మిమ్మల్ని అందంగా..ప్రకాశవంతంగా మార్చే టాప్ 12 ఆపిల్ ఫేస్ మాస్క్ ....

ప్రతి రోజూ ఒక్క ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని విషయాన్ని ఎప్పుడోఒకప్పుడు మనం వినే ఉంటాము. ఈ బెనిఫిషియల్ ఫ్రూట్ లో విటమిన్ సి, విటమిన్ ఎ మరియు కాపర్ మరియు మరికొన్ని స్కిన్ ఫ్రెండ్లీ న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఆపిల్లో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ను రీస్టోర్ చేస్తుంది. చర్మంను కాంతివంతంగా మార్చే కొల్లాజెన్ ఉత్పత్తి పెంచుతుంది . కొల్లాజెన్ చర్మం యొక్క ఎలాసిటిని పెంచుతుంది. దాంతో ముఖంలో ముడుతలు తగ్గిపోతాయి మరియు చర్మం తేమగా ఉంటుంది.

READ MORE: యాపిల్ తింటే డాక్టర్ అవసం ఉండదా..ఎంత వరకూ నిజమో చూడండి..!

ఆపిల్లో ఉండే కాపర్ కంటెంట్ చర్మంలో దాగి ఉన్న మెలానిన్ ఉత్పత్తిని మెయింటైన్ చేస్తుంది. ఈ మెలనిన్ ఉత్పత్తి వల్ల చర్మాన్ని హానికరమైన సూర్యరశ్మి వల్ల కాపాడుతుంది. దాంతో చర్మానికి నేచురల్ సన్ స్క్రీన్ గా పనిచేస్తుంది. ఆపిల్లో ఉండే విటమిన్ ఎ చర్మం యొక్క టిష్యు డ్యామేజ్ అవ్వకుండా.. కొత్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది.

మరి వివిధ రకాల చర్మ తత్వాలున్న వారు ఉపయోగించాల్సిన కొన్ని ఆఫిల్ ఫేస్ ప్యాక్స్ ఈ క్రింది విధంగా....:

READ MORE: గ్రీన్ ఆపిల్ తినడంవల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆపిల్ ఫేస్ ప్యాక్ కోసం మనం మీడియం సైజ్ ఆపిల్ ఉపయోగిస్తే సరిపోతుంది. ఫ్రెష్ గా ఉన్నది తురిమి ఫేస్ ప్యాక్ తయారీలో వేసుకోవచ్చు. అలాగే ముందుగా ఎప్పుడో కట్ చేసి పెట్టుకొన్న ఆపిల్ ను కూడా ఉపయోగించకూడదు.

ఆయిల్ స్కిన్ కలవారికి ఆపిల్ ఫేస్ ప్యాక్:

ఆయిల్ స్కిన్ కలవారికి ఆపిల్ ఫేస్ ప్యాక్:

ఒక మిక్సింగ్ బౌల్లో ఆపిల్ తురుము తీసుకొని, అందులో ఒక చెంచా పెరుగు మరియు ఒక చెంచా నిమ్మరసం మిక్స్ చేయాలి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ కంటెంట్ స్కిన్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది మరియు చర్మంను కాంతివంతంగా మార్చుతుంది. మరియు ఇది ముఖ చర్మంలో అదనపు నూనెను గ్రహించి చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. ఈ మిశ్రమాన్ని బాగా స్మూత్ గా మిక్స్ చేసి తర్వాత ఆయిల్ స్కిన్ కు అప్లై చేయాలి. ముఖం మొత్తం పట్టించి 15నిముషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి.

డ్రై స్కిన్ కోసం ఆపిల్ ఫేస్ ప్యాక్:

డ్రై స్కిన్ కోసం ఆపిల్ ఫేస్ ప్యాక్:

ఒక మిక్సింగ్ బౌల్లో ఆపిల్ తురుము తీసుకొని అందులో కొన్ని చుక్కల గ్లిజరిన్ మిక్స్ చేసి మెత్తగా కలిపి ముఖానికి అప్లై చేసి 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

 సెన్సిటివ్ స్కిన్ కోసం:

సెన్సిటివ్ స్కిన్ కోసం:

చిన్న సైజు ఆపిల్ ను వేడినీళ్ళలో వేసి మెత్తగా ఉడికించుకోవాలి. మెత్తగా అయిన తర్వాత తొక్కను తొలగించి తర్వాత మెత్తగా చేసి తర్వాత, అందులో బాగా పండిన అరటిపండు పేస్ట్ మరియు ఒక చెంచా ఫ్రెష్ క్రీమ్, ఒక చెంచా బాగా పండిన అరటిపండు గుజ్జు ముఖానికి పట్టించాలి. 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

 డై స్కిన్ నుండి నార్మ్ స్కిన్ కలవారికి :

డై స్కిన్ నుండి నార్మ్ స్కిన్ కలవారికి :

ఇది చాలా పాపులర్ అయినటువంటి ఆపిల్ ఫేస్ ప్యాక్ . ఆపిల్ గుజ్జుకు కొద్దిగా తేనె మిక్స్ చేసి, ముఖం మొత్తానికి పట్టించి 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం సాఫ్ట్ గా మరియు స్మూత్ గా మారుతుంది. ఇది చర్మంను కాంతివంతంగా మార్చుతుంది. అందుకే దీన్ని అనేక ఫేస్ ప్యాక్స్, స్కిన్ క్రీమ్స్ లో ఉపయోగిస్తుంటారు.

ముఖానికి తక్షన కాంతినందించే ఆపిల్ ఫేస్ ప్యాక్ :

ముఖానికి తక్షన కాంతినందించే ఆపిల్ ఫేస్ ప్యాక్ :

ఈ ఆపిల్ ఫేస్ ప్యాక్ ప్రతి ఒక్కరి చర్మ తత్వానికి సహాయపడుతుంది. ఈ ఫ్రూట్ ఫేస్ ప్యాక్ కోసం 2 చెంచాల ఆపిల్ తురుము, ఒక చెంచా తాజా దానిమ్మ రసం మిక్స్ చేయాలి. ఇది యాంటీఆక్సిడెంట్స్, యాంటీ మైక్రో బయల్ మరియు యాంటో ఏజింగ్ లక్షణాలను పుష్కలంగా కలిగి ఉండటం వల్ల ఇది చర్మం యొక్క ఎపిడిమిక్స్ కు రక్షణ కల్పిస్తుంది. ఇది స్కిన్ సెల్స్ ను రీజనరేట్ చేస్తుంది. ఒక చెంచా ఆపిల్ తురుములో ఒక చెంచా పెరుగు మిక్స్ చేసి స్మూత్ గా చేసి ఈ ప్యాక్ ను ముఖం మరియు మెడకు పట్టించి 20నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి .దీన్ని మీరు ఫ్రూట్ ఫేషియల్ గా ఉపయోగించాలి. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల ఇన్ స్టాంట్ గ్లో వస్తుంది.

ఆపిల్ స్కిన్ :

ఆపిల్ స్కిన్ :

ఆపిల్ స్కిన్ ను మెత్తగా పేస్ట్ చేసి తర్వాత, అందులో ఒక చెంచా తేనె మిక్స్ చేసి పేస్ట్ లా చేసి దీన్ని ముఖానికి పట్టించాలి. దీన్ని నార్మల్ ఫేస్ ప్యాక్ గా అప్లై చేయడం వల్ల ఇది మీ స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది. దీన్ని మీరు రెగ్యురల్ గా ఉపయోగించే ఏ ఫేస్ ప్యాక్ అయినా సరే మిక్స్ చేసి ఫేషియల్ మాస్క్ గా వేసుకోవాలి.

మొటిమలను నివారిస్తుంది:

మొటిమలను నివారిస్తుంది:

ఆపిల్ ను తురిమి అందులో తేనె మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేసి 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రెగ్యులర్ గా దీన్ని అప్లై చేయడం వల్ల మొటిమలు మరియు మచ్చలు తొలగిపోతాయి. ఆపిల్ ఫేస్ మాస్క్ మిమ్మల్ని స్మూత్ గా మరియు సపెల్ గా మార్చుతుంది.

 నేచురల్ :

నేచురల్ :

ఆపిల్లో ఉండే నేచురల్ యాసిడ్స్ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ మరియు కాంతివంతమైన చర్మంతో ఆయిల్ ఉత్పత్తి అవ్వడం వంటి వన్నీ తొలగిస్తుంది. ఒక చెంచా ఆపిల్ జ్యూస్ లో , రెండు చెంచాలా పాలు మిక్స్ చేసి ముఖం, మెడకు అప్లై చేసి 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల సాఫ్ట్ గా మరియు కాంతివంతంగా మారుతుంది

 ఆపిల్ మరియు గోధుమ గడ్డితో మాస్క్ :

ఆపిల్ మరియు గోధుమ గడ్డితో మాస్క్ :

ఒక చెంచా ఆపిల్ గుజ్జులో గోధుమ గడ్డిని వేసి మిక్స్ చేసి ముఖానికి పట్టించి 20నిముషల తర్వాత 20 గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. గోధుమగడ్డి ఎక్స్ ఫ్లోయేట్ గా పనిచేస్తుంది డెడ్ స్కిన్ లేయర్ సెల్స్ ను తొలగిస్తుంది. ఇది మీ చర్మంను సాఫ్ట్ గా మరియు కాంతివంతంగా మార్చుతుంది.

ఆపిల్ మరియు ఓట్ మీల్:

ఆపిల్ మరియు ఓట్ మీల్:

రెండు చెంచాల ఓట్స్ పొడిలో ఒక చెంచా ఆపిల్ పేస్ట్ మరియు తేనె వేసి మిక్స్ చేయాలి. పేస్ట్ ను ముఖానికి పట్టించాలి. 20నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం ముఖాన్ని కాంతివంతంగా మార్చుతుంది.

 ముఖానికి ఆపిల్ మాస్క్ :

ముఖానికి ఆపిల్ మాస్క్ :

గోరువెచ్చని పాలలో కొద్దిగా ఆపిల్ పేస్ట్ మిక్స్ చేసి, దానికి 1 గుడ్డులోని పచ్చసొన వేసి మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి పట్టించి 20నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి .

గ్రీన్ ఆపిల్ మాస్క్ :

గ్రీన్ ఆపిల్ మాస్క్ :

ఆపిల్ ముక్కలను సన్నగా తరిగి, అందులో తేనె మరియు పెరుగు మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి 20నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.గ్రీన్ ఆపిల్లో విటమిన్స్ మరియు నేచురల్ యాసిడ్స్ ఉండటం వల్ల ఇది చర్మంను తెల్లగా మరియు కాంతివంతంగా మార్చుతుంది .

Desktop Bottom Promotion