Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
పీరియడ్స్ సమయంలో చర్మం అందంగా కనబడాలంటే?
మహిళలు ప్రతి నెల ఎదుర్కొనే ఒక ఇబ్బందికరమైన, చిరాకు పెట్టే సమస్య పీరియడ్స్(రుతు సమస్య). ఈ సమయంలో చర్మం మరింత వరెస్ట్ గా తయారువుతుంది. మహిళల పీరియడ్స్ సమయంలో చర్మం మరింత సున్నితంగా మారుతుంది. పీరియడ్స్ మొదలవడానికి ముందు శరీరంలో హార్మోనులు చాలా ఎక్కువగా మార్పులు రావడం వల్ల, నూనె గ్రంథుల మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంది. అధికంగా నూనె ఉత్పత్తి కావడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోవడం జరుగుతుంది. మొటిమలు ఏర్పడటానికి కారణం అయ్యే బ్యాక్టీరియాకు ఇది ఒక పెద్ద కారణం అవుతుంది . అందువల్ల బ్యూటిఫుల్ స్కిన్ టిప్స్ ను అనుసరించడం చాలా అవసరం. ముఖ్యంగా పీరియడ్స్ మరియు పీరియడ్స్ సమయంలో స్కిన్ కేర్ చాలా అవసరం అవుతుంది.
మహిళల్లో గడిచే 14 రోజుల సైకిల్లో, ఈస్టోజెన్ లెవల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అంతే కాదు ఆండ్రోజన్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి . ఇది ఆయిల్ గ్లాండ్స్ యాక్టివ్ గా ఉన్నప్పుడు, చర్మంలో ఆయిల్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది . పీరియడ్స్ సమయంలో మొటిమలు ఏర్పడుటకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ప్రధాణ కారణం అవుతుంది . కొంత మంది మహిళల్లో ఇలా మొటిమలు ఏర్పడటం కూడా పీరియడ్స్ కు సంకేతంగా సూచిస్తుంది. ఈ సమస్యను నివారించడం కోసం, మనం తరచూ వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నించాలి . ఇది బ్యూటిఫుల్ స్కిన్ టిప్ కాకపోయినా, అలా చేయడానికి ప్రధాణ కారణం, ముందుముందు చర్మం మీద పర్మనెంట్ మార్క్ ఏర్పడకుండా చూస్తుంది . ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మొటిమల ఏర్పడుటకు కారణం అయ్యే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ను నివారించవచ్చు.
మరి పీరియడ్స్ సమయంలో సున్నితమైన చర్మంను కాపాడుకోవడానికి కొన్ని సున్నితమైన స్కిన్ కేర్ టిప్స్ ఈ క్రింది విధంగా......

మీ ముఖంను రెగ్యులర్ గా శుభ్రం చేస్తుండాలి
స్కిన్ కేర్ టిప్స్ లో చాలా సులభ చిట్కా. రెగ్యులర్ గా ముఖంను చల్లటి నీటితో శుభ్రం చేస్తుండాలి. ఇది చర్మం మీద ఉన్న మురికిని మరియు ఎక్సెస్ ఆయిల్ ను తొలగించడానికి సహాయపడుతుంది.

క్లెన్సర్ ను ఉపయోగించడం
పోస్ట్ ఓవలేషన్ పీరియడ్ లో స్కిన్ అధనపు ఆయిల్ ను ఉత్పత్తి చేస్తుంది అందువల్ల, చర్మం యొక్క ఇన్ఫెక్షన్స్ మరియు ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడానికి క్లెన్సర్ తో ముఖం రోజుకు 2-3సార్లు శుభ్రం చేసుకోవాలి.

స్వీట్స్ తినడం తగ్గించాలి
పీరియడ్స్ సమయంలో చర్మంలో ఎక్సెస్ ఆయిల్ ను నివారించడానికి స్వీట్ తినడం తగ్గించాలి మరియు ఆయిల్ ను ఉత్పత్తి చేసే ఇతర ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. ఇది మరో బ్యూటిఫుల్ స్కిన్ టిప్ . ఈ చిట్కాను చాలా సులభంగా అనుసరించవచ్చు.

హెల్తీ డైట్ ను అనుసరించాలి
ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఫిష్, ఫ్రెష్ ప్రూట్స్ మరియు వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల ఇది పూర్తిగా శరీరం యొక్క జీవప్రక్రియలను శుభ్రం చేస్తుంది. చర్మం క్లీన్ గా మరియు కాంతివంతంగా మార్చుతుంది.

చర్మానికి మాయిశ్చరైజ్ చేస్తుంది
పీరియడ్స్ సమయంలో మహిళలు శరీరం నుండి ఎక్కువ నీరును కోల్పోతారు . దాని వల్ల చర్మం డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. దాంతో చర్మం చిరాకు పెడుతుంది మరియు రఫ్ గా మారుతుంది. అందువల్ల రోజులో అప్పుడప్పుడు డీప్ గా మాయిశ్చరైజర్ ను అప్లై చేస్తుండాలి.

సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించాలి
పీరియడ్స్ సమయంలో చర్మం మరింత సెన్సిటివ్ గా మారుతుంది. సూర్య రశ్మి వల్ల చర్మం మరింత ఎరుపుగా మారుతుంది. బయట వెళ్ళాల్సి వస్తే సన్ స్క్రీన్ తప్పనిసరిగా అప్లై చేయాలి.

హానికరమైన ప్రొడక్ట్స్ ను చర్మానికి అప్లై చేయకూడదు
పీరియడ్స్ ముందు, తర్వాత చర్మం చాలా సున్నితంగా తయారవుతుంది, అలాంటి సమయంలో చర్మంకు యాంటీ ఎన్స్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం వల్ల పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది . అలాంటి హానికరమైన ప్రొడక్ట్స్ ను పీరియడ్స్ సమయంలో నివారించాలి.

స్కిన్ మసాజ్
ప్రీ మెనుష్ట్ర్యువల్ సైకిల్, మూడ్ తరచూ మారుతుంటుంది మరియు ఎక్కువగా ఒత్తిడికి గురి అవుతుంటారు . ఇది చర్మం మీద ప్రభావం చూపి, మరింత డల్ గా కనబడేలా చేస్తుంది . స్కిన్ మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గించుకోవచ్చు.

ఫ్రూట్ ఫేషియల్ మాస్క్
పీరియడ్స్ సమయంలో డల్ స్కిన్ నివారించడం కోసం, నేచురల్ హోం మేడ్ ఫ్రూట్ మాస్క్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల . చర్మానికి ఇది తక్షణ కాంతిని అందిస్తుంది. మరియు ఇది ఆరోగ్యంగా, స్వచ్చమైన చర్మ సౌందర్యంను అందిస్తుంది.



Click it and Unblock the Notifications