చర్మం సాగకుండా సొగసుగా..అందంగా మార్చే టాప్ 13 హోం రెమెడీస్

వయసు పెరుగుతున్నా.. నవయౌవనంగా కనిపించాలంటే చర్మంలో సాగే గుణం తగ్గకూడదు. అలాంటి సొగసును సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా..సహజంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో చర్మ సమస్యలను ఎదుర్కొంటుంటారు. వయసురీత్యా చర్మంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా వయసు పైబడే కొద్దీ చర్మం సాగినట్లు కనిపిస్తుంది. ముఖ చర్మంలో ఉండే కండరాల పటుత్వం తగ్గడమే అందుకు కారణం.

సాగిన గుర్తులు తరచుగా, త్వరిత పెరుగుదల (యవ్వనారంభంలో) లేదా బరువు పెరగటం (ఉదా. గర్భధారణ, కండర నిర్మాణం, లేదా త్వరితంగా కొవ్వు చేరటం) లేదా కొన్ని సందర్భాలలో, అంతశ్చర్మం యొక్క స్థితిస్థాపకతను మించి చర్మంపై తీవ్రమైన సాగుడు బలం పనిచేసిన సందర్భాలలో చర్మం త్వరగా సాగటానికి కారణం అవుతుంది. యవ్వనారంభం, గర్భధారణ, కండర నిర్మాణం, లింగమార్పిడి కొరకు హార్మోన్ పునఃస్థాపక చికిత్సలు మొదలైన వాటి వలన కూడా చర్మంలో సాగిన గుర్తులు ఏర్పడవచ్చు.

చర్మ సమస్యలకు టమోటో చేసే అద్భుతం...

సాగిన చర్మం యొక్క లక్షణాలు అవి మొదట ఎరుపు లేదా ఊదావర్ణపు గీతలుగా కనబడతాయి, కానీ క్రమంగా లేత రంగులోకి మారతాయి. ప్రభావిత ప్రాంతాలు ఖాళీగా కనబడి, స్ప్రుశించినపుడు మృదువుగా ఉంటాయి. సాగిన గుర్తులు అంతశ్చర్మంలో ఏర్పడతాయి, ఇది చర్మం దాని ఆకృతిని నిలుపుకోవడానికి సహాయపడే సంకోచించే మధ్య పొర. అంతశ్చర్మంలో బలం ఉన్నంతవరకు సాగిన గుర్తులు ఏర్పడవు. గుర్తులు ఏ ప్రదేశంలో ఏర్పడతాయి మరియు ఏ విధంగా విస్తరిస్తాయి అనే దానిపై సాగటం యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఇందుకు సాగటం మాత్రమే కారణం కాదు.

అన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ కి బెస్ట్ శనగపిండి ఫేస్ ప్యాక్స్

చర్మంపై సాగినగుర్తులు కనబడటానికి అనేక కారణాలు ఉన్నాయి: ప్రసవించిన వెంటనే 324 మంది స్త్రీలపై జరిపిన అధ్యయనం, చిన్న వయసులో తల్లి కావడం, అధిక శరీర బరువు సూచిక, 15 కిలోగ్రాములు (31 పౌండ్ల) కంటే ఎక్కువ బరువు పెరగడం మరియు నవజాత శిశువు యొక్క బరువు అధికంగా ఉండటం గుర్తులు ఏర్పడటానికి విభిన్న స్వతంత్ర కారణాలుగా ఉన్నాయని సూచించింది. కౌమారదశలో ఉన్నవారు తీవ్రమైన గుర్తులు ఏర్పడే హానిని ఎక్కువగా కలిగిఉన్నారు.

వేగంగా పెరిగే చర్మాన్ని నియంత్రణలో ఉంచడానికి అవసరమైన కొలాజెన్ మరియు ఎలాస్టిన్ తంతువులను ఏర్పరచకుండా సాగిన గుర్తులు పెరగడానికి కారణమయ్యే గ్లూకోకోర్టికాయిడ్ హార్మోన్లు చర్మం పైపొరను ప్రభావితం చేస్తాయి. చర్మం సాగుదలతో, ఇది అనుకూల పదార్థ లేమిని సృష్టించి, దానితో అంతర మరియు బహిశ్చర్మ చిరుగుదలకు దారితీస్తుంది.

ప్రకాశవంతమైన చర్మ సౌందర్యాన్ని అందించే ఫ్రూట్ జ్యూసులు

సాగిన చర్మంను తిరిగి పూర్వస్థితికి తీసుకు రావడానికి కొన్ని బెస్ట్ ఫేస్ మాస్క్ లు, ఫేషియల్ వ్యాయామాంలు, మరియు కొన్ని గ్రేట్ న్యూట్రీషియల్ టిప్స్ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో శరీరంలో వాటర్ రిటన్స్ వల్ల మరియు శరీరంలో టాక్సిన్స్ ఏర్పడటం వల్ల ముఖంలో వాపు మరియు చర్మం సాగడం జరుగుతుంది. మరి ఈ సాగిన చర్మాన్ని నివారించుకోవడానికి సహాయపడే బెస్ట్ రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం...

చర్మం సాగిల పడుతుంటే..ఈ చిట్కాలతో నివారించండి..!

1. పెరుగు మరియు కలబంద ఫేస్ మాస్క్:

1. పెరుగు మరియు కలబంద ఫేస్ మాస్క్:

ఈ ఫేస్ మాస్క్ సాగిన చర్మాన్ని టైట్ చేస్తుంది. అందుకు 4చెంచాల పెరుగులో 2 చెంచాలా అలోవెరా జెల్ ను వేసి మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేసి 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి . ఇది సాగిన చర్మాన్ని బిగువుగా చేయడంతో పాటు, సాఫ్ట్ గా మార్చుతుంది . బుగ్గల్లో మెరుపు, బుగ్గలు సాగకుండా ఉండేందుకు ఈ రెమెడీస్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.

2. అవొకాడో మరియు హనీ ఫేస్ ప్యాక్:

2. అవొకాడో మరియు హనీ ఫేస్ ప్యాక్:

బాగా పండిన అవొకాడో గుజ్జులో రెండు చెంచాలా తేనె వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ముఖం మొత్తం అప్లై చేయాలి. 20నిముషాలు అలాగే ఆరనిచ్చి, తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. సాగిన చర్మానికి ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ.

3. ఫేషియల్ ఎక్సర్ సైజ్:

3. ఫేషియల్ ఎక్సర్ సైజ్:

సాగిన చర్మానికి మరో బెస్ట్ హోం రెమెడీ ఫేషియల్ ఎక్సర్ సైజ్ . సింపుల్ గా చేసే కొన్ని ఫేస్ వ్యాయామా వల్ల ముఖంలో మరియు బుగ్గల్లో కొత్త మెరుపులు సంతరించుకుంటాయి. సాగిన ముఖంలో ఫ్లాసిడ్ మజిల్స్ కు కొన్ని సింపుల్ వ్యాయామాల వల్ల చర్మాన్ని బలోపేతం చేస్తూ, సాగిన చర్మాన్ని నివారిస్తాయి. జస్ట్ సింపుల్ గా స్మైల్ చేసి పది నిముషాలు అలాగే స్మైల్ ఫేస్ తో ఉండాలి. ఇలా రోజుకు 5నిముషాలు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

4. రెండవ ఫేషియల్ ఎక్సర్ సైజ్:

4. రెండవ ఫేషియల్ ఎక్సర్ సైజ్:

రెండవ ఫేషియల్ వ్యాయామం వల్ల బుగ్గల్లో మెరుపుతో పాటు సాగిన చర్మం నివారించబడుతుంది . నోటినిండా గాలి పీల్చి, నోట్లో బుగ్గల నిండా కాసేపు అలాగే ఉంచాలి. 10నిముషాల తర్వాత నిదానంగా వదలాలి . ఇది ముఖంలో సర్కులర్ మోషన్ లో తొప్పడం వల్ల మంచి వ్యాయామం అందివ్వబడి, బుగ్గల వద్ద సాగిన చర్మాన్ని నివారిస్తుంది. ఇలా రోజులో రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

5. ఎగ్ మాస్క్ :

5. ఎగ్ మాస్క్ :

ఎగ్ వైట్ లో హనీ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. 15నిముషాలు అలాగే వదిలేసి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ముఖంలో కండరాలను బలోపేతం చేస్తుంది.వదులైన చర్మం బిగువుగా తయారవుతుంది.

6. డిటాక్సిఫైచేసే నేచురల్ జ్యూస్ త్రాగాలి:

6. డిటాక్సిఫైచేసే నేచురల్ జ్యూస్ త్రాగాలి:

బహిర్గతంగా మాత్రమే కాదు, అంతర్గతంగా కూడా మార్పులు చేసుకోవడం చాలా అవసరం. సాగిన చర్మానికి నివారించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది . నీరు బాగా తాగడం వల్ల అంతర్గత మలినాలను బయటకు పంపించవచ్చు . దాంతో ముఖంలో వాపు మరియు సాగిన చర్మాన్ని నివారించుకోవచ్చు . అలాగే ప్రతి రోజూ గ్రేఫ్ ఫ్రూట్, ఆరెంజ్ మరియు స్ట్రాబెర్రీ జ్యూస్ లను తీసుకోవడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా బాడీ డిటాక్సిఫై చేసుకోవడంతో పాటు , సాగిన చర్మాన్ని నివారించుకోవచ్చు.

7. కీరదోసకాయతో ఫేస్ మాస్క్:

7. కీరదోసకాయతో ఫేస్ మాస్క్:

కీరదోసకాయలను సన్నగా స్లైస్ గా కట్ చేసి ముఖం మీద అక్కడక్కడా పెట్టుకోవాలి. లేదా పేస్ట్ లా చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తర్వాత తొలగించి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అలాగే రెగ్యులర్ డైట్ లో కీరదోసకాయను చేర్చుకోవడం ద్వారా అంతర్గతంగా మరియు బహిర్గతంగా మలినాలను తొలగించుకొని సాగిన చర్మాన్ని నివారించుకోవచ్చు.

8. టమోటోలు:

8. టమోటోలు:

తాజాగా ఉన్న టమోటోల నుండి రసాన్ని తీసి ముఖానికి అప్లై చేయాలి. అప్లై చేసి సర్కులర్ మోషన్ లో మర్ధన చేయాలి. ఇది చర్మానికి అద్భుతాలను చేస్తుంది. టమోటోల్లో అసిడిక్ ఆమ్లాం ఉండటం వల్ల ఇది కొద్దిగా దురదగా అనిపిస్తుంది. అయితే ఎలాంటి దుష్ప్రభావం ఉండదు. కాబట్టి, ఒక గంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ముఖం బ్యూటిఫుల్ గా అందంగా కనబడుతుంది.

9. తేనె:

9. తేనె:

తేనెలో నేచురల్ మాయిశ్చరైజింగ్, యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీఏజింగ్ ప్రొపర్టీస్ ఉండటం వల్ల ఇది చర్మంను టైట్ చేస్తుంది. తేనెలో కొద్దిగా నిమ్మరసం మరియు ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ముఖం మరియు మెడకు అప్లై చేసి 20నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

10. అరటి మాస్క్:

10. అరటి మాస్క్:

బాగా పండిన అరటిపండులో కొద్దిగా తేనె మరియు ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. ఈ మాస్క్ స్పాలాగే పనిచేస్తుంది. ఇది వదులైన చర్మాన్ని టైట్ గా మార్చుతుంది. స్కిన్ ఎలాసిటిని పెంచి, చర్మంలో మంచి గ్లోను తీసుకొస్తుంది.

11. విటమిన్‌ తీసుకోవాలి:

11. విటమిన్‌ తీసుకోవాలి:

అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ ప్రకారం విటమిన్‌ సి ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల చర్మంలో ముడతల ప్రభావం చాలా ఆలస్యంగా మొదలవుతుంది. కొలాజిన్‌ ఉత్పత్తిలో ఈ పోషకం కీలకంగా పనిచేస్తుంది. ఇందుకోసం క్యాప్సికం, ఆకుకూరలూ, మొలకలూ, టొమాటోలూ, కమలాఫలాలూ తీసుకోవాలి. పోషకాల ఆధారితంగా తయారుచేసిన సౌందర్య ఉత్పత్తుల్ని వాడాలి.

12. ఎండకు దూరంగా:

12. ఎండకు దూరంగా:

ఎండకు దూరంగా: కొలాజిన్‌ తగ్గిపోవడానికి ఎండలోని అతినీలలోహిత కిరణాలు కూడా కారణమే. కాబట్టి బయటకు వెళ్లేముందు తప్పనిసరిగా చర్మతత్వాన్ని బట్టి సన్‌స్క్రీన్‌లోషన్‌ని రాసుకోవాలి. ఎండ తక్కువగా ఉన్నా సరే ఈ జాగ్రత్త పాటించాలి.

13. స్వీట్స్ తగ్గించాలి:

13. స్వీట్స్ తగ్గించాలి:

తీపిశాతం ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల వృద్ధాప్యపు చాయలు త్వరగా మొదలవుతాయి. దాంతో చర్మంలో సాగేగుణం తగ్గి ముడతల్లాంటివి మొదలవుతాయి. చర్మంపై పేరుకొన్న మృతకణాల్ని తొలగించడం వల్ల కొలాజిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. దాంతో వృద్ధాప్యపు చాయలు రావడం ఆలస్యమవుతుంది.

Story first published: Thursday, December 17, 2015, 8:05 [IST]
Desktop Bottom Promotion