Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
స్త్రీకైనా.. పురుషుడికైనా సహజ పద్దతుల్లోనే సౌందర్యం సాధ్యం...

1. ముఖానికి మసాజ్ ఎంతో మేలు : దీనికోసం మీరు మసాజ్ సెంటర్లకు వెళ్లనక్కర్లేదు, ప్రతీ రాత్రి మీకు నచ్చిన మాయిశ్చరైజర్‌తో ఐదు నిమిషాల పాటు ముఖంపై నెమ్మదిగా మర్దనా చేయండి. మసాజ్ చేయించుకున్నంత ఫలితం పొందుతారు.
2. పైన చెప్పిన విధంగా మర్దనా చేస్తూ మాయిశ్చరైజర్‌ను ముఖానికి పట్టించి మెడ కింది భాగం నుండి గడ్డం వరకు వ్రేళ్లతో మర్దనా చేయాలి, ఇలా చేయడంతో మీ ముఖం కందినట్లు కనిపించినా, ముఖానికి కావలసినంత ఆక్సిజన్ లభిస్తుంది.
3. మీకు ముడతలు లేని చర్మం కావాలంటే..మీరు నిద్రించేప్పుడు ముఖం వైపు పైకి ఉండేలా నిద్రించండి. పక్కకు మరియు బోర్లా పడుకునే వారికి ఎక్కువగా చర్మంపై ముడతలు త్వరగా ఏర్పడుతాయి.
4. మీ ముఖం డల్ గా కాంతి హీనంగా ఉందా? చిన్నచిన్న చిట్కాలతో మళ్లీ చర్మానికి కాంతి చేకూర్చండి. మీ చేతి వ్రేళ్లతో మీ చర్మానికి జీవకళ తీసుకురావచ్చు, కంటిపై ఎముకభాగం నుండి ముక్కు వరకు అక్కడి నుండి బుగ్గల ఎముక భాగాల వరకు మీ చేతి వ్రేళ్లతో పైకి కిందకు నెమ్మదిగా మర్దనా చేయండి.
5. ఆహార అలవాట్లపై దృష్టి ఉంచండి: పరిశుభ్రమైన ఆహారంతో మీ చర్మానికి కావలసిన పోషకాలు లభిస్తాయి. మీరు తీసుకునే ఆహారంతో మీ ముఖంపై మొటిమలు, మచ్చలు ఏర్పడకుండా కాపాడుకోవచ్చు. తరచుగా చేపలతో కూడిన ఆహరం తీసుకోవడం వల్ల చర్మానికి మంచి పోషణ అందించవచ్చు.
6. సన్ స్క్రీన్ లు వాడటం మంచిది: కుడి చేయివాటం ఉన్న వారు ఎక్కువగా సన్‌స్క్రీన్ లను ఎడమ వైపు పెడుతారని, ఎడమ చేయివాటం వారు కుడి వైపు ఎక్కువ క్రీం పూస్తారని దీంతో ముఖంపై రెండు వైపులా అసమతౌల్యంగా రాయడం జరుగుతుంది. క్రీం వాడేప్పుడు రెండు వైపులా రెండు చేతులతో మార్చి మార్చి రాయడంతో ముఖమంతా సమపాళ్లలో క్రీం పడుతుంది.



Click it and Unblock the Notifications
