఉంటాయి. అయితే ఎండాకాలంలో చాలామంది జుట్టుకు ఆయిల్ రాసుకోరు. సమ్మర్ లో చెమట, దుమ్ము, కాలుష్యం వల్ల జుట్టు జిడ్డుగా మారడం, నిర్జీవంగా తయారవడం, చిట్లడం వంటి సమస్యలు సాధారంగా వస్తుంటాయి. దుమ్ము,ధూళి, మట్టి సలుభంగా అంటుకుంటాయి. దీంతో ఆయిల్ రాయాలా వద్దా అనే సందేహం చాలామంది సందేహిస్తుంటారు.
సమ్మర్ లో జుట్టుకి ఆయిల్ రాయాలా? వద్దా?
వాస్తవానికి ఏ కాలమైనా సరే మీ జుట్టుకు నూనె రాయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా వేసవిలో ఇది మరింత అవసరం అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఎండ తాపానికి మీ జుట్టు బలహీనంగా మారుతుంది. అధిక చెమట,తేమ జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తాయి. దీనికి తోడు సూర్య కిరణాల తాకిడి వల్ల జుట్టు పొడిబారి తన సహజత్వాన్ని కోల్పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయిల్ రాయడం జుట్టుకి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.

ఆయిల్ రాయడం వల్ల కలిగే ప్రయోజనాలు
బలాన్నిస్తుంది
నూనె మీ జుట్టు కుదుళ్లకు పోషణను అందించి..వాటిని బలంగా చేస్తుంది. తద్వారా జుట్టు రాలడం తగ్గుతుంది.
మెరుపునిస్తుంది
నెత్తికి ఆయిల్ రాయడం వల్ల మీ జుట్టు పొడిబారకుండా ఉంటుంది. ఇది జుట్టుకు సహజమైన మెరుపును అందించి ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది.
మృదుత్వాన్నిస్తుంది
ఎండాకాంలో గరుకుగా మారిన జుట్టును ఆయిల్ మృదువుగా చేస్తుంది. దువ్వెనతో సులభంగా దువ్వుకోవడానికి సహాయపడుతుంది.
పెరుగుదలను ప్రోత్సహిస్తుంది
సరైన నూనెతో మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.
హాని నుండి రక్షిస్తుంది
ఆయిల్ ఒక పొరలా ఏర్పడి, దుమ్ము, కాలుష్యం, సూర్యకిరణాల యొక్క హానికరమైన ప్రభావాల నుండి మీ జుట్టును కాపాడుతుంది.
ఏ ఆయిల్ మంచిది
సమ్మర్ లో కొబ్బరి నూనె,ఆలివ్ ఆయిల్,విటమిన్ C తో నిండి ఉండే బాదం నూనె జుట్టును మరింత ఆరోగ్యంగా ఉంచుందని..సమ్మర్ లో ఈ మూడింటిలో ఒకదాన్ని మీ జుట్టు రకాన్ని బట్టి ఎంచుకోవాలని నిపుణులు సూచించారు.
సమ్మర్ లో నూనె రాసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
-ఎక్కువ నూనె రాయకండి. కొద్దిగా రాసినా సరిపోతుంది. ఎక్కువ రాస్తే దుమ్ము, మురికి అతుక్కునే అవకాశం ఉంది.
-షాంపూ చేసే ఒక గంట ముందు నూనె రాయడం బెస్ట్.
-నూనె రాసిన తర్వాత నెమ్మదిగా మీ వేళ్లతో మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
-నూనె రాసుకున్న వెంటనే ఎండలోకి వెళ్లకండి. ఒకవేళ వెళ్లాల్సి వస్తే మీ జుట్టును కవర్ చేసుకోవడం మంచిది.



Click it and Unblock the Notifications