Latest Updates
-
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్‌గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
చర్మ సంరక్షణలో ప్రముఖ పాత్ర వహించే బంగాళాదుంప..!

పచ్చి బంగాళాదుంప సౌందర్య చికిత్సల్లో బాగా ఉపయోగపడుతుంది. కమిలిన చర్మంపై బంగాళాదుంప తురుము పెడితే త్వరగా ఉపశమనం ఉంటుంది. దీంట్లో స్టార్చ్ ఎక్కువగా ఉటుంది కాబట్టి చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. పచ్చి ఆలుగడ్డ రసాన్ని చర్మంపై రాసి ఆరాక కడుక్కుంటూ ఉంటే మంచి టోనర్‌గా పనిచేస్తుంది. పచ్చి బంగాళాదుంప తురిమి దానికి నిమ్మరసం, ఓట్‌మీల్ పొడి, పాలు, పుల్లర్స్ ఎర్త్ కలిపి క్లెన్సింగ్ మాస్క్‌లా వాడవచ్చు.
బంగాళదుంపల్ని ఉడికించి, పొట్టు తీసి మిక్సీలో వేసి వాటికి కొద్దిగా పాలు కలపి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ ముద్దని గోరువెచ్చగా ఉండగానే ముఖానికి పట్టించాలి. పావుగంట తర్వాత గోరువెచ్చిని నీటితో కడిగి అనంతరం పాల మీగడ రాసి పది నిమిసాల తర్వాత కడిగేయాలి. ముఖం ఎంత కాంతివంతంగా ఉంటుందో మీరే గమనిస్తారు.
బంగాళదుంపల్ని సన్నని చెక్కలుగా తరిగి రసం తీసి రాసుకున్నా చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. ఉడకబెట్టిన బంగాళాదుంప గుజ్జును ముఖానికి రాసుకుంటే తెగిన, కాలిన గాయాలు మానుతాయి. మొటిమలు తగ్గి, ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
పచ్చి బంగాళాదుంపలను చక్రల్లాగ కట్ చేసి చల్లటి నీటిలో పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. పదినిమిషాల తర్వాత వీటిని బయటకు తీసి ముఖానికి, మెడ, చేతులకు బాగా రబ్ చేయాలి. బంగాళాదుంపను పేస్ట్ గా తయారు చేసి ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చును.
బాదంపప్పు: వీటిల్లో విటమిన్ ఇ చాలా ఉంటుంది. కాబట్టి మంచి పోషకంగా పనిచేస్తుంది. బాదం పప్పు పొడి, ఓట్‌మీల్ పొడి, పాలు కలిపి ముఖానికి మాస్క్‌లా వాడితే చర్మం మీద మృత కణాలు తొలగిపోయి నిస్తేజంగా ఉన్న చర్మం కాంతిని సంత రించుకుంటుంది.
బాదం పప్పును నానబెట్టి మెత్తటి పేస్టులా చేసి దానికి పచ్చి బంగాళాదుంప తురుము కలిపి కళ్ల చుట్టూ మాస్క్ లా వేసుకుంటే నల్లటి వలయాలు మాయమవుతాయి.
బాదం నూనెతో కళ్ళచుట్టూ మర్దన చేసుకున్నా అదే ఫలితం ఉంటుంది. గోరువెచ్చని పాలలో ఒక టీస్పూన్ బాదం నూనె వేసుకుని తాగితే శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
కళ్ళ చుట్టూ వలయాలకు: పచ్చి బంగాళాదుంపను తురిమి రెండు పలుచటి నేత బట్టలలో వాటిని వేసి ప్యాడ్స్‌లా కళ్ళ మీద 20 నిమిషాల పాటు పెట్టుకోవాలి. బంగాళదుంపలను చక్రాల్లా తరిగి కూడా పెట్టుకోవచ్చు. బంగాళదుంపలో ఉండే ఒక రసాయనంలో చర్మపు రంగును మార్చే లక్షణం ఉందని కనుగొన్నారు.



Click it and Unblock the Notifications
