Latest Updates
-
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్
ముఖంలో వైట్ హెడ్స్ నివారణకు ఉత్తమ చిట్కాలు
ప్రస్తుత రోజుల్లో చాలా మందిలో ముఖ్యంలో బ్లాక్ హెడ్స్ తో పాటు వైట్ హెడ్స్ కూడా ఒక సాధారణ సమస్య. ముఖ్యంగా యంగస్టర్స్ లో ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఈ వైట్ హెడ్స్ ముఖంలో కనబడుతంటారు. ముఖ్యం మీద, గడ్డం మీద, ముక్కుమీద, ముక్కు చూట్టు ఉండి, ముఖంను జిడ్డుగా చేస్తాయి. కొంత మందిలో ఆ వైట్ హెడ్స్ ఒక పెద్ద సమస్య. ముఖ్యంగా అమ్మాయిల్లో ఈ వైట్ హెడ్స్ ఉండటం వల్ల మేకప్ వేసుకోవడానికి కుదరదు, ఒక వేళ మేకప్ వేసుకొన్నా ఎక్కువ సమయం నిలిచి ఉండదు. దాంతో చాలా డల్ కనిపిస్తారు.
మరి మీరు కూడా ఈ వైట్ హెడ్స్ సమస్యతో బాధపడుతున్నారా? వైట్ హెడ్స్ తొలగించుకొనేందుకు ట్రీట్మెంట్ కోసం మీరు ఎక్కువ డబ్బును ఖర్చుచేస్తున్నారా?అయితే, మీరు వైట్ హెడ్స్ తొలగించుకోవడం కోసం కొత్తగా ట్రీట్ చేయాల్సిన సమయం వచ్చింది. వైట్ హెడ్స్ నివారించడం కోసం అనేక హోం రెమడీస్ ఉన్నాయి. ఈ రెమడీస్ చాలా ఎఫెక్టివ్ గా తొలగిస్తాయి. అందుకోసం కొన్ని బెస్ట్ ఫేస్ స్ర్కబ్స్ ను ఇక్కడ అంధిస్తున్నాం. ఇవి చాలా ఎఫెక్టివ్ గా వైట్ హెడ్స్ ను తొలగిస్తాయి.
ఈ సహజ నేచురల్ స్ర్కబ్స్ చాలా మంచిది మరియు వైట్ హెడ్స్ ను లేకుండా క్లియర్ స్కిన్ ఇస్తుంది. అందుకు ఎక్కువ పనిచేయాల్సి అవసరం లేదు. మార్కెట్లో అందుబాటులో ఉండే సాధారణ నేచురల్ స్ర్కబ్ ను ఎంపిక చేసుకోవడమే, లేదా మీ వంటగదిలో వస్తువులను ఎంపిక చేసుకోవచ్చు. ఉదా: పంచదార, ఆలివ్ ఆయిల్, కార్న్ స్ట్రాచ్, పెసరపిండి, బాదం పౌడర్ మరియు పాలు వంటివి ఫేస్ స్ర్కబ్ గా ఉపయోగించుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం, ఆలస్యం చేయకుండా ఈ నేచురల్ పదార్థాలను ఉపయోగించి వైట్ హెడ్స్ ను నివారించండి....

మెంతులు:
కొన్నిమెంతి ఆకులను తీసుకొని కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి, మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను మీ ముఖానికి అప్లై చేసి 15-20నిముషాలు అలాగే ఉండనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మెంతి స్ర్కబ్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వైట్ హెడ్స్ ను నివారిస్తుంది.

కార్న్ స్ట్రార్చ్ స్ర్కబ్:
వైట్ హెడ్స్ కు కార్న్ స్ట్రార్చ్ ఒక మంచి హోంరెమడీ. కార్న్ స్ట్రార్చ్ కు కొద్దిగా వెనిగర్ మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, 15నిముషాల తర్వాత గోరువెచ్చిని నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో వైట్ హెడ్స్ పూర్తిగా తొలగిపోతాయి.

షుగర్ -హానీ స్ర్కబ్:
వైట్ హెడ్స్ ను నివారించే గ్రేట్ నేచురల్ స్ర్కబ్. తేనెలో కొద్దిగా షుగర్ మిక్స్ చేసి ముఖం మీద మర్దన చేయాలి. 10నిముషాల తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. వైట్స్ హెడ్స్ వెంటనే నివారించబడుతాయి.

బ్రౌన్ షుగర్ -ఆలివ్ ఆయిల్ స్ర్కబ్:
బ్రౌన్ షుగర్ తీసుకొని అందులో కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ నేచురల్ స్రబ్ ను ముఖం మీద 10 నిముషాల పాటు మర్ధన చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పెసరపిండి స్ర్కబ్:
మెత్తగా పౌడర్ చేసిన పెసర పిండికి, 2టేబుల్ స్పూన్ల పాలు, కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి, మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. దీనికి బాదం కూడా చేర్చుకోవచ్చు. ఈ పేస్ట్ ను మీ ముఖానిక అప్లై చేసి 20నిముషాల పాటు అలాగే ఉంచి, తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

సాడిల్ ఉడ్ స్ర్కబ్:
ఒక టేబుల్ స్పూన్ సాండిల్ ఉడ్ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ తాజా నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ మరియు చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేయలి. చిక్కటి పేస్ట్ లా తయారుచేసుకొని ముఖానికి మర్దన చేయాలి. 15నిముషాల తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకుంటే వైట్ హెడ్స్ తొలగిపోతాయి.

బాదం మరియు పాలతో స్ర్కబ్:
5-6బాదాంలో రాత్రి నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి. తర్వాత ఉదయం మిక్సీలో వేసి కొద్దిగా పాలు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి బాగా మర్ధన చేయాలి. ఇలా ప్రతి రోజు కొన్ని వారాల పాటు చేయడం వల్ల వైట్ హెడ్స్ పూర్తిగా తొలగించబడుతాయి. బాదం, మరియు పాలు చర్మ సంరక్షణకు చాలా మంచిది.



Click it and Unblock the Notifications
