Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చర్మకాంతిని పెంచే బ్లీచింగ్ తో జర జాగ్రత్త సుమా....

సాధారణంగా స్కిట్ టాన్ మారిపోగానే మహిళలు బ్లీచింగ్ చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు. స్కిన్ కలర్ చేంజ్ అవ్వడానికి ఎంచుకుంటున్న ఏకైక మార్గం ఇది. దీనిని ఉపయోగించడం వల్ల ఇందులో ఉన్న కెమికల్స్ చర్మానికి హాని కలిగించడమే కాకుండా... చర్మంలో ఉన్న సహజమైన నూనెలను తొలగించి... మరింత పొడిబారడానికి దారి తీస్తాయి. ఇంకా రెగ్యలర్‌గా ఉపయోగించడం వల్ల... చర్మం పాలిపోతుంది. లేదా కమిలిపోతుంది.
ఫౌండేషన్ క్రీమ్స్, బ్లీచింగ్ ఏజెంట్స్, కలర్ మాస్కర్స్, ఫెయిర్ నెస్ క్రీమ్స్.
1. బ్లీచింగ్ ఏజెంట్స్: ఫేషియల్స్, బ్లీచ్ చేసిన ప్రతిసారీ చర్మం పైన ఉండే మృతకణాలు (స్ట్రేటమ్ కార్నియమ్) ఊడిపోయి.. ముఖం తేటగా, అందంగా మెరుస్తుండే మాట వాస్తవమే. అయితే ఇది కేవలం తాత్కాలికం. ఇలా మరీ తరచూ బ్లీచ్ చేస్తుంటే ముఖానికి ఏం రాసినా మంటగా అనిపించే 'కాస్మొటిక్ ఇన్ టాలరెన్స్ సిండ్రోమ్' వస్తుంది. అలాగే చర్మం సహజత్వం, స్వభావం మారిపోయి ముఖం కాస్త వికృతంగా కూడా తయారవుతుంది.
2. బ్లీచ్ కోసం.. రకరకాల ఫ్రూట్ పీల్స్, ఫ్రూట్ యాసిడ్స్ వాడటం వల్ల మొటిమలు, చీము పొక్కులు చాలా ఎక్కువగా వస్తుంటాయి. పీల్స్ గాఢంగా ఉంటే చర్మం నలుపు తిరిగే అవకాశమూ ఉంటుంది. అలాగే పీల్స్ చేయించుకోగానే ఎండలోకి వెళితే చర్మం నల్లబారే అవకాశం ఎక్కువ.
3. ఫెయిర్‌నెస్ క్రీములు: వీటితో ముఖం మీద వెంట్రుకలు దట్టంగా పెరిగే అవకాశాలుంటాయి.



Click it and Unblock the Notifications