మగవారి చర్మ సౌందర్యానికి నేచురల్ మాయిశ్చరైజర్స్

సాధారణంగా పురుషుల చర్మం, స్త్రీల చర్మంతో పోలిస్తే 20%మందంగా, రఫ్ గా, ఆయిలీగా, గట్టిగా ఉంటుంది. పురుషులు ఉపయోగించే స్కిన్ క్రీములుల్లో తప్పనిసరిగా బొటానికల్ ఎక్స్ టాక్స్, యాంటియాక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్, ఎసెన్సియల్ ఆయిల్స్ మరియు ఫాటీ యాసిడ్స్ కలిగి ఉండాలి. కాబట్టి అలాంటి పదార్థాలు కలిగినటువంటి మాయిశ్చరైజింగ్ క్రీములను కొనే ముందు వాటిని గమనించి తీసుకోవాలి. వాటిలో కొన్ని మీకోసం...

గ్లిజరిన్

గ్లిజరిన్

సహజ చర్మ సంరక్షణలో గ్లిజరిన్ అద్భుతంగా పనిచేస్తుంది. చర్మ సమస్యలకు ఉత్తమమైన నివారినిగా పనిచేస్తుంది గ్లిజరిన్. చర్మ సంరక్షణలో గ్లిజరిన్...

షియా బట్టర్(వెన్న)

షియా బట్టర్(వెన్న)

షియా బట్టర్ చాలా మందంగా బలమైన హైడ్రేట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఎంతటి రఫ్ గా ఉన్న చర్మం గలవారైనా సరే వెన్న...

సిలికాన్

సిలికాన్

చర్మసంరక్షణ ఉత్పత్తుల్లో సిలికాన ప్రధానమైనటువంటిది. ఇది ప్రధాన క్రియాశీలక గుణం కలిగి ఉంటుంది. సిలికన్ జెల్...

గ్రీన్ టీ

గ్రీన్ టీ

గ్రీన్ టీ శరీరానికి, చర్మానికి, జుట్టుకు ఎంతో ఆరోగ్యాన్నిస్తుంది. దీనిని ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు. గ్రీన్ టీని....

ఆలోవెరా

ఆలోవెరా

ఆలోవెరా జెల్ ని షాంపూలాగా ఫేష్ వాష్ కు ఉపయోగించవచ్చు. ఈ ఆలోవెరా జెల్ లో చర్మానికి...

గ్లిజరిన్: సహజ చర్మ సంరక్షణలో గ్లిజరిన్ అద్భుతంగా పనిచేస్తుంది. చర్మ సమస్యలకు ఉత్తమమైన నివారినిగా పనిచేస్తుంది గ్లిజరిన్. చర్మ సంరక్షణలో గ్లిజరిన్ మాయిశ్చరైజర్ గా అద్భుతంగా పనిచేస్తుంది. గ్లిజరిన్ ను చాలా కాస్మోటిక్స్ లో వినియోగిస్తారు. మరియు చర్మ సమస్యలకు వినియోగించే మెడిసినల్ ప్రొడక్ట్స్ లోనూ గ్టిజరిన్ ను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే గ్లిజరిన్ ను ఉపయోగించే ముందు అతి తక్కువ మోతాదులో మాత్రమే ఉపయోగించాలి. అదికూడా చాలా పలుచగా ముఖానికి రాసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇది చర్మానికి హాని కలిగిస్తుంది.

షియా బట్టర్(వెన్న): షియా బట్టర్ చాలా మందంగా బలమైన హైడ్రేట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఎంతటి రఫ్ గా ఉన్న చర్మం గలవారైనా సరే వెన్న తగలగానే సున్నితంగా మరియు మృదువుగా మారి చర్మంలోని చొచ్చుకొని పోయి చర్మాన్ని శుభ్రపరిచి కాంతివంతంగా చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పొడి, సాధారణ చర్మతత్వం ఉన్నావారు విటమిన్ సి. వెన్న అధారిత రకాలను ఎంచుకోవాలి. దీనివల్ల చర్మం ఎక్కువసేపు తాజాగా ఉంటుంది. మృదువుగానూ మారుతుంది. సున్నితమైన ఛర్మతత్వం ఉన్నవారు. పీహెచ్ స్థాయి తక్కువగా, పరిమళం లేని, మాయిశ్చరైజింగ్ గుణం ఉన్న లోషన్ ను ఎంచుకోవాలి.

సిలికాన్: చర్మసంరక్షణ ఉత్పత్తుల్లో సిలికాన ప్రధానమైనటువంటిది. ఇది ప్రధాన క్రియాశీలక గుణం కలిగి ఉంటుంది. సిలికన్ జెల్ లేదా క్రీములను చర్మానికి అప్లై చేయడం వల్ల దీర్ఘ కాల రక్షణ కల్పిస్తుంది. మగవారి చర్మతత్వానికి తగ్గట్లు.. ఎస్‌పీఎఫ్‌ ముప్ఫై నుంచి యాభై మధ్యలో ఉండే వాటిని ఎంచుకోవాలి. దాంతోపాటు యూవీ ఎ, యూవీ బి అని రాసున్న వాటికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవి కూడా సిలికాన్‌, యాంటీఆక్సిడెంట్లు, లైకోపీన్‌, క్యారెట్‌, పండ్లు.. వంటి సహజ సుగుణాలతో లభిస్తున్నాయి. రసాయనాల మిళితం కూడా ఉంటాయి. అయితే వీటిని మాత్రం ప్రతిమూడు గంటలకోసారి రాసుకుంటూ ఉండాలి.

గ్రీన్ టీ: గ్రీన్ టీ శరీరానికి, చర్మానికి, జుట్టుకు ఎంతో ఆరోగ్యాన్నిస్తుంది. దీనిని ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు. గ్రీన్ టీని సేవించడం లేదా ఫేస్ ప్యాక్ లలో ఉపయోగించడం ద్వార మీ ముఖంలో యవ్వనంత వికసిస్తుంది. మరియు ఆకర్షణీయంగా కనబడేట్లు చేసే ఆంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా గ్రీన్ టీ లో ఉన్నాయి. ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాత గ్రీన్ టీతో మళ్లీ ఒకసారి కడుక్కోవాలి. ఆ తర్వాత మళ్లీ శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. గ్రీన్ టీ యాస్ట్రిజెంట్గా పనిచేసి, చర్మానికి స్వాంతననందిస్తుంది.

ఆలోవెరా: ఆలోవెరా జెల్ ని షాంపూలాగా ఫేష్ వాష్ కు ఉపయోగించవచ్చు. ఈ ఆలోవెరా జెల్ లో చర్మానికి ఉపయోగపడే తగినన్ని పోషకాలు ఉన్నాయి. అలాగే ఇది క్లెన్సర్ గా కూడా ఉపయోగపడుతుంది. ఈ జెల్ ను తరచూ వాడడం వల్ల చర్మ ఛాయ మెరుగుపడతుంది. మొటిమలు తగ్గడానికి రెండు రోజులకొకసారి అర కప్పు ఆలోవెరా గుజ్జుని కడుపులోకి తీసుకోవచ్చు లేదా చర్మం మీద రాయవచ్చు. ఇది మగవారి చర్మానికి చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. కాబట్టి దీన్నిఒక శక్తివంతమైన మాయిశ్చరైజింగ్ క్రీమ్ గా చెప్పుకోవచ్చు. ఆలోవెరా ఆకును చిదిమి ఆ రసంలో చిటికెడు చందనంపొడి కలిపి ముఖానికి రాస్తే మొటిమల మచ్చలు, ముడతలు తగ్గుతాయి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం నునుపుదేలుతుంది. టీ స్పూన్ ఆలోవెరా రసంలో అయిదారు చుక్కల నిమ్మరసం కలిపి రాస్తే మొటిమలు త్వరగా మాడిపోతాయి.

ఎటువంటి వాటిని అవాయిడ్ చేయాలి: ముఖ్యంగా పెట్రోలియం, మరియు మినిరల్ ఆయిల్స్ కలిగినటువంటి అన్నిరకాలైన షియల్ క్రీమ్స్ ను అవాయిడ్ చేయాలి. ఈ క్రీములను ఉపయోగించడం వల్ల చర్మం ఆయిల్ గా ఉంటుంది. చర్మానికి తేమను అందించదు. దాంతో చర్మం ఎప్పుడు పొడిబారి కనబడుతుంది. ముఖంలో జిడ్డు ఎర్పడటంతో మొటిమలు, మచ్చలు ఇతర చర్మ సమస్యలు మొదలవుతాయి. కాబట్టి కొన్ని క్రీములకు దూరంగా ఉండటమే మంచిది.

ఎలా అప్లై చేయాలి: ఏ మాయిశ్చరైజర్ నైనా అప్లై చేసే ముందు సోపు వాడకుండా, ఏదైనా ఫేష్ వాష్ క్రీమ్ తో ముఖాన్నిశుభ్రంగా కడగాలి. ఫేష్ వాష్ క్రీమును ముఖానికి అప్లై చేసి రౌండ్ గా మర్ధన చేసి తర్వాత కడగాలి. ఇలా ప్రతి రోజూ రెండు సార్లైనా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా మాయిశ్చరైజింగ్ చేసుకొనే టైమ్ ఉదయం ఉండదు కాబట్టి సాయంత్రం ఇంటికి చేరుకొన్న తర్వాత కూడా చేసుకోవచ్చు. మరి ఈ సింపుల్ చిట్కాలు మాయిశ్చరైజింగ్ పదార్థాలతో మీ సౌందర్యాన్ని పెంచుకోండి. ఆరోగ్యంగా ఆకర్షణీయంగా తయారవ్వండి..

Story first published: Thursday, September 6, 2012, 12:51 [IST]
Desktop Bottom Promotion