Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మొటిమలకు ప్రధాన కారణం ఈ ఆహారాలేనా?
సాధరణంగా టీనేజ్ లో రావల్సిన మొటిమలు కొందరిలో వయస్సు పెరిగేకొద్దీ కూడా హార్మోనులు అసమతుల్యత వల్ల మొటిమలకు దారి తీస్తుంది. కొందరికి వాతావరణ ప్రభావం, దుమ్మ, ధూలి వల్ల మొటిమలు ఏర్పడితే మరికొందరికేమో..ఫుడ్ అలర్జీ వల్ల, లేదా ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వల్ల లేదా డ్రైరీప్రొడక్ట్స్, స్వీట్స్ అధికంగా తినడం వల్ల మొటిమలు ఏర్పడటానికి దారితీస్తుంది.
అయితే చాలా మంది చర్మవ్యాధి నిపునులు మాత్ర ఆహారానికి మరియు మొటమలకు మధ్య ఎటువంటి సంబంధం లేదని తేల్చారు. కానీ చాలా పరిశోధనలు మాత్రం ఈ విషయంలో అసంపూర్తిగానే మిగిలిపోయాయి. ఏభైయేళ్లుగా సాగుతున్న పరిశోధనలు తీసుకునే ఆహార పానీయాలకు మొటిమలకు సంబంధం ఉందని తెలియచేస్తున్నాయి. గ్లైసిమిక్ ఇండెక్సు(జిఐ) ఎక్కువ శాతం ఉన్న ఆహారం లేదా తాగే పాలు మొటిమలు విస్తరించడానికి కారణమవుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. చర్మం నొప్పిగా ఉండడం తరువాత మొటిమలు పుట్టడం మిలియన్ టీనేజర్లకు సమస్యగా మారింది.
ముఖం, మెడ,ఛాతి, వీపు వెనుక మొటిమలు విస్తరిస్తుంటాయి. చచ్చుబడిన చర్మ కణాలు మచ్చలుగా మారి తరువాత మొటిమలు లేస్తుంటాయి. హార్మోన్ల ఉత్త్పత్తి ఎక్కువ తక్కువలే దీనికి కారణంగా పేర్కొంటున్నారు. 80 శాతం మంది టీనేజర్లు తమ యవ్వన దశ అంతా వీటితోనే సతమతమవుతున్నారు. వీటి వల్ల ప్రమాదం ఏమీ లేకున్నా ముఖం లేదా ఇతర శరీరభాగం చూడడానికి జుగుప్సాకరంగా ఉన్నట్టు భావిస్తుంటారు.
19వ శతాబ్దం నుంచి మొటిమలకు ఆహారానికి సంబంధం ఉందనే పరిశోధకులు అనుకుంటున్నారు. చాకెలెట్, చక్కెర, కొవ్వు ముఖ్యమైన కారకులుగా భావించారు. 1960 నుంచి ఆహారానికి మొటిమలకు సంబంధం లేదన్న వాదన ప్రచారంలోకివచ్చింది. ఇటీవల డెర్మటాలజిస్టులు, డైటీషియన్లు తిరిగిదీన్ని అధ్యయనం చేయడం ప్రారంభించారు. మొటిమల చికిత్సలో వైద్య పోషక చికిత్స పాత్రపై పరిశోధన చేశారు. గ్లైసిమిక్ ఇండెక్సు (జిఐ) అధికంగా ఉన్న ఆహారాలు తీసుకుంటే అవి రక్తంలో సులువుగా వేగంగా జీర్ణం అవుతాయని హార్మోన్ల హెచ్చుతగ్గుల ఫలితంగా మొటిమలు తీవ్రంగా విస్తరిస్తాయని కనుక్కొన్నారు. మరి తాజా పరిశోధనప్రకారం ఈ ఆహారాలకు మొటిమలకు సంబంధ ఉన్నదని తేల్చాలి..మరి ఆహారాలేంటో చూద్దాం...

డైట్ మరియు ఫుడ్స్:
మొటమలు ఏర్పడాటానికి ఆహారంతో సంబంధం ఉందా లేదా అన్నది ఒక వివాదంగా ఉన్నది. అది చర్మ తత్వాన్ని బట్టి కూడా మొటిమలు ఏర్పడటానికి కారణమవుతుందంటున్నారు నిపుణాలు. అయితే మొటిమలకు ప్రధానంగా ఆయిల్ ఫుడ్స్, పిజ్జా బర్గర్ లు కూడా కారణం అవుతున్నాయంటే వాటికి దూరంగా ఉండటమే మంచిది.

డైరీ ప్రొడక్ట్స్:
డైరీప్రొడక్ట్స్ ను మోతాదుకు మించి తీసుకొన్నప్పుుడు మొటిమలకు దారి తీస్తుందన్న విషయం మీకు తెలిసిందే. మరో ముఖ్య విషయం మొటిమలకు ప్రధాన కారణం హార్మోనులు, మరియు డైరీ ప్రొడక్ట్స్ వల్ల హార్మోనుల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. దాంతో మొటిమలకు దారితీస్తుంది.

రిఫైన్డ్ కార్బో హైడ్రేట్స్ (శుద్ధి పిండిపదార్థాలు)
శుద్ధి పిండిపదార్ధాలు ఇటువంటి మిఠాయి , కుకీలను లేదా తెలుపు బ్రెడ్ ఆ త్వరగా జీర్ణం అయ్యే పదార్థాలే అయినా.... ఈ ఉత్పత్తులు తినడం వల్ల హార్మోన్ హెచ్చుతగ్గులకు కారణం అయ్యి బ్లడ్ షుగర్ స్థాయిలను పెంచి తద్వారా వచ్చే చిక్కులే మోటిమలు.

కెఫిన్
కెఫిన్ వల్ల మొటిమలు ఏర్పడటానికి కారణం అవుతుంది. ఎందుకంటే శరీరంలో అడ్రినల్ గ్రంథులు వల్ల స్ట్రెస్ హార్మోనులు ఉత్పత్తి అవుతాయి. ఇవి చర్మానికి చాలా హాని కలిగిస్తాయి. ఇంకా ఇవి నిద్రలేమికి దారితీస్తుంది, అయితే మంచి నిద్ర వల్ల మన శరీరంలో టిష్యూలు రిపేర్ చేయబడుతాయి. కాబట్టి ఒత్తిడితో ఉన్నప్పుడు తగినంత విశ్రాంతి , నిద్ర పొందడం వల్ల మొటిమలను నివారించవచ్చు.

చాక్లెట్
చాక్లెట్ తరచుగా తినడం వల్ల మొటిమలు ఏర్పడే ప్రధాన కారణాలలో ఒకటిగా ప్రచారంలో ఉంది మరియు కొంత నిజం కూడా ఉంది. చాక్లెట్స్ లో డైరీప్రొడక్ట్స్, రిఫైన్డ్ షుగర్స్ మరయిు కెఫిన్లు ఉండటం వల్ల మొటిమలను తీవ్రతరం చేస్తుంది. తక్కువగా తీసుకోవడం సరైనదే అయినా, అదే అలవాటు చేసుకోకూడదు.

గ్రీసీ ఫుడ్స్ (ఆయిల్ ఫుడ్స్) :
సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు అధిక జిడ్డైన ఆహారాలు మరియు ఇతర ఆహారాలు మొటిమలు ఏర్పడటానికి ప్రధాన కారణాలు. ఎక్కువ ఫ్యాట్ ఫుడ్స్ తినడం వల్ల నిజానికి రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతాయి. దాంతో హార్మోనుల అసమతుల్యత, ఫలితంగా మొటిమలకు దారితీస్తుంది . ఇంకా రక్త ప్రవాహంలో చాలా ఎక్కువ కొవ్వులు ఉండటం వల్ల ఆక్సిజన్ ప్రసరణను తగ్గిస్తుంది మరియు మన శరీరంలోని న్యూట్రీషియన్ల స్థాయిలను, తగ్గిస్తుంది. దాంతో మొటిమలు ఏర్పడుతాయి.

ఫ్రెంచ్ ఫ్రైస్
జిడ్డైన ఆహారాలతో పాటు, ఫ్రెంచ్ ఫ్రైస్, పిండితో తయారుచేసి, ప్యాక్ చేసిన ఫ్రైడ్ ఆహారాలు తీసుకోవడం వల్ల వైట్ హెడ్స్ మరియు మొటిమలకు దారితీస్తుంది.

షెల్ఫిష్
అయోడిన్ అధికంగా ఉన్న చేపలు(సెల్ ఫిష్ )ఎండ్రకాయలు, పీతలు , రొయ్యలు, crayfish, గుల్లలు మరియు వంటి సీఫుడ్స్ మొటిమలు లేదా ట్రిగ్గర్ ప్రబలడాన్ని వేగవంత చేస్తుంది.

ఆకు కూరలు
మీరు బచ్చలికూర ఒక ఆరోగ్యకరమైన ఆహారం. కానీ అధికంగా తీసుకోవడం వల్ల వీటిలో అధికంగా ఉండే అయోడిన్ మొటమలకు దారితీస్తుంది. కాబట్టి మీరు ఆల్రెడి మొటిమలతో బాధపడుతున్నట్లైతే , ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరలైనా సరే మితంగా తీసుకోవడానికి ప్రయత్నించండి.

స్పైసీ ఫుడ్స్
మొటిమలు లేనప్పుడు మీరు స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మొటిమలకు కారణం కాకపోవచ్చు. అలాకాకుండా ఆల్రెడీ మీరు మొటిమలతో బాధపడుతున్నట్లైతే, దాని వల్ల స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల శరీరంలో వేడి పెరిగి ఇన్ఫ్లమేషన్ కు గురిచేస్తుంది. దాంతో మొటిమలు ఏర్పడే ప్రమాధం ఉంది.

మాంసం
ప్రస్తుతం మనం తీసుకుంటున్న మాంసాహారం జంతువుల నుండి సేకరించినదే..వీటి ద్వారా చాలా యాంటీబయాటిక్స్ మరియు హార్మోనులు ఉత్పన్నం అవుతాయి. ఎప్పుడైతే మీరు ఎక్కువ మోతాదులో తీసుకుంటారో..అప్పుడు మొటిమలకు దారితీస్తుంది. అంతే కాదు మాంసాహారం ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో పిహెచ్ స్థాయిలు పెరుగుతాయి. అవి ఇన్ఫ్లమేషన్ కు గురిచేస్తాయి.

బేకన్
మాంసాహారంలోని బీఫ్ మరియు పోర్క్ వంటివి మొటిమలకు ప్రధాన కారణం అవుతున్నాయి. ఇవి తినడానికి టేస్టీగా ఉన్నందున ఎక్కువ మంది ఈ ఆహారాలు తీసుకొన్న మొటిమలకు దారితీస్తుంది.

సోడా మరియు ఎనర్జీ డ్రింక్స్:
ఇంతకు ముందు చెప్పినట్లుగా కెఫిన్ స్ట్రెస్ హార్మోనులు విడుదల చేస్తుందని, ఇవి చర్మానికి చాలా చెడు చేస్తాయి. ఎప్పుడైతే కెఫిన్ అధికంగా తీసుకుంటారో, షుగర్ తో నిండిన బెవరేజస్ అంటే సోడా మరియు ఎనర్జీ డ్రింక్స్, వల్ల కూడా క్లియర్ గా ఉన్న మీ చర్మంలో మొటిమలకు ఏర్పడటానికి ప్రధాన కారణం అవుతున్నాయి.

మద్యం
మీరు ఆల్కహాల్ తీసుకొన్నప్పుడు, మీ శరీరం సహజంగానే డీహైడ్రేషన్ కు గురిఅవుతుంది. శరీరం డీహైడ్రేషన్ చెందినప్పుడు, చర్మంలోని తేమను పూర్తిగా కోల్పోయి పొడిబారుతుంది. ఫలితంగా మొటిమలు మరియు మచ్చలకు దారితీస్తుంది.



Click it and Unblock the Notifications











