Latest Updates
-
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.?
మొటిమలను మాయం చేసే ఎగ్ వైట్ చిట్కాలు
స్వచ్చమైన..మెరిసే చర్మ సౌందర్యం కలిగి ఉండటం అనేది ప్రతి ఒక్క అమ్మాయి యొక్క డ్రీమ్. అలాంటి సమయంలో ఇబ్బంది కలిగించే మొటిమలు కనుక ఉన్నట్లైతే ముఖ సౌందర్యం మొత్తం పాడు చేస్తుంది . కాబట్టి మొటిమలు ప్రమాధకరమైనవి కాకపోయినప్పటికి , చర్మంలో మొటిమల తాలుకు మచ్చలు గుర్తులుగా మిలిగిపోతాయి. కాబట్టి, ఎప్పటికప్పుడు మొటిమలు మరియు మచ్చలు నివారించుకోవడానికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.
మొటిమలకు వివిధ రకాల కారణాలున్నాయి. వాటిలో స్ట్రెస్, హార్మోనుల ప్రభావం మరియు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం. కారణం ఏదైనా మొటిమలు ఏర్పడకుండా, లేదా మొటిమలు మరియు మచ్చలను నివారించడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. వీటని అనుసరించడం ద్వారా మొఖంలో మొటిమలు మచ్చలు తొలగించి ముఖం మచ్చలు లేకుండా క్లియర్ స్కిన్ గ్లోయింగ్ స్కిన్ ను పొందుతారు.
అలాంటి ఎఫెక్టివ్ హోం రెమెడీస్ లో ఎగ్ వైట్ ఒకటి. ఇది మొటిమలు మరియు మచ్చలను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. ఎగ్ వైట్ లో విటమిన్ బి2 అందుకు బాగా సహాయపడుతుంది. ఇది మొటిమలను మచ్చలను తొలగించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది మరియు స్వచ్చమైన కాంతివంతమైన చర్మ సౌందర్యం అందిస్తుంది. మరి ఎగ్ వైట్ ను ఎలా ఉపయోగించాలో చూద్దాం...

ఎగ్ వైట్ మరియు నిమ్మరసం:
ఆయిల్ స్కిన్ కు ఈ రెండూ పర్ఫెక్ట్ కాంబినేషన్ మరియు స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది . ఒక గిన్నెలో ఎగ్ వైట్ తీసుకొని అందులో కొద్దిగా నిమ్మరసం చేర్చి బాగా మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. అరగంట తర్వాత ముఖాన్ని చల్లటి మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మం రంద్రాలను కూడా మాయం చేస్తుంది.

ఎగ్ వైట్, తేనె, మరియు నిమ్మరసం:
ఈ మూడింటి మిశ్రమం యొక్క ఫేస్ ప్యాక్ చర్మాన్ని టైట్ చేసి, టోనింగ్ చేస్తుంది. పెద్ద చర్మ రంద్రాలను తగ్గిస్తుంది . ఎగ్ వైట్ లో ఉండే లైసోజిమ్ అనే ఎంజైమ్ మొటిమలకు కారణం అయ్యే బ్యాక్టిరియాను నాశనం చేస్తుంది. తేనె, నిమ్మరసం మరియు ఎగ్ వైట్ ను మిక్స్ చేసి ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి . అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ముఖంలో అదనపు నూనె తొలగిస్తుంది. దాంతో మొటిమలు మరియు మచ్చలను నివారిస్తుంది.

. పసుపు, ఆరెంజ్ జ్యూస్ మరియు ఎగ్ వైట్:
ఈ ఫేస్ మాస్క్ అద్భుతం చేస్తుంది. మొటిమల వల్ల వచ్చే స్కార్స్ తగ్గిస్తుంది. ఒక బౌల్ తీసుకొని అందులో ఆరెంజ్ జ్యూస్ , పసుపు, ఎగ్ వైట్ తీసుకొని బాగా మిక్స్ చేసి ముఖం మెడకు పట్టించాలి. తర్వాత చల్లటి నీటితో అరగంట తర్వాత కడిగేయడం వల్ల డార్క్ స్పాట్స్ తొలగిస్తుంది మరియు స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది.

ఎగ్ వైట్, తేనె మరియు దాల్చిన చెక్క:
ఈ మూడింటి మిశ్రమం చర్మం శుభ్రం చేయడంతో పాటు ఎక్స్ఫోయేట్ చేస్తుంది. ఒక చెంచా తేనెకు రెండు ఎగ్ వైట్ మిక్స్ చేసి అందులో అర చెంచా దాల్చిన చెక్ పొడి వేసి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. మొటిమలు మాయం అవుతాయి.

. ముల్తాని మట్టి మరియు ఎగ్ వైట్:
ముల్తాని మట్టి మరియు ఎగ్ వైట్ కాంబినేషన్ మొటిమలను నివారిస్తుంది . ఇందులో ఉండే మెగ్నీషియం, క్యాల్షియం మరియు సిలికా ఉండటం వల్ల ముఖంలో జిడ్డును తొలగిస్తుంది . ఎగ్ వైట్ చర్మాన్ని టైట్ చేస్తుంది మరియు స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది.

ఎగ్ వైట్ మరియు రోజ్ వాటర్:
ఎగ్ వైట్ మరియు రోజ్ వాటర్ మిశ్రం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మరియు చర్మ రంద్రాలను మూసేస్తుంది . రోజ్ వాటర్ స్కిన్ టోనర్ పెంచుతుంది. చర్మానికి నేచురల్ గ్లో అందిస్తుంది.

బొప్పాయి, నిమ్మరసం, మరియు ఎగ్ వైట్
బొప్పాయి, నిమ్మరసం, మరియు ఎగ్ వైట్ బొప్పాయి చర్మంలో మచ్చలు మొటిమలను తొలగించడంతో పాటు సెబమ్ ను కంట్రోల్ చేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నివారించడంలో ఈ మూడింటి యొక్క మిశ్రమం గ్రేట్ గా పనిచేస్తుంది .

శాండిల్ ఉడ్ పేస్ట్ మరియు ఎగ్ వైట్:
శాండిల్ వుడ్ పేస్ట్ మరియు ఎగ్ వైట్ లో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి . చందనంను ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తారు. ప్రతి ఒక్కరి చర్మానికి ఇది సూట్ అవుతుంది. శాండిల్ వుడ్ పేస్ట్ సన్ టాన్ కూడా నివారిస్తుంది. శాండిల్ వుడ్ పేస్ట్ మరియు ఎగ్ వైట్ ను మిక్స్ చేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications
