Latest Updates
-
పరాభవ నామ సంవత్సరానికి స్వాగతం..మీ ఫ్రెండ్స్, బంధువులకు బెస్ట్ ఉగాది విషెస్, వాట్సాప్ స్టేటస్ లు ఇలా.. -
Ugadi Pachadi Recipe: కేవలం పచ్చడి కాదు, దివ్యౌషధం..పక్కా కొలతలతో సంప్రదాయ ఉగాది పచ్చడి..ఎలా చేసుకోవాలంటే.. -
ఉగాది పచ్చడి ఎందుకు తినాలి? ఎన్ని రోజులు తినాలి? ఈ రహస్యం మీకు తెలుసా? -
ఉగాది సంప్రదాయ వంటకాలు: జస్ట్ 20 నిమిషాల్లో సజ్జ బూరెలు, కొబ్బరి బూరెలు..ఎలా చేసుకోవాలంటే. -
రాగి పూరీ-ఉల్లిపాయ మసాలా..లెక్కలేకుండా తినేయడం గ్యారెంటీ! -
అన్నం, పప్పు,పరాఠా, రోటీల్లోకి బెస్ట్ కాంబినేషన్..రాజస్థానీ స్పెషల్ వెల్లుల్లి ఎర్ర మిరప చట్నీ -
ఉగాది స్పెషల్..ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ క్రంచీ బేబీ కార్న్ 65..వాహ్ అనిపించే బెస్ట్ స్టార్టర్! -
గుంటూరు కారం పొడి, చిట్టి ఇడ్లీ..ఇలా చేస్తే ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే! -
నో గ్యాస్, నో స్టవ్.. నిమిషాల్లో తయారయ్యే కమ్మని పల్లెటూరి రోటి పెరుగు పచ్చడి..ప్లేట్ అన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
రోజూ తినే పప్పు బోర్ కొట్టిందా? అయితే ఈ ధాబా స్టైల్ దాల్ తడ్కా ట్రై చేయండి..గిన్నెలు గిన్నెలు లేపేస్తారు!
యవ్వనత్వంతో మెరిసిపోయేలా చేసే 7 బ్యూటీ సీక్రెట్స్...
అందంగా అలంకరిచుకోవడం అంటే శరీరంలో అన్నీ బాగాలపై శ్రద్ద పెట్టి ప్రత్యేకంగా కనిపించేలా చేయడమే. శరీరం ఆరోగ్యంగా ఉంటే అంతకంటే అందం మరొకటి ఉండదు. ఎందుకంటే మనుషి అందంగా కనబడాలంటే చర్మం ఆరోగ్యంగా ఉండాలి. అందం అనేది బయటకు కనిపించేది మాత్రమే కాదు. లోపల ఆరోగ్యంతో కూడా ముడిపడి ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ముందుగా మార్పుకు గురయ్యేది చర్మం. మనంఇలాంటి మార్పులను అంత తొందరగా ఆహ్వానించలేం. ఒప్పుకోలేం. ఆ మార్పును మరికొంతకాలం వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తాం. ముఖ్యంగా ముఖం, మెడపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం. అప్పటికప్పుడు తీసుకునే చర్యలవల్ల చర్మం ఏ మాత్రం మెరుగుపడదు. వయసుతో నిమిత్తం లేకుండా శ్రద్ధ తీసుకున్నప్పుడు సొగసైన అందం సొంతమవుతుంది.
సాధారణంగా చాలా మంది అందంగా కనబడటం కోసం ఏదో ఒక వయస్సుల్లో ఆరాటపడటం సహజం. అయితే ముఖ్యంగా స్త్రీలలో అన్ని వయస్సుల వారు.. అందంగా కనబడుటానికి ప్రయత్నిస్తుంటారు. అందుకోసం చాలా రకాల బ్యూటీ టిప్స్ ఆచరించడమే కాకుండా కొన్ని వందలు, వేళల్లో రకరకాల బ్యూటీ ప్రొడక్ట్ ను కూడా ఉపయోగించి ఉంటారు. అయితే అవన్నీ నిరుపయోగమే అయితే...సహజంగా అందంగా కనబడేలా చేసి కొన్ని బ్యూటీ సీక్రెట్స్ మీకోసం...

బ్యూటీ సీక్రెట్ 1-వాటర్
బ్యూటీ సీక్రెట్ 1-వాటర్: ఆలోచిస్తే నీరు బ్యూటీ సీక్రెట్ కాదు? అచితే నీటిలో ఉండే గుణాలే మిమ్మల్ని బ్యూటిఫుల్ గా కనబడేలా చేస్తుంది. రోజులో ఎన్ని గ్లాసుల నీళ్ళు తాగామన్నది కాకుండా దాహం వేసినప్పుడల్లా నీళ్ళు తాగాలి. నీళ్ళను తాగడం వల్ల చర్మ డీహైడ్రేట్ అవుతుంది. దాంతో చర్మం ఎప్పుడూ తేమగా మెరుస్తుంటుంది. పొడిబారదు. కాబట్టి నీటి బ్యూటీ సీక్రెట్ గా పరిగణలోనికి తీసుకోవచ్చు.

బ్యూటీ సీక్రెట్2-సన్ స్ర్కీన్ తప్పనిసరి
బ్యూటీ సీక్రెట్2-సన్ స్ర్కీన్ తప్పనిసరి: యవ్వనంగా కనబడాలంటే సన్ స్ర్కీన్ లోషన్ తప్పనిసరి.సూర్యరశ్మి ద్వారా చర్మం మీద పడే ఆల్ట్రా వయోలెట్ కిరణాలనాల ద్వారా వయస్సు పైబడినవారిగా లేదా చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి వాటిని నుండి బయట పడాలంటే ముందుగానే సన్ స్ర్కీన్ లోషన్ తరచూ చర్మాన్నికి రాస్తుండాలి. సన్ స్క్రీన్ రాయడం వల్ల చర్మ స్మూత్ గా షైనిగ్ తో మెరుస్తుంటుంది. అయితే సన్ స్క్రీన్ బాడీకి అప్లై చేసిన తర్వాత పదిహేను నిముషాలు బయటకు పోకుండా ఉండటవల్ల క్రీము చర్మంలోనికి బాగా ఇమిరి అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది.

బ్యూటీ సీక్రెట్ 3-మాయిశ్చరైజర్
బ్యూటీ సీక్రెట్ 3-మాయిశ్చరైజర్: బాడీలోషన్ తో శరీరాన్ని మాయిశ్చరైజ్ చేయాలి. బాడీలోషన్ శరీరానికి మర్ధన చేయడం వల్ల శరీరం స్లిమ్ గా.. అందంగా కనబడేలా చేస్తుంది. అయితే మాయిశ్చరైజింగ్ క్రీములు ఎంపిక చేసుకొనేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఎస్ ఎప్ పి ప్లస్ కలిగినటు వంటివి చర్మ సౌందర్యానికి బాగా పనిచేస్తాయి.

బ్యూటీ సీక్రెట్ 4-చేతుల మరియు మెడ అధిక ప్రాధాన్యత
బ్యూటీ సీక్రెట్ 4-చేతుల మరియు మెడ అధిక ప్రాధాన్యత: చేతులు, మరియు మెడను కూడ ముఖానికి ఇచ్చినంత ప్రాధాన్యతను ఇవ్వాలి. ఎందుకంటే ముఖం తర్వాత అందంగా కనబడే అవయవాలు అవే కాబట్టి వాటి అందం ముఖ్యం. ముఖం కడిగే ప్రతి సారి చేతులు, మెడను కూడా శుభ్రం చేసి మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. మీ చర్మానికి సరిపడే క్రీమును మాత్రమే వాడాలి. అలా చేయడం వల్ల ముఖం ఎంత అందంగా కనిపిస్తుందో, చేతులు మెడ కూడా అంతే అందంగా కనబడుతాయి.

బ్యూటీ సీక్రెట్ 5- వ్యాయామం
బ్యూటీ సీక్రెట్ 5- వ్యాయామం: అందంగా కనబడాలంటే చక్కటి శరీర ఆకారం ఉండాలి. అందుకోసం ఎక్సర్ సైజ్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ముఖంలో మెరుపు రావాలంటే ఫేషియల్స్ ఒక్కటే సరిపోదు. అందుక తగ్గ ఫేస్ ఎక్సర్ సైజ్ లు కూడా చేస్తుండాలి. ఫేస్ ఎక్సర్ సైజ్ చేయడం వల్ల బ్లడ్ సర్కులేషన్ బాగా జరిగి ఆక్సిజన్ కెపాసిటినీ పెంచుతుంది.

బ్యూటీ సీక్రెట్ 7- సంతోషంగా ఉండాలి
బ్యూటీ సీక్రెట్ 7- సంతోషంగా ఉండాలి: ప్రతి నిత్యం సంతోష్యంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో .. అప్పుడు అటోమేటిక్ గా ముఖంలో గ్లో వస్తుంది. కాబట్టి సంతోషంగా ఉండాటానికి ప్రయత్నించి చిరునవ్వులు చిందించండి...లైఫ్ ను ఎంజాయ్ చేయండి...



Click it and Unblock the Notifications











