Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
వింటర్లో డ్రైగా మారిన స్కిన్ ను సాప్ట్ గా.. మాయిశ్చరైజింగ్ గా మార్చే సింపుల్ టిప్స్
వింటర్ చలిగాలి చల్లగా వచ్చి మేనిని తాకుతుంటే ఎంతో హాయిగా, ఆహ్లాదంగా ఉంటుంది. కానీ ఆ తరువాతే చర్మం పొడిబారిపోయి అందవికారంగా తయారవుతుంది. పొడి చర్మంతో బాధపడేవారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే స్కిన్ మాయిశ్
శీతాకాలం వచ్చిందంటే చాలు సమస్యలు చుట్టుముడుతాయి. చలి శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందాన్ని వికారంగా మారుస్తుంది. చాలా మంది మహిళలు, టీనేజ్ గర్ల్స్ కు శీతాకాలంలో చర్మం పొడిబారుతుంది. జుట్టు నిర్జీవంగా మారుతుంది. ఇలాంటి సమస్యల నుంచి రక్షించుకోవడానికి తగినంత శ్రధ్ద తీసుకోవడం చాలా అవసరం. ఇలా చేస్తే మెరిసే అందం మీ సొంత అవుంతి.
వింటర్ చలిగాలి చల్లగా వచ్చి మేనిని తాకుతుంటే ఎంతో హాయిగా, ఆహ్లాదంగా ఉంటుంది. కానీ ఆ తరువాతే చర్మం పొడిబారిపోయి అందవికారంగా తయారవుతుంది. పొడి చర్మంతో బాధపడేవారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే స్కిన్ మాయిశ్చరైజ్ అయి కాంతులీనుతూ ఉంటుంది.

పాలు-సున్నిపిండితో స్నానం:
చలికాలంలో సబ్బులు ఉపయోగించకుండా ఉండటం మంచిది. పొడిచర్మం ఉన్నవాళ్లు పాలల్లో సున్నిపిండిని కలిపి మర్దనా చేస్తే చర్మం పొడిబారకుండా సున్నితంగా ఉంటుంది.

ఆయిల్ మసాజ్ :
వారానికోసారి గోరు వెచ్చని నువ్వుల నూనె కానీ, ఆలివ్ ఆయిల్ కానీ మృదువుగా మర్దనా చేయాలి. తరువాత సున్నిపిండితో స్నానం చేయాలి. దీనివల్ల మృతకణాలు రాలిపోవడమే కాదు చర్మం సున్నితంగా ఉంటుంది.

శెనగపిండిఫేస్ ప్యాక్ :
శనగపిండిలో నువ్వుల నూనె, కొద్దిగా పసుపు, తేనె, ఒక స్పూను పెరుగు కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖంపై మర్దనా చేసి పది నిమిషాలు ఆగి కడిగేయాలి. చర్మం మృదువుగా తయారవుతుంది. దీనినే చేతులకూ కాళ్లకూ ఉపయోగించవచ్చు.

స్కిన్ కు వాటర్ తో హైడ్రేషన్ అందివ్వాలి:
శీతాకాలంలో దాహం ఎక్కువగా లేకపోవడం వల్ల నీళ్లు ఎక్కువగా తాగాలనిపించిదు. దీనివల్ల చర్మంలో తేమ శాతం తగ్గిపోయి పొడిబారుతుంది. దాహం ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా నీళ్లు తాగాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను, పండ్ల రసాలను తీసుకోవాలి.

మాయిశ్చరైజర్ తప్పనిసరి:
బయటికి వెళ్లే ముందు తప్పనిసరిగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. బయటికి వెళ్లి వచ్చిన తరువాత గోరు నీటితో స్నానం చేసి తిరిగి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.

బాడీ మసాజ్ :
మసాజ్ ఆయిల్, గంధం పొడి, రోజ్‌వాటర్, తేనె కలిపిన మిశ్రమంతో బాడీ మసాజ్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది.

సున్నిపిండితో స్నానం:
చర్మం పగిలిపోయినట్లుగా ఉండేవారు స్నానానికి సబ్బును కాకుండా సున్నుపిండిని ఉపయోగించాలి. అంతేకాదు ప్రతిరోజూ స్నానం చేసిన తరువాత వెనిగర్ కలిపిన నీళ్లను శరీరంపై పోసుకుంటే పగుళ్ల సమస్య నుంచి బయటపడవచ్చు. 8. గ్లిజరిన్ లో రోజ్ వాటర్, తేనె కలిపి ఈ మిశ్రమాన్ని చేతులు, కాళ్లకు అప్లైచేయాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి.

నేచురల్ ఫేస్ ప్యాక్:
పెరుగు, పసుపు, తేనె కలిపి సున్నితంగా మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీనిని మొఖంపై మర్దనా చేసి పదిహేను నిమిషాల పాటు ఉంచి, ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఫేస్ మాస్క్:
తేనె, రోజ్ వాటర్, పాలపొడి కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. దీనిని మొఖానికి పట్టించి ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి.



Click it and Unblock the Notifications