Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
డార్క్ గా ఉన్న చర్మంను తెల్లగా మార్చే నేచురల్ ఫేస్ ప్యాక్
సాధారణంగా ఫేస్ ప్యాక్ ను చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం మరియు మరింత అందంగా కనబడుట కోసం వివిధ రకాల ఫేస్ ప్యాక్ లను వేసుకుంటుంటారు. ముఖ్యంగా ప్రకటనల్లో వచ్చే క్రీములను, మార్కెట్లో లభించే రసాయనిక క్రీములను అప్లై చేయడం వల్ల స్కిన్ కంప్లెక్షన్ లో ఎలాంటి మార్పులుండవు. దానికి తోడు, ఖర్చైతో కూడిన పని. కాబట్టి, చర్మ సౌందర్యం మెరుగుపరుచుకోవడానికి హోం మేడ్ ఫేస్ ప్యాక్ లను వారానికొకసారి అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ మీ చర్మంను ఫెయిర్ గా మార్చుతుంది. ఎందుకంటే వీటిలో బ్లీచింగ్ లక్షనాలు ఎక్కువగా ఉండటం వల్ల స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఫేస్ ప్యాక్ ల కోసం ఉపయోగించే అన్ని రకాల ఫేస్ ప్యాక్ లలో నిమ్మరసం జోడించబడి ఉంటుంది. ఎందుకంటే వీటిలో బ్లీచింగ్ ప్రోపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ స్కిన్ కంప్లెక్షన్స్ (చర్మం యొక్క సహజ రంగు)ను మెరుగుపరచడంలో మరియు చర్మంలో డార్క్ స్పాట్స్ ను నివారించడంలో నిమ్మరసం గ్రేట్ గా సహాయపడుతుంది.
READ MORE: మిమ్మల్ని తెల్లగా మార్చే 20 నేచురల్ ఫేస్ ఫ్యాక్స్
మరో విధంగా చర్మం టానింగ్ కు గురి అయినప్పుడు కూడా ఈ ఫేస్ ప్యాక్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. డార్క్ కంప్లెక్షన్ నివారించే ఫేస్ ప్యాక్స్ సెన్సిటివ్ స్కిన్ కు కూడా ఉపయోగించవచ్చు. ఎందుకంటే వీటి వల్ల చర్మానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే మీరు ఏదైనా స్కిన్ అలర్జీ ఉన్నట్లైతే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసి తర్వాత నేరుగా ముఖానికి అప్లై చేసుకోవచ్చు...
వేసవిలో పొడి బారిన చర్మం నివారించే బానానా ఫేస్ ప్యాక్స్

లెమన్ ఫేస్ ప్యాక్:
ఒక బౌల్లో కొద్దిగా నిమ్మరసం తీసుకొని అందులో కొద్దిగా పెరుగు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి పూర్తిగా ఆరిత తర్వాత, డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుబ్రం చేసుకోవాలి. ఈ లెమన్ ఫేస్ ప్యాక్ ను వారానికొకసారి అప్లై చేయడం వల్ల మీ చర్మం ఫెయిర్ గా మారుతుంది.

గోధుమపిండి ఫేస్ ప్యాక్ :
ఒక చెంచా గోధుమపిండి, రెండు చెంచాలా రోజ్ వాటర్ వేసి పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించి 20నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ కంప్లెక్షన్ (చర్మం యొక్క రంగు మెరుగు అవుతుంది. గోరువెచ్చని పాలతో శుభ్రం చేస్తే మరింత ఉత్తమ ఫలితం పొందవచ్చు.

తేనె ఫేస్ ప్యాక్:
చర్మంను మరింత ఫెయిర్ గా మార్చే మరో ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఇది. తేనెను నేరుగా ముఖానికి అప్లై చేసి ముఖం మొత్తం మసాజ్ చేసి 20నిముషాల తర్వాత తడికాటన్ టవల్ తో తుడిచేసి, తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఓట్స్ ఫేస్ ప్యాక్:
ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ లో రెండు చెంచాల రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి సర్కులర్ మోషన్ లో మసాజ్ చేయాలి. 20 నిముషాల తర్వాత తడి కాటన్ వస్త్రంతో తుడిచేసి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

పసుపు ఫేస్ ప్యాక్:
స్కిన్ కంప్లెక్షన్ మెరుగుపరచడంలో మరో ఫేస్ ప్యాక్ పసుపు ఫేస్ ప్యాక్. ఒక చెంచా పసుపు, రెండు చెంచాల పాలతో మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ డార్క్ స్కిన్ కంప్లెక్షన్ ఫేస్ ప్యాక్ ను నెలకు రెండు సార్లు వేస్తే మంచి ఫలితం ఉంటుంది.

టమోటో ఫేస్ ప్యాక్:
టమోటోను మెత్తగా గ్రైండ్ చేసి, ముఖం శుభ్రంగా కడిగి తర్వాత ముఖానికి దీన్ని అప్లై చేయాలి. మొదట సారి ఒక సారి అప్లై చేసి తర్వాత డ్రై అయ్యే వరకూ ఉండి తర్వాత రెండో సారి అప్లై చేయాలి . తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల ఇది ఫేషియల్ హెయిర్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

ఆరెంజ్ పీల్ ఫేస్ ప్యాక్:
ఆరెంజ్ తొక్కను తీసి, నీడలో ఎండట బెట్టి, పౌడర్ చేసి అందులో కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత తడిగా ఉండే కాటన్ క్లాత్ తో శుభ్రం చేసుకోవాలి . డ్రై అయిన తర్వాత గోరువెచ్చని పాలతో శుభ్రం చేసుకోవడం వల్ల నేచురల్ గ్లో వస్తుంది..

పెరుగు ఫేస్ ప్యాక్:
పెరుగుతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ఇది ఒక బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది స్కిన్ కంప్లెక్షన్ ను మెరుగుపరుస్తుంది. మూడు చెంచాల పెరుగులో ఒక చెంచా ఓట్స్ చేర్చి బాగా మిక్స్ చేసి ముఖానికి ప్యాల్ లా వేసుకోవాలి. డ్రై అయిన తర్వాత ప్యాక్ ను ముఖం నుండి తొలగించడం వల్ల ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది..



Click it and Unblock the Notifications











