Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మొటిమలను మచ్చలను నివారించే నమ్మకమైన హోం రెమెడీస్
చర్మ సమస్యల్లో మొటిమలు, మచ్చలు ఒక సాధారణ సమస్య సహజంగా ఈ సమస్యను టీనేజ్ నుండి మద్యవయస్సు వారికి వరకూ ఎదుర్కొంటారు. అయితే అటువంటి చర్మ అందాన్ని ఏ ఒక్కరు కూడా కోరుకోరు. అటువంటి వారిలో మీరు ఒక్కరైతే, ఎటువంటి మొటిమలు, మచ్చలు లేని కాంతివంతమైన చర్మాన్ని మీరు పొందాలని కోరుకుంటున్నట్లైతే ఈ ఆర్టికల్ చివరకూ మీరు చదవగలిగితే మీ సమస్యకు ఎటువంటి పరిష్కారం కావాలో మీకు అందుతుంది.
సాధారణంగా మొటిమలు మచ్చలు ఎక్కువగా టీనేజ్ గర్ల్స్ కు, మహిళలకు బాధిస్తుంటాయి. ఈ మొటిమలు చర్మ సమస్య కంటే ఎక్కువగానే కనిపిస్తుంటాయి. టీనేజ్ గర్ల్స్ మహిళలకు మాత్రమే కాదు, పురుషుల్లో కూడా చర్మ సమస్యలతో పాటు మొటిమలు, మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. మరియు ఇవి కలుగుటకు గల కారణం కూడా యవ్వన వయసులో కలిగే హార్మోన్'ల ప్రభావం లేదా మార్పు అని చెప్పవచ్చు.
ఈ మొటిమల తగ్గుదల కోసం బ్యూటీపార్లర్ లలో చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి, కానీ అవి ఖచ్చితంగా తగ్గిస్తాయని నమ్మకం మాత్రం తక్కువే అని చెప్పవచ్చు. ఈ రకమైన క్రీమ్'లు రసాయనాలతో తయారు చేస్తారు కొంత మందికి ఇవి పనిచేయవచ్చు మరికొంత మందిలో ఇవి పని చేయకపోవచ్చు. ఎలాంటి ఖర్చు, దుష్ప్రభావాలు లేకుండా మీ ముఖం పైన కలిగిన మొటిమలను తగ్గుంచుకోవాలి అనుకుంటున్నారా... అయితే మీ కోసం ఇక్కడ కొన్ని రకాల ఔషదాలు తెలుపబడ్డాయి...

బాదం
బాదంను నీరు లేదా పాలలో 12 గంటలు నానబెట్టాలి. నానిన బాదం యొక్క పై తొక్కను తీసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ ముద్దలో రోజ్ వాటర్ కలిపి మచ్చలు ఉన్న ప్రాంతంలో రాయాలి.

బేకింగ్ సోడ:
ఇది మొటిమల నివారణకు ఉత్తమ ఇంటి పరిష్కారంగా చెప్పవచ్చు. ఇది మొటిమ చుట్టూ దురద మరియు నొప్పిని తగ్గిస్తుంది. అలాగే బ్లాక్ హెడ్స్,వైట్ హెడ్స్ లను కూడా తగ్గిస్తుంది. బేకింగ్ సోడా ఒక భాగం మరియు రెండు భాగాల గోరువెచ్చని నీటిని కలపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న ప్రాంతంలో రాసి,10 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. అంతేకాక ఈ మిశ్రమానికి కొంచెం తేనెను కలిపితే మీ చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. మీ ముఖం ప్రక్షాళన తరువాత పొడిగా ఉన్నట్లు అనిపిస్తుంది. తర్వాత నూనె లేని మాయిశ్చరైజర్ ని రాయాలి.

నిమ్మరసం:
నిమ్మకాయ పరిష్కారం కావలసిన వస్తువులు: నిమ్మరసం పద్దతి: 1. మచ్చలు ఉన్న ప్రదేశంలో నిమ్మ రసం రాసి ఆరిన తర్వాత ముఖంను శుభ్రం చేసుకోవాలి.నిమ్మకాయ నేచురల్ బ్లీచ్. ఇది క్లీనింగ్ లా పనిచేస్తుంది. కాబట్టి మీరు నేచురల్ బ్లీచ్ కోసం నిమ్మకాయను ఉపయోగించవచ్చు . లేదా నిమ్మ తొక్కతో బ్లాక్ హెడ్స్ ఉన్న చోటో స్ర్కబ్ చేయడం వల్ల కూడా తొలగించుకోవచ్చు. బ్లాక్ హెడ్స్ ఉన్నచోట నిమ్మరసంతో పాటు తేనె, పంచదార లేదా గుడ్డు వంటివి కూడా మిక్స్ చేసి స్ర్కబ్ చేయవచ్చు.

టమోటో:
టీనేజ్ లో మొటిమలను నివారణకు ఎలాంటి ఆయుర్వేద చికిత్స తీసుకొన్న చివరిగా రాత్రి పడుకొనే ముందు ముఖానికి టమోటో జ్యూస్ తో మసాజ్ చేసి పడుకోవడం వల్ల మొటిమల తాలుకు మచ్చలు కూడా మాయం అవుతాయి.తాజా టమోటోను పేస్ట్ చేసి అది ముఖానికి మాస్క్ లా అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ దూరం అవుతాయి. అంతే కాదు, ఆయిల్ స్కిన్ కూడా నివారిస్తుంది.

తేనె:
తేనె చికిత్స కావలసిన వస్తువులు:మచ్చలు ఉన్న ప్రదేశంలో తేనెను రాయాలి. కొంత సమయం వరకు అలా ఉంచి తర్వాత ముఖంను శుభ్రం చేసుకోవాలి. తేనేలో బాక్టీరియా లక్షణాలు ఉన్న కారణంగా మచ్చలు తగ్గటానికి సహాయపడుతుంది.బ్లాక్ హెడ్స్ ను తొలగించడానికి తేనె సహాయపడుతుంది. కొద్దిగా తేనె తీసుకొని సన్నని మంట మీద వేడి చేయాలి. ఈ గోరువెచ్చని తేనెకు కొద్దిగా పంచదార జోడించి మిక్స్ చేసి ముక్కు మీద బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి 15నిముషాల తర్వాత శుభ్రంగా తుడిచి తర్వాత మంచి నీటితో కడుక్కోవాలి.

టీట్రీ ఆయిల్ :
ఒక అద్భుతమైన క్రిమినాశక మరియు సూక్ష్మజీవుల నిరోధకంగా ఉంటుంది. అందువల్ల ఇది చర్మానికి చాలా బాగుంటుంది. రెండు స్పూన్స్ డిస్టిల్ వాటర్, ఒక స్పూన్ బేకింగ్ సోడా,ఒక స్పూన్ తేనే,ఐదు,ఆరు చుక్కల టీ ట్రీ ఆయిల్ లను బాగా కలిపి ముఖానికి మాస్క్ వేయాలి. మీరు తీవ్రమైన మొటిమల సమస్యతో ఉంటే కనుక రోజుకోసారి ఈ మాస్క్ ను వేయాలి.

అలోవెర:
డార్క్ స్పాట్స్ తొలగించుకోవడానికి ఈ బ్యూటీ ప్రొడక్ట్ ను చాలా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కలబంద మాత్రమే కాకుండా, కలబంద నుండి తీసే కలబంద గుజ్జు(అలోవెర జెల్) కూడా చర్మ ఛాయను మార్చుతుంది మరియు మొటిమలను తగ్గిస్తుంది.

పసుపు:
పసుపుతో చికిత్స: టీనేజ్ లో వచ్చే మొటిమల నివారణ చికిత్సలో పసుపులేకుండా ఆయుర్వేద చికిత్స జరగదు. పసుపు, మరియు అల్లం సమంగా తీసుకొని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను రాత్రి పడుకొనే ముందు మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. క్రమంగా 3 రోజులపాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

గంధం:
సాండిల్ ఉడ్ పేస్ట్ : ప్రతి ఒక్క ఆయుర్వేద చిట్కా మొటిమలను తొలగించడంలో గొప్పగా సహాయపడుతాయి. వేపనీటిని ఉపయోగించి శాండి ఉండ్ పౌడర్ ను పేస్ట్ లా చేసుకోవాలి. వేపనీటిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా పోగొడుతుంది. సాండిల్ ఉడ్ పౌడర్ చర్మాన్ని నునుపుగా మార్చుతుంది మరియు నేచురల్ గ్లోను అందిస్తుంది.



Click it and Unblock the Notifications











