Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
వర్షాకాలంలో మొండి మొటిమలు వదించుకోవడానికి సింపుల్ హోం రెమెడీస్
ముఖంలో మొటిమలు రావడం సహజం. అయితే ఆ మొటిమలు మొండిమొటిమలుగా తయారై ముఖంలో ఎక్కువ రోజులు తిష్ట వేసి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటి మొండి మొటిమలను నివారించుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ను మీకు పరిచయం చేస్తున్నాము. ఈ హోం రెమెడీస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.
ముఖంలో మొండి మొటిమలను చాలా ఎఫెక్టివ్ గా తొలగించే ఈ హోం రెమెడీస్ ఇండియన్ స్కిన్ కు ఫర్ఫెక్ట్ హోం రెమెడీ. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు . ఇండియన్ స్కిన్ కు పసుపుతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల కొంత వరకూ మొటిమలను నివారించుకోవచ్చు . అంతే కాదు మొండిగా తిష్టవేసి మొటిమల తాలుకు మచ్చలను కూడా చాలా ఎఫెక్టివ్ గా నివారించి స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది.
READ MORE: మొటిమల చికిత్సకు 20 ఉత్తమ పరిష్కార మార్గాలు
మరో ప్రక్క, ఎవరికైతే సున్నితమైన చర్మ తత్వం కలిగి ఉంటారో, అలాంటి వారుకి చాలా సులభంగా మొటిమలకు దారితీస్తుంది. కాబట్టి, వర్షకాలంలో ఇలాంటి మొటిమలతో ముఖం అందవిహీనంగా మారకముందే ఈ హోం రెమెడీస్ ను ఉపయోగించి ముఖ సౌందర్యాన్ని కాపాడుకొని అందంగా కనబడుటకు ప్రయత్నించండి.. మరి ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఎంటో ఒకసారి చూద్దాం...

టూత్ పేస్ట్:
వర్షాకాలంలో ముఖంలో ఇబ్బంది పెట్టి మొండి మొటిమలను నివారించడంలో టూత్ పేస్ట్ గ్రేట్ గా సహాయపడుతుంది . మొటిమల మీద అప్లై చేసిన తర్వాత డ్రై అయ్యే వరకూ ఉండి తర్వాత మరో కోట్ టూత్ పేస్ట్ రాసి రాత్రంతా అలాగే ఉంచి తర్వాత కాటన్ క్లాత్ తో తుడిచేయాలి. అప్పటికీ అలాగే ఉంటే తిరిగి మరో సారి ప్రయత్నించి చూడండి. మంచి ఫలితం ఉంటుంది.

అలోవెర:
మొటిమలను నివారించడానికి మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ అలోవెర. ముఖం శుభ్రంగా కడిగి తడిపూర్తిగా ఆరిన తర్వాత కలబంద రసాన్ని ముఖానికి మరియు మొటిమల మీద అప్లై చేసి డ్రై అయిన తర్వాత రోజ్ వాటర్ తో ముఖం తుడిచేయాలి.

పసుపు:
ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు మరియు ఒక చెంచా పాలు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను మొండి మొటిమల మీద అప్లై చేయాలి . ఒక వారం తర్వాత తిరిగి ఈ హోం రెమెడీని ఉపయోగించాలి. ఇలా రెండు మూడు వారాల పాటు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

నిమ్మ మరియు తేనె:
ఈ రెండు నేచురల్ పదార్థాలు మొండిమొటిమలను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. ఒక బౌల్లో తేనె మరియు రెండు చుక్కల నిమ్మరసం మిక్స్ చేసి మొటిమల మీద అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత తిరిగి అప్లై చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

బాదం :
బాదంను మిక్సీలో వేసి మొత్తగా పొడి చేసి అందులో రెండు చెంచాలా పాలు మిక్స్ చేసి క్రీమ్ లా తయారైన తర్వాత మొండి మొటిమల మీద అప్లై చేయాలి. ఇది డ్రై అయిన తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

నీళ్ళు:
నీళ్లు ఒక ఉత్తమ హోం రెమెడీ. వర్షాకాలంలో మొటిమలను నివారించడానికి నీళ్లతో రోజులో రెండు మూడు సార్లు ముఖం కడిగి తడిలేకుండా కాటన్ టవల్ తో తుడిచేసుకోవాలి . అంతే కాదు, ఒక రోజులో మీ శరీరంకు అవసరం అయ్యే నీళ్ళను కూడా త్రాగాలి ఇలా చేయడం వల్ల శరీరంలో టాక్సిన్స్ మొత్తం తొలగిపోతుంది.

నీళ్ళు:
నీళ్లు ఒక ఉత్తమ హోం రెమెడీ. వర్షాకాలంలో మొటిమలను నివారించడానికి నీళ్లతో రోజులో రెండు మూడు సార్లు ముఖం కడిగి తడిలేకుండా కాటన్ టవల్ తో తుడిచేసుకోవాలి . అంతే కాదు, ఒక రోజులో మీ శరీరంకు అవసరం అయ్యే నీళ్ళను కూడా త్రాగాలి ఇలా చేయడం వల్ల శరీరంలో టాక్సిన్స్ మొత్తం తొలగిపోతుంది.



Click it and Unblock the Notifications
