Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
అండర్ ఆర్మ్స్ నల్లగా, అసహ్యంగా మారడానికి కారణాలివే..!!
చాలామందికి స్లీవ్ లెస్ వేసుకోవాలంటే ఇష్టంగా ఉంటుంది. కానీ.. స్లీవ్ లెస్ ధరించడానికి అండర్ ఆర్మ్స్ వల్ల ఇబ్బందిపడుతుంటారు. ఎందుకంటే.. అవి నల్లగా మారి, అసహ్యంగా మారి ఉండటంతో.. అవి మీ ఓవరాల్ లుక్ పై దుష్ర్పభావం చూపుతాయని.. స్లీవ్ లెస్ వేయలేకపోతారు.
చాలామంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. కానీ దీనికి కారణాలు ఎవరికీ తెలియదు. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కొంతమంది.. వాళ్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని కూడా కోల్పోతారు. మరికొందరు ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్యలు ఫేస్ చేస్తాయి.
ముఖ్యంగా చర్మ సమస్యలు.. ఒక వ్యక్తి ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. యాక్నె, పింపుల్స్, అన్ వాంటెడ్ హెయిర్ గ్రోత్, పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ ఇలా ఏదైనా.. ఇబ్బందికరంగానే ఉంటుంది. తాము అందంగా లేమన్న భావన కలిగించి నలుగురిలో కలవలేకపోతారు.
చాలా సందర్భాల్లో చర్మ సమస్యలు నివారించడానికి ట్రీట్మెంట్స్, ముందు జాగ్రత్తలు అవసరం అవుతాయి. దీనిద్వారా.. సమస్యను తగ్గించవచ్చు. అయితే కొన్ని సమస్యలకు కారణాలు తెలుసుకుంటేనే.. నివారించడం తేలికవుతుంది. అయితే.. ఇప్పుడు అండర్ ఆర్మ్స్ నల్లగా మారడానికి అసలు కారణాలేంటో తెలుసుకుందాం..

షేవింగ్
ఒకవేళ మీరు మీ అండర్ ఆర్మ్స్ ని రెగ్యులర్ గా షేవ్ చేసుకుంటూ ఉంటే.. మీకు ఈ సమస్య ఖచ్చితంగా ఉంటుంది. షేవింగ్ అనేది సెన్సిటివ్ స్కిన్ పై దుష్ర్పభావం చూపుతుంది.

ఇన్సులిన్ కి సంబంధించిన సమస్య
ఇన్సులిన్ కి సంబంధించిన అనారోగ్య సమస్య ఉన్నప్పుడు అంటే డయాబెటిస్ వంటి వ్యాధులు ఉన్నవాళ్లలో కూడా.. ఆర్మ్ ఫిట్స్ నల్లగా మారుతాయి. శరీరంలోని ఇతర భాగాలతో పోల్చితే అండర్ ఆర్మ్స్ దగ్గర డార్క్ గా మారిందంటే.. ఒకసారి చెక్ చేయించుకోవడం మంచిది.

హార్మోనల్ ఇంబ్యాలెన్స్
హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హార్మోన్లకు సంబంధించిన సమస్యలైన హైపోథైరాయిడిజం వంటివి ఉన్నప్పుడు.. అండర్ ఆర్మ్స్ నల్లగా, అసహ్యంగా మారతాయి.

స్కిన్ ఎక్స్ ఫోలియేసన్ తగ్గినప్పుడు
అండర్ ఆర్మ్స్ లో చెమట చేరినప్పుడు.. డెడ్ సెల్స్ లేయర్ గా ఏర్పడి.. మురికి పేరుకుంటుంది. ఇలాంటి సమస్య ఉన్నవాళ్లు.. రెగ్యులర్ గా స్కిన్ ఎక్స్ ఫోలియేషన్ చేయాలి. అప్పుడే.. డార్క్ అండర్ ఆర్మ్స్ సమస్యను నివారించవచ్చు.

డియోడరెంట్స్
ఎక్కువగా డియోడరెంట్స్ వాడటం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో అండర్ ఆర్మ్స్ స్కిన్ పై చెడు ప్రభావం చూపుతాయి. వాటిల్లో ఉండే కెమికల్స్.. చర్మం రంగుని మార్చేస్తాయి.

బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్
బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చర్మాన్ని బ్రౌనిష్ గా, నల్లగా మార్చడానికి కారణమవుతుంది. దీనికారణంగా కూడా.. ఆర్మ్ ఫిట్స్ నల్లగా మారతాయి.

రెగ్యులర్ వ్యాక్సింగ్
కొన్ని సందర్భాల్లో రెగ్యులర్ గా అండర్ ఆర్మ్స్ హెయిర్ తొలగించడానికి వ్యాక్స్ చేస్తూ ఉంటారు. దీనివల్ల చర్మం డార్క్ గా మారుతుంది. వ్యాక్సింగ్ సరైన పద్ధతిలో చేసుకోకుండా, ఎక్కువ ఫోర్స్ తో హెయిర్ ని తొలగించే ప్రయత్నం చేస్తే, చర్మ కణాలు డ్యామేజ్ అవుతాయి.



Click it and Unblock the Notifications
