Latest Updates
-
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.!
షేవింగ్ తర్వాత ఉపయోగించడానికి ఫేస్ ప్యాక్స్
ఎవరికైనా షేవింగ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది. అంతేకాక మీకు ఒక గొప్ప భావన మరియు విపరీతమైన విశ్వాసం కలుగుతుంది. మీరు ఒక ముఖ్యమైన సమావేశానికి లేదా ఒక ముఖ్యమైన డేట్ కి వెళ్ళినప్పుడు చురుకుగా మరియు సున్నితంగా కనిపించి మీ మీద జెంటిల్మెన్ అభిప్రాయం కలగాలి. షేవింగ్ పూర్తి చేసినప్పుడు,మీ చర్మం దెబ్బతినకుండా ఒక మంచి కాంబినేషన్ గల ఫేస్ ప్యాక్ వాడటం ముఖ్యం. షేవింగ్ తర్వాత మీ ముఖం బాగుండటం అనేది చాలా ముఖ్యం. వాస్తవానికి షేవింగ్ సమయంలో మీ చర్మం మీద ఒక పొర గడ్డం ఉంటుంది.
మీరు ఎంత జాగ్రత్తగా లేదా ఎంత ప్రిపరేషన్ తో షేవింగ్ చేసుకున్నా సరే కోతలు మరియు కంటికి కనబడని గాయాలు ఉంటాయి. మీరు షేవింగ్ చేసిన తర్వాత టీ ట్రీ ఆయిల్ లేదా యాంటిసెప్టిక్ రాసిన తర్వాత ఫేస్ ప్యాక్స్ ను ఉపయోగించండి. ఇది దెబ్బతిన్న మీ చర్మంను ఉత్తేజపరచటానికి సహాయపడుతుంది. అంతేకాక మీ ముఖ చర్మంను తేమగా మరియు మృదువుగా చేస్తుంది. ఒక మనిషి ఫేస్ ప్యాక్స్ ఉపయోగించటానికి నిషేధం లేదు. కొన్ని స్టడీస్ ప్రకారం మహిళలతో పాటు పురుషులు కూడా వారి ముఖ చర్మం మృదువుగా ఉండటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఫేస్ ప్యాక్స్ డీప్ గా షేవింగ్ చేసిన తర్వాత మీ చర్మం పోషణకు మాత్రమే కాకుండా మీ చర్మంను తేమగా మరియు యవన్నంగా ఉంచటానికి సహాయపడుతుంది. మీరు ఎక్కువ ప్రయోజనాలు పొందటానికి సహజ మరియు మూలికా కాంబినేషన్ తో ఉన్న ఫేస్ ప్యాక్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. షేవింగ్ తర్వాత దోసకాయ, బొప్పాయి,తేనె,పసుపు వంటి ఫేస్ ప్యాక్స్ ఉపయోగించాలి.

షేవింగ్ తర్వాత వేసుకొనే కొన్ని ఫేస్ ప్యాక్స్
దోసకాయ
ముఖం కొరకు సహజ చల్లని ప్యాక్ తయారుచేయటానికి దోసకాయ,వోట్మీల్ మరియు పెరుగు లను ఉపయోగించాలి. ఈ పదార్థాలు అన్నింటిని బాగా కలిపి పేస్ట్ చేసి మీ ముఖ చర్మం మీద చల్లని మరియు మెత్తని ప్రభావం ఇవ్వటానికి షేవింగ్ తర్వాత మీ చర్మంనకు రాయాలి. ఒక మంచి ప్రభావం కలిగటానికి ఈ ముఖ ప్యాక్ ను 30 నిమిషాల పాటు ఉంచుకోవాలి.

షేవింగ్ తర్వాత వేసుకొనే కొన్ని ఫేస్ ప్యాక్స్
పసుపు మాస్క్
పసుపును శతాబ్దాలుగా భారతీయ మందులలో మరియు వంటలలో ఉపయోగించే ప్రకృతి యొక్క క్రిమినాశక వరం అని చెప్పవచ్చు. శనగపిండి,పసుపు,బాదం నూనె కలిపి పేస్ట్ గా తయారుచేయాలి. షేవింగ్ చేసిన తర్వాత మీ ముఖానికి ఈ పేస్ట్ రాస్తే షేవింగ్ తర్వాత వచ్చే కోతల నివారణకు మరియు మీ చర్మం తేమగా ఉండటానికి సహాయపడుతుంది.

షేవింగ్ తర్వాత వేసుకొనే కొన్ని ఫేస్ ప్యాక్స్
తేనె
తేనెను మీరు షేవింగ్ చేసుకున్న తర్వాత ఒక ఫేస్ ప్యాక్ గా ఉపయోగిస్తే ఒక ప్రధాన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. తేనె ఒంటరిగానే ఒక సమర్థవంతమైన ఫేస్ ప్యాక్ గా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా షేవింగ్ చేసుకున్న తర్వాత మీ ముఖానికి తేనే రాసి 20-30 నిమిషాలు అయిన తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కొని తర్వాత చల్లని నీటితో కడగాలి. అప్పుడు మీ చర్మంనకు పోషకాలు అందుతాయి.

షేవింగ్ తర్వాత వేసుకొనే కొన్ని ఫేస్ ప్యాక్స్
అరటి పండు
అరటి పండు ఫేస్ ప్యాక్ పొడి చర్మం గల పురుషులకు బాగుంటుంది. మీరు అరటిపండు,పెరుగు మరియు తేనెలను కలిపి సాధారణ ఫేస్ ప్యాక్ మరియు ఒక మందపాటి పేస్ట్ గా రూపొందించడానికి గుజ్జు చేయాలి. మీరు గడ్డం చేసుకున్న తర్వాత చర్మం మీద ఈ పేస్ట్ ను రాసి 10-20 నిమిషాలు అయిన తర్వాత కడగాలి. అప్పుడు మీ చర్మం యవన్నంగా కనిపిస్తుంది.

షేవింగ్ తర్వాత వేసుకొనే కొన్ని ఫేస్ ప్యాక్స్
బంకమట్టి మాస్క్
బంకమట్టిని మీరు భూమి మీద పొందవచ్చు. మీ చర్మ రకాన్ని బట్టి సరైన మట్టిని ఎంచుకోవటం ముఖ్యం. ఈ మట్టిలో పువ్వుల నీరు లేదా పండ్ల ప్యూరిని కలిపి మందపాటి పేస్ట్ గా చేయాలి. దీనిని మీ ముఖంపై రాసి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి.

షేవింగ్ తర్వాత వేసుకొనే కొన్ని ఫేస్ ప్యాక్స్
బొప్పాయి
బొప్పాయి మృత కణాలను మరియు చర్మం మలినాలను నివారించే "పపైన్" అనే ప్రత్యేక ఎంజైమ్ కలిగి ఉంటుంది. దీనిలో నివారణ ఎంజైమ్స్ ఎక్కువగా ఉండుట వలన సూర్యుని వలన లేదా మండే చర్మ చికిత్సకు, చర్మ దోషాలను తగ్గించటానికి మరియు చర్మం టోన్ పొందడానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications