For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మ ఛాయను ప్రకాశవంతంగా మార్చే ఫ్రూట్ ఫేస్ ప్యాక్

చాలా సింపుల్ గా జీవన శైలిన మార్చుకోవడం, తాజా పండ్లను మీ డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. తాజా పండ్ల వల్ల చర్మం చాలా క్లియర్ గా మార్పు చెందుతుంది. స్వచ్చమైన చర్మం, నేచురల్ హై

|

చాలా సింపుల్ గా జీవన శైలిన మార్చుకోవడం, తాజా పండ్లను మీ డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. తాజా పండ్ల వల్ల చర్మం చాలా క్లియర్ గా మార్పు చెందుతుంది. స్వచ్చమైన చర్మం, నేచురల్ హైడ్రేషన్, స్కిన్ స్ట్రక్చర్ మెరుగువుతుంది మరియు చర్మం యవ్వనంగా కనబడేలా చేస్తుంది. చర్మానికి ఫ్రూట్స్ చాలా సురక్షితం మరియు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరియు ఖర్చతో కూడనవి. ఇవి చర్మం నుండి అనేక టాక్సిన్స్ తొలగిస్తుంది మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అంధిస్తుంది.

ప్రకాశవంతమైన చర్మం అంధించే ఫూట్ ఫేస్ ఫ్యాక్స్ ఎంటో ఒక సారి చూద్దాం..

1. అరటి పండు:

1. అరటి పండు:

అరటి పండ్లులో విటమిన్ ఎ, విటమిన్ బి మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉండి, యాంటీఏజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. బాగా పండిన అరటి పండును మెత్తగా చేసి, అందులో కొద్దిగా తేనె చేర్చి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మ కాంతివంతంగా మారుతుంది . ఇందులో ఫైబర్ , మినిరల్స్, మెగ్నీషియం, మరియు పొటాషియం అధికంగా ఉండి, మన శరీరంలో రక్తప్రసరగా సరిగా జరిగేలా చేస్తుంది. రోగనిరోధకతను పెంచుతుంది.

2. నిమ్మరసం:

2. నిమ్మరసం:

నిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మరియు ఇది నేచురల్ బ్లీచింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మంను క్లియర్ గా మర్చుతుంది. చర్మంలో ఎటువంటి మచ్చలు, మొటిమలను, స్పాట్స్ మరియు స్కిన్ టాన్ లేకుండా కాపాడుతుంది. కాబట్టి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం జోడించి బాగా మిక్స్, అందులో తేనె మిక్స్ చేసి ఖాలీ కడుపుతో త్రాగాలి . ఇది చర్మంలోని టాక్సిన్స్ ను తొలగించి చర్మాన్ని స్వచ్చంగా, క్లియర్ గా మార్చుతుంది.

3. ఆరెంజ్:

3. ఆరెంజ్:

ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలం. అందువల్ల చర్మ నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది. చర్మం ఎంటువంటి కళంకం లేకుండా మరియు సహజంగా వృద్ధాప్యం ప్రక్రియ వేగాన్ని తగ్గిస్తుంది. ఎండిన ఆరెంజ్ తొక్కను బాగా పొడి చేసి తర్వాత, మూత గట్టిగా ఉండే డబ్బాలో నిల్వ చేసుకోవాలి. దీన్ని వారంలో రెండు మూడు సార్లు ఒక నేచురల్ స్ర్కబ్బర్ గా ఉపయోగించడం వల్ల ఒక స్పష్టమైన మరియు మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

4. ఆపిల్స్:

4. ఆపిల్స్:

ఆపిల్స్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి . ఈ యాంటీఆక్సిడెంట్స్ చర్మంలోని కణం మరియు కణజాల నష్టంను నిరోధిస్తుంది. యాంటీఏజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది చర్మంలో ముడుతలను మరియు సన్నని గీతలను తగ్గిస్తుంది మరియు ప్రేగులను శుభ్రం చేస్తుంది. ఆపిల్ జ్యూస్ కు కొద్దిగా తేనె చేర్చి బాగా మిక్స్ చేసి, ముఖానికి బాగా పట్టించాలి. తడి ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ముఖానికి ఒక మంచి హైడ్రేటింగ్ ఫేస్ ప్యాక్ గా ఉంటుంది.

5. బొప్పాయి:

5. బొప్పాయి:

బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్స్ మరియు పెప్పిన్స్ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉండి, చర్మంలోని మలినాలను మరియు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది . బొప్పాయ గుజ్జును మీ ముఖ చర్మానికి బాగా రుద్దాలి. 5నిముషాలు బాగా స్ర్కబ్ చేసిన అలాగే ఉంచి తడి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల ఇది చర్మాన్ని సాఫ్ట్ గా మార్చుతుంది. బొప్పాయిని మెత్తగా చేసి అందులో రెండు చెంచాల తేనె లేదా పెరుగు మిక్స్ చేసతి ఫేస్ కు మాస్క్ లా వేసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల మంచి మాయిశ్చరైజర్ గా ఉపయోగపడుతుంది.

6. స్కిన్ టోన్ కు మిక్స్డ్ ఫ్రూట్ ఫేస్ ప్యాక్:

6. స్కిన్ టోన్ కు మిక్స్డ్ ఫ్రూట్ ఫేస్ ప్యాక్:

ఈ వింటర్ సీజన్ లో అన్ని రకాల పండ్లూ మార్కెట్లో మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ పండ్లు అన్నింటినీ ఒక్కోదాన్ని చేర్చి మెత్తగా పేస్ట్ చేసి, ముఖం, మెడకు మసాజ్ చేయడం వల్ల స్కిన్ టోన్ ను చెక్ పెట్టవచ్చు.

7. సన్ టాన్ నివారించే కివి ఫ్రూట్ ప్యాక్ :

7. సన్ టాన్ నివారించే కివి ఫ్రూట్ ప్యాక్ :

కివి పండు మెత్తగా పేస్ట్ చేసి, దానికి ఒక చెంచా పెరుగు మిక్స్ చేసి, మీ ఫేషియల్ స్కిన్ మీద మసాజ్ చేయాలి. 20 నిముషాల తర్వాత వాష్ చేయాలి.

8. నిర్జీవమైన మరియు టాన్ స్కిన్ కోసం స్ట్రాబెర్రీ ఫేస్ ప్యాక్ :

8. నిర్జీవమైన మరియు టాన్ స్కిన్ కోసం స్ట్రాబెర్రీ ఫేస్ ప్యాక్ :

కొన్ని స్ట్రాబెరీని మెత్తగా చేసి కొద్దిగా నీళ్ళు కలిపి ముఖం మీద మసాజ్ చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

9. పొడి చర్మానికి కీరదోసం ఫూట్ ఫేస్ ప్యాక్:

9. పొడి చర్మానికి కీరదోసం ఫూట్ ఫేస్ ప్యాక్:

ఈ కీరదోసకాయ ఫేస్ ప్యాక్ చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది ఈ కీరదోస యొక్క రసాన్ని లేదా పేస్ట్ ను ముఖం లేదా మెడకు అప్లై చేసి బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి . చర్మం చల్లగా మరియు తాజాగా మారుతుంది.

English summary

9 Fruits For Glowing Skin

And the best way to rejuvenate your skin is to consume fruits and apply a fruit mask every alternate day. Invest 10 minutes of your time every day in doing this and see a visible difference in two weeks’ time.Want to know which fruits to eat and which ones to apply? Well, this article has all that information.
Desktop Bottom Promotion