Latest Updates
-
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్!
యవ్వనంగా..సౌందర్యంగా మార్చే యాంటీఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్స్
సాధారణంగా అందంగా ఉండాలన్నది ప్రతి ఒక్కరికి ఆశ. అందుకు మనఅందరం ఎల్లప్పుడూయవ్వనంగా.. అందంగా ఉండటానికి జాగ్రత్తులు తీసుకుంటాం. అనేక రకలా యాంటీఏజింగ్ క్రీములు వాడినా కూడా, ఎప్పుడో ఒక రోజు ముఖంలో గీతలు ఏర్పడక తప్పదు. అటువంటప్పుడు హెల్లీ డైట్ మిమ్మల్ని యవ్వనంగా..అందంగా ఉండేలా చేస్తుంది.
మీరు ఏమితింటారు! హెల్తీ డైట్ ను ఫాలో చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండటం మాత్రమే కాదు, మీ అందానికి సంబంధించిన చర్మానికి రక్షణ కల్పించి అందంగా కనబడేలా చేస్తుంది. అందుకు వివిధ రకాలు ఆహారాలున్నాయి. ఈ ఆహారాలను రెగ్యులర్ గా తినడం వల్ల మీ చర్మ సౌందర్య పెంపొందించి మీరు యంగ్ గా మరియు శుభ్రమైన మెరిసే చర్మ సౌందర్యాన్ని పొందుతారు . ఉదాహరణకు , యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఆరోగ్యానికి అదే విధంగా చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఎందుకంటే యాంటీఆక్సిడెంట్స్ రక్తన్నిప్యూరిఫై చేసి, హానికరమైన టాక్సిన్స్ ను మరియు ఫ్రీరాడిక్స్ ను శరీరం నుండి బయటకు పంపడానికి అవసరం అయ్యే జీవక్రియను నడుపుతుంది. దాంతో చర్మం ఆరోగ్యంగా యవ్వనంగా ఉండేందుకుసహాయపడుతుంది.
ముఖ్యంగా , ఫ్రీరాడికల్స్ నుండి ఉత్పత్తి అయ్యిన ఆక్సిడేషన్ ప్రొసెస్ ను యాంటీఆక్సిడెంట్స్ బ్లాక్ చేస్తుంది.విటమిన్ ఎ, సి, ఇ,లైకోపిన్, కెరోటినాయిడ్స్ మరయు లూటిన్ వంటి కొన్ని పాపులర్ యాంటీ ఆక్సిడెంట్స్ కొన్న రకాల వెజిటేబుల్స్ మరియు పండ్లలో కనుగొనబడింది. మరి మీరు చాలా సంవత్సరాలు యవ్వనంగా కనబడాలంటే, ఈ యాంటీఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్స్ ను మీ మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవ్సాలిందే......

కాలే: కాలే వంటి గ్రీన్ వెజిటేబుల్ ల్లో లూటిన్ మరియు జియాక్సిథిన్ పుష్కలంగా ఉంటాయి. మరి మీరు యంగ్ గా కనబడాలంటే ఈ ఆహారాన్ని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాల్సిందే.

ఆకు కూరలు: ఒక కప్పు ఆకు కూరల్లో 20,350mcgలైకొపిన్ మరియు ఇతర విటమిన్స్ పుష్కలంగా ఉండి ఇటు చర్మానికి మరయు శరీరం మొత్తానికి ఆరోగ్యకరం.

బ్రొకోలి: బ్రొకోలీ వంటి డార్క్ గ్రీన్ వెజిటేబుల్స్(ముదురు రంగు కూరగాయలు)లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల, మరీ ముఖ్యంగా లైకోపిన్ అధికంగా ఉంటుంది. మరి మీరు యవ్వనంగా కనబడాలంటే, ఈ ఆహారాన్ని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని, మీ వయస్సు పైబడే లక్షణాలను తగ్గించుకోండి.

గుడ్లు: ఒక పెద్ద గుడ్డులో 191mcgలూటిన్ మరియు జియాక్సన్థిన్ కలిగి ఉంటుంది . ఈ యాంటీఆక్సిడెంట్స్ చర్మ రక్షణకు మాత్రమే కాదు, కళ్ళ ఆరోగ్యానికి కూడా ప్రముఖ పాత్రవహిస్తాయి.

రెడ్ బెల్ పెప్పర్: ఎర్రని ఈ క్యాప్సికమ్ లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. అది స్కిన్ మరియు శరీరం మొత్తానికి ఆరోగ్యరం . మరీ ముఖ్యంగా ముదురంగు వుండే వెజిటేబుల్స్ ల్లో కెరోటినాయిడ్స్ మరియు బీటా కెరోటీన్ పుష్కలంగా ఉంటాయి.

మామిడి పండ్లు: అన్ని రకాల పండ్లు చర్మ సౌందర్యానికి చాలా మేలు చేస్తాయి . ఈ సీజన్ లో లభ్యం అయ్యే మామిడిపండ్లలో కెరోటినాయిడ్స్ మరియు బీటా కెరోటిన్, యాంటీఆక్సిడెంట్స్ యస్సు మీద పడనియ్యకుండా పోరాడుతాయి.

పాలు : పాలలో అధికంగా ఉండే క్యాల్షియం మాత్రమే కాదు,అందులో ఉండే విటమిన్ ఎ మరియు కెరోటినాయిడ్స్ అధికంగా ఉండటం వల్ల , ఈ యాంటీఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ ను ఖచ్చితంగా మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఇవి వయస్సు మీద పడనియ్యకుండా చేసి యవ్వనంగా కనబడేలా చేస్తాయి.

టమోటో: ఎర్రని టోమోటోల్లో లైకోపిన్ అత్యధికశాతంలో ఉంటుంది. వీటిని ఆహారంలో చేర్చి తిన్నా లేదా ముఖానికి అప్లై చేసినా చర్మాన్ని టైట్ చేస్తాయి మరియు ఏజింగ్ లైన్ ను తొలగిస్తాయి.

సిట్రస్ పండ్లు: సిట్రస్ పండ్లు ఆరెంజ్ లెమన్ వంటి వాటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి . ఈ యాంటీఆక్సిడెంట్స శరీరాన్ని మరియు చర్మాన్నిశుభ్రం చేసి మిమ్మల్ని ఫ్రెష్ గా మరియు మెరిసే చర్మంతో నిగనిగలాడేలా చేస్తాయి.

వాటర్ మెలోన్(పుచ్చకాయ): నీరు పుష్కలంగా ఉండే ఈ పుచ్చకాయలో నీటితో పాటు లైకోపిన్ కూడా పుష్కలం. ఇవి శరీరానికి చర్మానికి హాని చేసే ఆక్సిడేషన్ తగ్గించి ప్రీరాడికల్సు ను తొలగిస్తాయి .



Click it and Unblock the Notifications











