Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
ముఖంలో బ్లాక్ హెడ్స్, డెడ్ స్కిన్ సెల్స్ తొలగించే హోం మేడ్ ఫేషియల్స్
ఫేషియల్ స్ర్కబ్ చేయడం వల్ల ముఖ చర్మలో డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది మరియు చర్మం యొక్క కాంప్లెక్షన్ నివారిస్తుంది . మరియు ఇది చర్మలోని రంద్రాలు తెరచుకొనేలా చేసి బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ ను కూడా తొలగిస్తుంది . కొన్ని ఎఫెక్టివ్ హోం మేడ్ ఫేషియల్ స్ర్కబ్స్ ను మీకోసం ఈ రోజు పరిచయం చేస్తున్నాము.
ఫేషియల్ స్ర్కబ్ చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది మరియు చర్మం ఫ్రెష్ గా కనబడేలా చేస్తుంది. ఇంకా చర్మంలోని టాక్సిన్స్ తొలగించడంతో పాటు, ఎక్సెస్ ఆయిల్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది. ముఖ్యంగా ఫేషియల్ స్ర్కబ్ వల్ల చర్మంలోని మొటిమలు మరియు మచ్చలకు కారణం అయ్యే నూనె మరియు చర్మంలోని మలినాలను తొలగిస్తుంది.
Read more: మీరు నల్లగా ఉన్నారా?ఐతే తెల్లని చర్మసౌందర్యం పొందడానికి 13 పవర్ ఫుడ్స్ మీకోసం
మార్కెట్లో వివిధ రకాల కెమికల్ ఫేషియల్ స్ర్కబ్స్ అందుబాటులో ఉన్నా కూడా, మన ఇంట్లో తయారుచేసుకొనే హోం మేడ్ ఫేషియల్ స్ర్కబ్స్ చర్మానికి సురక్షితమైనవి.... మరి ఆ సురక్షితమైన హోం మేడ్ ఫేషియల్ స్ర్కబ్స్ ఏంటో ఒక సారి చూద్దాం....

బ్లూ బెర్రీ :
కొన్ని బ్లూబెర్రీ పండ్లు తీసుకొని మెత్తగా మ్యాష్ చేయాలి. అందులో కొద్దిగా బ్రౌన్ షుగర్ మిక్స్ చేసి ముఖానికి పట్టించి సర్కులర్ మోషన్ లో బాగా మర్ధన చేసి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

కాఫీ:
ఫేషియల్ స్ర్కబ్ ను ఇంటి వద్ద ఎలా తయారుచేసుకోవాలి? కొన్ని కాఫీ బీన్ తీసుకొని రఫ్ గా పొడి చేసుకోవాలి అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి పట్టించి బాగా మర్ధన చేసి 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకవోాలి. మొటిమలకు ఇది ఒక ఉత్తమ ఫేషియల్ స్ర్కబ్ .

ఓట్ మీల్ స్ర్కబ్:
కొద్దిగా పాలపొడి తీసుకొని అందులో కార్న్మీల్, ల్యావెండర్ ఆయిల్ మరియు ఓట్ మీల్ వేసి, మొత్తాన్ని బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి, నిధానంగా మర్ధన చేయాలి. ముఖం, ముక్కు మీద బాగా మర్ధన చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్, బ్లాక్ హెడ్స్ తొలగిపోయి, ముఖం కాంతివంతంగా మారుతుంది.

బొప్పాయి:
బాగా పండిన బొప్పాయి ముక్కలను మరియు కొద్దిగా తేనె మరియు పంచదార వేసి మిక్స్ చేసి ముఖానికి పట్టించి స్ర్కబ్ చేయాలి . కొన్ని నిముషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

చాక్లెట్ స్ర్కబ్:
చాక్లెట్ ను కరిగించి అందులో అందులో బాదం ఆయిల్ మరియు పంచదార వేసి మిక్స్ చేసి చర్మానికి పట్టించి స్ర్కబ్ చేయాలి. డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంలో మంచి నిగారింపు వస్తుంది.

టమోటో:
టమోటో చర్మానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇందులో విటిమిన్ సి ఉండటం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. టమోటో గుజ్జులో కొద్దిగా పంచదార వేసి ముఖానికి పట్టించి శుభ్రం చేయడం వల్ల వ్రుద్దాప్య లక్షణాలను నివారిస్తుంది మరియు చర్మం రిఫ్రెష్ చేస్తుంది.

గ్రీన్ టీ స్ర్కబ్:
గ్రీన్ టీ కి పంచదార చేర్చకుండా తయారుచేయాలి . తర్వాత ఈ టీని చల్లారనివ్వాలి . తర్వాత ఇందులో కొద్దిగా పంచదార వేసి చిక్కగా చేయాలి. మరియు ఇందులో కొద్దిగా తేనె మిక్స్ చేయవచ్చు.ఈ ఫేషియల్ స్ర్కబ్ ను ముఖానికి పట్టించి కొన్ని నిముషాల తర్వాత కడిగేసుకోవాలి.

బాదం స్ర్కబ్:
కొన్ని బాదంను పొడి చేసుకోవాలి. మరి మెత్తని పౌడర్ గా కాకుండా రఫ్ గా చేసుకోవాలి . తర్వాత ఇందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి ముఖానికి పట్టించి స్ర్కబ్ చేయాలి.

టూత్ పేస్ట్:
కొద్దిగా టూత్ పేస్ట్ తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసి మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల ముఖంలో మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి . ఇది ఒక ఉత్తమ ఫేషియల్ స్ర్కబ్ .

పెరుగు:
పెరుగులో కొద్దిగా పంచదార వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి స్ర్కబ్ చేయాలి. ఈ ఫేస్ స్ర్కబ్ వల్ల చర్మానికి పోషణ అందుతుంది . ఇందులో విటమిన్స్ అధికంగా ఉంటాయి మరియు ఇది చర్మానికి రక్తప్రసరణను అందిస్తుంది.



Click it and Unblock the Notifications
