Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
బరువు తగ్గిన తర్వాత శరీరం ఫిట్ గా కనబడుటకు సులభ చిట్కాలు
బరువు తగ్గిన తర్వాత చాలా మంది రూపం మారిపోతుంది. ముఖ్యంగా అధిక వ్యాయామాలు, జిమ్ వల్ల ఒకేసారి బరువు తగ్గడం, బేరియాట్రిక్ సర్జరీల తర్వాత ఒళ్ళు తగ్గినవాళ్ళలో ఇలా కనిపిస్తుంది. చర్మం క్రింద కణజాలం జారడంతో మొహం దగ్గర్నుంచి అన్ని అవయవాలు జారిపోయినట్టు కనిపిస్తాయి. ఈ కణజాలం కొవ్వు పొర, చర్మాన్ని బిగువుగా సరిచేయవచ్చు. ఇలా శస్త్ర చికిత్స ద్వారా శరీరం మార్చడమే ‘బాడీ కాంటూరింగ్'.
అందమైన శరీర ఆకృతి పొందాలనే తపన ఆడవాళ్ళలో అధికం. అదనపు కొవ్వుని తగ్గించుకుని తద్వారా బరువు తగ్గడం అందమైన శరీర ఆకృతి పొందడానికి మొదటి అడుగు. అంత కష్టపడి బరువు తగ్గిన తరువాత సాగిపోయిన చర్మం ఇబ్బంది పెడుతుంది. ఈ క్రింది విధానాలని పాటించడం ద్వారా అందమైన బిగుతైన చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.

చర్మ ఎలాసిటిని పెంచే ఆహారాలు తీసుకోవాలి.
చర్మ ఎలాసిటిని పెంచే ఆహారాలు తీసుకోవాలి. కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి . అవి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచేవై ఉండాలి . ముఖ్యంగా విటమిన్, ఎ, సి, ఇ, మరియు కెలు అధికంగా ఉండే హారాలను నట్స్, మరియు జింక్ మరియు సెలీనియం అధికంగా ఉండే ఆహారాలను రెగ్యులర్ గా తీసుకోవడం చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

హైడ్రేషన్
చర్మంలోని తేమ శాతాన్ని పొందుపరచి చర్మం బిగుతుగా ఉండేందుకు నీళ్ళు ఉపయోగపడతాయి. ఎక్కువగా నీరు త్రాగడం వల్ల శరీరంలోని అవాంఛిత మలినాలను బయటకు నెట్టివేయడం వల్ల బెల్లీ చుట్టూ లూజ్ అయిన చర్మం తిరిగి బిగువుగా మారుతుంది . వాటర్ అదనపు క్యాలరీలను కరిగిస్తుంది. బరువు తర్వాత బెల్లీని టైట్ చేసుకోవడానికి ఇవి చాలా ఎఫెక్టివ్ మార్గాలు .

ప్రోటీన్ ఫుడ్స్
మంచి నాణ్యత కలిగిన పోషకాలనే ప్రత్యేకించి లీన్ ప్రోటీన్స్ ని తినండి. ఇవి మీ చర్మానికి కావలిసిన ఎలాస్టిసిటీని అందిస్తాయి. తద్వారా మీ చర్మం బిగుతుని సంతరించుకుంటుంది.బరువు తగ్గిన తర్వాత వదులైన చర్మంను టైట్ చేసుకోవడానికి .ముందు కండరాలను దృడపరుచుకోవాలి. కండరాలు దృడంగా ఉంటే ఆటోమాటిక్ గా చర్మం టైట్ అవుతుంది. మజిల్స్ బిల్డ్ చేయాలంటే ప్రోటీనులు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. కండాలు ఏర్పరచడం మాత్రమే కాదు, మినిరల్స్ ను కూడా అందిస్తుంది.

స్కిన్ ఎక్సఫ్లోయేషన్
స్కిన్ ఎక్స్ ఫ్లోయేషన్ వల్ల స్కిన్ టైట్ గా మారుతుంది. వదులుగా ఉండే చర్మాన్ని స్క్రబ్ చెయ్యండి. ఈ పద్దతి ఏంతో ఉపయోగకరం. స్క్రబ్బింగ్ వల్ల చర్మంలో రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. ఆరోగ్యకరమైన, బిగుతైన చర్మం కలుగుతుంది. అందువల్ల రోజుకి రెండు లేదా మూడు సార్లు మీ చర్మానికి స్క్రబ్ ని వాడండి.

బాదం
బాదం ఆయిల్ చర్మానికి ఒక మంచి ఆయిల్. స్కిన్ మాయిశ్చరైజింగ్, స్కిన్ ఎక్సఫ్లోయేట్ చేయడానికి బాదం ఆయిల్ చాలా గ్రేట్ ఆయిల్. ఇది చర్మాన్ని టైట్ చేస్తుంది మరియు స్ట్రెచ్ మార్క్ ను నివారిస్తుంది . బాదం నూనెతో మసాజ్ చేయడంవల్ల చర్మానికి మాయిశ్చరైజర్ ను అందిస్తుంది మరియు స్కిన్ టైట్ అవుతుంది.

ఆముదం నూనె
ఆముదం నూనె : చర్మానికి ఆముదం ఒక ఉత్తమ ఆయిల్ . ఆముదం నూనెలో కొన్ని చుక్కల నిమ్మరసం మిక్స్ చేసి తర్వాత చర్మానికి అప్లై చేసి మసాజ్ చేయాలి . ప్రతి రోజూ రాత్రి నిద్రించే ముందు ఇలా చేయడం వల్ల చర్మం టైట్ గా మారుతుంది.

పచ్చికూరలు ఎక్కువగా తీసుకోవాలి:
రెగ్యులర్ డైట్ లో పచ్చికూరలను ఎక్కువగా తీసుకోవాలి . పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల విటమిన్లు, మినిరల్స్ పుష్కలంగా అంది, చర్మానికి కావల్సిన ఎలాసిటని అందించి, చర్మాన్ని కాంతివంతంగా టైట్ గా మార్చుతాయి.



Click it and Unblock the Notifications