Latest Updates
-
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. !
మల్లెపువ్వులతో ముఖంలో చల్లదనం... కాంతివంతం...!
మహిళలు తమ అందంకోసం ఎన్నో రకాల సౌందర్య సాధనాలను ఉపయోగిస్తుంటారు. సహజంగా లభించేటటువంటి పండు, కూరగాయలు, ఆకు కూరలతో కూడా ఫేస్ ప్యాక్ లు సౌందర్య సాధనాలుగా ఉపయోగిస్తుంటారు. అయితే వీటిలాగే మనకు అరుదుగా లభించేటటువంటి పువ్వులతో కూడా అందాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు. ముఖంలో కాంతులు విరాజిల్లేలా చేసేటివి పువ్వులు. గులాభీలు ముఖంలో సౌందర్యాన్నిస్తే, మల్లెలు ముఖానికి చల్లదనంతో పాటు, ముఖంలో మెరుపులనిస్తుంది.

మగువల మనసు దోచే అపురూప పుష్పం. మల్లెపువ్వును ఇష్టపడని అతివ ఉండదు అంటే అదేం అతిశయోక్తి కాదు. తెలుపుకే అసూయపుట్టించే శ్వేతవర్ణ పుష్పం మల్లెపువ్వు. మల్లెపూలు పసిపాపల్లా నవ్వేపువ్వులు. అతి సున్నితమైనవి. గుండుమల్లె, సెంటుమల్లె, కాగడామల్లె, దొంతరమల్లె, చమేలి, విరజాజి, సన్నజాజి.... ఇలా ఎన్నో పేర్లతో మల్లెపూలను పిలుస్తారు. ప్రతిపెళ్ళిలోను మల్లెలు సందడి చేస్తాయి. అందరిని మురిపిస్తాయి. అంతేకాదండోయ్...... మల్లెల వల్ల అనేక లాభాలున్నాయి.
మల్లెపూలను అరోమా థెరఫీ లో, ఆయుర్వేదం లో విరివి గా ఉపయోగిస్తారు. మల్లెలు నరాలపై మంచి ప్రభావం చూపుతాయి. వేసవిలో మల్లెపూల పరిమళం మనసుకు చాలా ఉపశమనం కల్గిస్తుంది. కీళ్ళనొప్పులు, చర్మ రోగాల నివారణలోను ఉపయోగపడుతుంది. మల్లెల నుండి
ముఖ్యంగా ముఖ సౌందర్యానికి ఎలాంటి పువ్వులను ఉపయోగించినా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది పువ్వుల రేకులు. రేకుల నుండి విడుదలయ్యే రసాయనాలు, వాసనలే సౌందర్య సాధకాలు. పువ్వుల నుండి వేరు చేసిన రేకులను బాగా మొత్తని పేస్ట్ లా తయారు చేసి దానికి ఒక చెంచా ఓట్స్ కలిపి ముఖాన్ి అప్లై చేయాలి. అరగంట తర్వాత కొద్దిగా తేమ చేసి ఐద నిమిసాల పాటు స్క్రబ్ చేయాలి. తర్వాత మంచినీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా పువ్వలతో వేసుకొనే ఫేస్ ప్యాక్ లు చర్మానికి చాలా సున్నితంగా ఉంటాయి. కాబట్టి క్రమం తప్పకుండా ఏదో ఒక పువ్వుల రేకుతో పేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంలో కాంతులు వెదజల్లుతాయి. అయితే పువ్వులతో వేసుకొనే ఫేస్ ప్యాక్ లో కొంత జాగ్రత్త అవసరం. చర్మానికి ఎక్కువ తగలకుండా చూసుకోవాలి.
ముఖ్యంగా పొడిచర్మానికి మల్లెపువ్వులు బాగా ఉపయోగపడుతాయి. చర్మాన్ని సున్నితంగా.. కోమలంగా తయారు చేస్తుంది. మల్లెల్లో ఈ మంచి గుణాలు అన్నీ వున్నాయి కనుకే తెల్లని తెలుపులో, సుగంధ పరిమళాలలో మరేపుప్వూ దీనికి సాటిరాదంటే అతిశయోక్తి కాదు. అలాగూ మల్లె పువ్వుల్లో చర్మానికి అవసరమయ్యే విటమిన్ సి మల్లెల్లో విరివిగా వుంటుంది. అందుకే మల్లె తూడులను అన్నంలో కలిపి తినటం కూడా గ్రామీణ జీవితంలో కనపడుతుంది.
మల్లెల్ని సేఫ్ ప్యాక్‌గా కూడా వాడుకోవచ్చు. మల్లెల్ని పేస్టుగా చేసి, కొద్దిగా పచ్చిపాలు కలిపి, నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత ముల్తానా మట్టి, గంధం, తేనె అరస్పూన్ చొప్పున కలిపి ప్యాక్ వేసుకోవాలి. అలాగే మల్లెపువ్వు నుండి రేకులను వేరు చేసి వాటిని మెత్తగా పేస్ట్ చేసి అందులో పాలమీడ కలిపి బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో ముఖానికి చల్ల దనంతో పాటు ముఖంలో కాంతి వస్తుంది. ముఖం మీద ఉండే నల్ల మచ్చలు తొలగిపోయి, చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
మల్లె పువ్వుల్లో యాంటిసెప్టిక్ లక్షణాలు ఉండటం వల్ల వీటిని ఎక్కువగా జాస్మిన్ ఎసెన్సియల్ ఆయిల్స్ లో ఉపయోగిస్తుంటారు. ఈ ఆయిల్స్ ను చర్మం సౌందర్యాలలో ఉపయోగిస్తుంటారు. వీటిని ఉపయోగించడం వల్ల చర్మ అలర్జీలు దరిచేరవు. మల్లెపూల రసం తీసి గులాబీ పువ్వుల రసం, గుడ్డు లోని పచ్చసొన రెండేసి స్పూన్ల చొప్పున కలిపి ముఖానికి రాస్తే ముఖం మౄఎదువుగా, కాంతివతంగా మెరిసిపోతుంది. కొబ్బరి నూనెలో మల్లెపూలు వేసి ఓ రాత్రంతా బాగా నాననిచ్చి, మరిగే వరకూ కాచి వడగట్టి వాడితే తల సువాసన భరితం కావడమే కాకుండా కేశాలకు మంచి పోషణ అవుతుంది. మాడుకు మేలు చేస్తుంది.



Click it and Unblock the Notifications
