Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
పురుషుల షేవింగ్ తర్వాత ఉపయోగించే బెస్ట్ ఆయిల్
కొంతమంది పురుషులకు మార్కెట్ లో కొనుగోలు చేసిన ఆఫ్టర్ షేవ్ లోషన్లు మరియు నూనెలు దురదలు లేదా అలెర్జీలకు కారణం కావచ్చు. దానికి బదులుగా ఏ అలెర్జీ ప్రతిస్పందనలు కలిగించని ఆఫ్టర్ షేవ్ నూనెలను తయారుచేసుకోవచ్చు. మీకు చేరువలో ఉన్న పదార్థాల నుంచి మరియు స్థానికంగా అందుబాటులో ఉన్న వస్తువులతో ఇంట్లో తయారు చేసిన ఆఫ్టర్ షేవ్ నూనెలను సిద్ధం చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఆల్కహాలిక్ బేస్డ్ ఆఫ్టర్ షేవ్ నూనెలు గడ్డం చేసుకుంటున్న సమయంలో ప్రభావిత ప్రాంతాల్లో చర్మం వృద్ధి మందగించటం వంటి కారణాలతో సమస్యాత్మకంగా ఉండవచ్చు.
ఒక పరిష్కారం మార్గంగా వారి సొంత ఇంట్లో తయారు చేసిన ఆఫ్టర్ షేవ్ నూనెలను ఎన్నుకోవచ్చు. షేవ్ అయిన తర్వాత చర్మానికి స్వాంతన కలిగించేందుకు అప్లై చేయవచ్చు. ఇంట్లో ఆఫ్టర్ షేవ్ నూనెలు తయారు చేసేటప్పుడు మీరు అలెర్జీ ప్రతిస్పందనలు మరియు అంటురోగాలు తగ్గించడానికి సేంద్రీయ మరియు మూలికా పదార్థాలను ఉపయోగించాలి. ఆఫ్టర్ షేవ్ నూనెలను ఇంట్లో తయారుచేయటానికి కలబంద టీ ట్రీ ఆయిల్, ఆలివ్ నూనె,బే రమ్,దోసకాయ,వోడ్కా మొదలైన వాటిని ప్రముఖంగా ఉపయోగిస్తారు.
ఒకసారి మీరు మీ చర్మ తత్వానికి సరిపోయే పదార్దములను ఉపయోగించి తయారుచేసిన ఆఫ్టర్ షేవ్ నూనెను ఎంచుకోండి. దీనిని మీరు ఒక స్ప్రే సీసా ద్వారా ఉపయోగించవచ్చు. ఒక గాలి చొరబడని స్టోరేజ్ బాక్స్ లో పెట్టి ఒక చల్లని ప్రదేశం లేదా ఒక రిఫ్రిజిరేటర్ లో నిల్వచేయవచ్చు. సేంద్రీయ ఇంట్లో తయారు చేసిన ఆఫ్టర్ షేవ్ నూనెలు వాణిజ్య సంరక్షణకారులు లేకుండా పరిమిత జీవితకాలం ఉంటాయి. అందువల్ల తదనుగుణంగా వాటిని ఉపయోగించేలా మరియు జాగ్రత్తగా వాటిని నిల్వచేయాలి. దీనిని ఉపయోగించేవరకు అనవసరమైన ప్రభావాలను నిరోధించేందుకు చల్లని ప్రదేశంలో ఉంచటం చాలా ముఖ్యం అని చెప్పవచ్చు.
ఇక్కడ కొన్ని ప్రసిద్ధ చెందిన మరియు ఇంట్లో తయారు చేసిన ఆఫ్టర్ షేవ్ నూనెలు ఉన్నాయి.

కలబంద
ప్రకృతి యొక్క వైద్యపరమైన అద్భుత మొక్క అయిన కలబంద శక్తిని,నయం మరియు ఉపశమన లక్షణాలు కలిగి ఉంటుంది. మీరు నేరుగా రేజర్ తో షేవ్ చేసుకున్నాక గడ్డం యొక్క చర్మం మీద ఆకు లోపల జెల్లీని రాయవచ్చు. ఇది రేజర్ గాయాలు లేదా కట్స్ మరియు చర్మంపై ఓదార్పు ప్రభావాన్ని చూపుతుంది.

టీ ట్రీ ఆయిల్
ఒక గిన్నెలో టీ ట్రీ నూనెను మరియు లావెండర్ నూనెను కలిపి మిశ్రమంను సిద్ధం చేయండి. మీరు లావెండర్ నూనె స్థానంలో ఇతర అవసరమైన సుగంధ నూనెలను ఎంచుకోవచ్చు.
రేజర్ కట్స్ నయం చేయటంలో మరియు రేజర్ కాలిన గాయాల ఉపశమనానికి ఆఫ్టర్ షేవ్ నూనెను రాయాలి.

విచ్ హాజెల్ రసం
కొద్దిగా నీరు తీసుకోని దానిలో కొన్ని చుక్కల ఆలివ్ నూనె మరియు విచ్ హాజెల్ రసం కలపండి. దానిలో లావెండర్ పువ్వులు,రోజ్మేరీ మొదలైన కొన్ని సుగంధ మూలికలను జోడించండి. దాల్చిన చెక్కతో పాటు ఈ మిశ్రమాన్ని ఒక జార్ లోకి బదిలీ చేయండి. ఆ జార్ లో 2-3 వారాలు ఉంచి ఆఫ్టర్ షేవ్ నూనెగా ఉపయోగించండి.

బే రమ్
బే రమ్ తో నారింజ,లవంగం,దాల్చిన చెక్క మరియు కొద్దిగా వోడ్కా కలపాలి. రెండు వారాలు ఒక చీకటి మరియు చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచాలి. ఈ మిశ్రమాన్ని స్టోరేజ్ కాలం తరువాత మూడు నుండి నాలుగు సార్లు ఫిల్టర్ చేసి ఒక జార్ లో స్టోర్ చేసి ఆఫ్టర్ షేవ్ నూనెగా ఉపయోగించండి.

షియా బట్టర్
ఆఫ్రికన్ షియా చెట్టు గింజ నుండి సేకరించిన దంతపు రంగు గల కొవ్వును దాని అసలు రూపంలోనే ఆఫ్టర్ షేవ్ గా ఉపయోగించవచ్చు. ఇది గట్టిపడటానికి ఫ్రిజ్ లో పెట్టి ఉపయోగించవచ్చు. మీ గడ్డం చర్మంపై చైతన్యం నింపుట మరియు నయం చేస్తుంది. అంతేకాక ఒక సహజ మ్యాన్లీ సువాసన కలిగి ఉంటుంది.

ఆపిల్ సైడర్ వినెగర్
ఇది మరొక ప్రసిద్ధ ఆఫ్టర్ షేవ్ నూనె అని చెప్పవచ్చు. ఇది నేరుగా చర్మంపై దాని అసలు రూపంలోనే ఉపయోగించవచ్చు. ఇది సువాసనభరితంగాను మరియు మరింత సమర్థవంతమైన పనిచేయడానికి, అలాగే తీవ్రమైన మరియు బలమైన ఆఫ్టర్ షేవ్ నూనెగా తయారుచేయటానికి దాల్చిన చెక్క,లవంగాలు మరియు బే ఆకులు ఆపిల్ సైడర్ వినెగర్ లో కలపాలి.

దోసకాయ ఆఫ్టర్ షేవ్
ఈ ఆఫ్టర్ షేవ్ నూనెను దోసకాయ,పుదీనా రసం మరియు నీటిని ఉపయోగించి చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. అర కప్పు దోసకాయ ముక్కలు, పావు కప్పు పుదినా రసం,ఒక కప్పు నీటితో కలిపి గ్రైండ్ చేయాలి. దీనిని ఫ్రిజ్ లో నిల్వ చేసి ఆఫ్టర్ షేవ్ గా ఉపయోగించాలి.



Click it and Unblock the Notifications