Latest Updates
-
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ!
వేసవిలో చర్మ సంరక్షణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు
వేసవి కాలం సూర్యుని తాపానికి నేరుగా ప్రభావితమయ్యేది మన చర్మం. అధిక వేడి..రేడియేషన్లతో కూడిన సూర్యకిరణాలు చర్మాన్ని పలు సమస్యల బారీన పడేలా చేస్తాయి. వేసవికాలంలో ఎండలు మండిపోతుంటే చర్మ సంరక్షణ అనేది పెద్ద సవాల్ లాంటిదే. అధిక వేడికి చర్మం కమలటం ఈ కాలంలో సర్వసాధారణం. ఇలాంటప్పుడు ముఖం, చేతులు, పాదాలు లాంటివాటిని అధిక వేడి నుంచి కాపాడుకునేందుకు కొన్ని చిట్కాలను పాటిస్తే సరి...

1. నిమ్మరసం, మజ్జిగ సమభాగాలు కలిపి పూయుట వలన ఎండకు నల్లబడిన ముఖము స్వచ్ఛంగా ఉంటుంది.
2. వెన్న, పసుపు కలిపి రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు ముఖమునకు రాసుకుంటే ముఖం కాంతివంతముగా ఉంటుంది.
3. ఆవనూనెలో శనగపిండి, పసుపు కలిపి రాసిన చర్మము కాంతివంతమగును.

4. పసుపు, వేపల లేపనము : వందల సంవత్సరాలనుండి భారతీయులు చర్మసంరక్షణకు పసుపు, వేపలను ఎంతగానో నమ్ముతారు. పలురకాల చర్మ సమస్యలకు విరుగుడుగా పనిచేయడమే కాకుండా చర్మానికి చల్లదనాన్ని, హాయినీ ఇస్తుంది.
5. పువ్వులకు చర్మాన్ని మృదువుగా, సున్నితంగా ఉంచే గుణం మెండుగా ఉంది. అంతేగాకుండా వీటికి చర్మం రంగును పెంచే శక్తితోపాటు, సహజ క్లెన్సర్లలా పనిచేసే లక్షణం కూడా ఉంది. కాలుష్యంవల్ల శరీరంలో పేరుకుపోయిన దుమ్ము, ధూళిని చర్మం నుంచి తొలగించి, చర్మానికి అవసరమైన తేమను అందించి, సున్నితంగా ఉంచటంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

6. గంధము పేస్టు: కొంత మంది చర్మము బాగా సున్నితంగా ఉంటుంది. ఏ మాత్రం ఎండలోకి వెళ్ళినా కందుతుంది. ఇలాంటప్పుడు గంధంపేస్టు అయితే చర్మాన్ని చల్లబరుస్తుంది. యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది. చర్మాన్ని తేమగా ఉండేందుకు దోహదం చేస్తుంది. ప్రతిరోజు దీనిని వాడుతూ ఉంటే చర్మము మీది నూనె గ్రంధులు ఉత్తేజితమై తేమగా ఉండేందుకు తోడ్పడుతూ చర్మాన్ని హానిచేసే బాక్టీరియాను తొలగిస్తాయి.
7. వాతావరణ కాలుష్యానికి గురైన చర్మము పాడవకుండా ఆపే శక్తి నిమ్మరసములోని విటమిన్ 'సి' కి ఉన్నది. ప్రతి సౌందర్య సాధనానికి రెండు నిమ్మ చుక్కలు కలిపితే చర్మము ముడుతలు పడకుండా ఉంటుంది. ఇలా చేస్తే వేసవి కాలంలో చర్మాన్ని సురక్షితంగా కాపాడుకోవచ్చు.

8. సౌంకర్యవంతంగా వదులుగా ఉండే కాటన్ దుస్తులనే ధరించాలి. తెలుపు రంగు సూర్యరశ్మిని నిరోధిస్తుంది. అందుకే తెలుపు రంగు దుస్తులు, తెలుపు రంగు గొడుగునే వాడాలి. లోదుస్తులు కూడా కాటన్‌వే ధరించడం మేలు. అయితే ఒకసారి వేసుకున్న సన్ స్క్రీన్ రెండు గంటల వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రతి రెండు గంటలకు ఒకసారి ఇది రాసుకోవాలి. ముఖానికే కాకుండా మెడ, చేతులకు కూడా రాసుకోవడం మంచిది. అయితే ఎస్‌పిఎఫ్ విలువ 30 ఉన్న సన్‌స్క్రీన్‌లు వాడడం ఉత్తమం.



Click it and Unblock the Notifications
