Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
తొలి జాబ్‌లోనే రూ. లక్ష జీతం.. అప్పుడే రిటైర్‌మెంట్ ప్లానింగ్.. నేటి ఖర్చులు నేర్పుతున్న ఆర్థిక పాఠం.!
ఒకప్పుడు నెలకు రూ. పదివేలు సంపాదించినా నెలాఖరులో ఎంతో కొంత పొదుపు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఐదంకెల వేతనం సంపాదిస్తున్నా పైనుంచి అప్పులే బోనస్‌గా మిగులుతున్నాయి. పెరుగుతున్న అవసరాలు, విలాసవంతమైన జీవితం, పిల్లల చదువులు వీటితో సంపాదన ఏ మాత్రం సరిపోవడం లేదు. ఈ క్రమంలో కొత్తగా ఉద్యోగ జీవితంలోకి అడుగుపెట్టిన ఓ యువకుడు తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

22 ఏళ్ల వయసులోనే నెలకు రూ. లక్ష వేతనంతో ఉద్యోగం సంపాదించిన యువకుడు అప్పుడే పదవీ విరమణపై ప్రణాళికపై సోషల్ మీడియాలో సలహా అడగడం చర్చనీయాంశమైంది. రిటైర్‌మెంట్ సమయంలో ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే నెలకు రూ. 20,000 చేయడం సరిపోతుందా అని నెటిజన్లను అడిగాడు.
ఈ కాలం యువత కెరీర్‌లోకి అడుగు పెట్టగానే తమ మొదటి జీతాన్ని పార్టీలకు, గాడ్జెట్ల కొనుగోలుకు, టూర్లకు ఖర్చు చేస్తున్నారు. కానీ ముంబైకి చెందిన ఈ యువకుడు ఉద్యోగంలో చేరిన మొదటి రోజే ఇలా ఆలోచించడం నేటి ఆర్థిక వ్యవహారాల తీరుకు అద్దం పడుతోంది. కొందరు ఆ యువకుడి పరిణితిని మెచ్చుకుంటుండగా.. మరికొందరు భవిష్యత్తుపై అతని ఆందోళనను చూసి భయపడుతున్నారు.
సాధారణంగా ఉద్యోగులు 30 లేదా 40 ఏళ్ల వయసు వచ్చాక రిటైర్‌మెంట్ ప్లాన్స్‌కి సంబంధించి ఎందులో పెట్టుబడి పెట్టాలి, స్థిరచరాస్థులు ఏమేం కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటారు. అప్పటివరకూ తమ చదువు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు సరదాగా గడపాలని ప్లాన్స్ వేస్తుంటారు. ఇంటి బాధ్యతలు, చదువుపై అప్పులు ఇలా రకరకాలుగా ఫైనాన్షియల్‌గా జీతంతో బ్యాలెన్స్ చేసుకుంటారు. ఈ యువకుడు ఈ బాధ్యతలతో పాటు ఇప్పటి నుంచే భవిష్యత్తు పొదుపుపై ఆలోచన చేస్తుండటం విశేషం.
ఒక్క ముంబై మాత్రమే కాదు.. హైదరాబాద్, బెంగళూరు, పుణె వంటి ప్రధాన నగరాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీతానికి అనుగుణంగా ఖర్చులు ఉంటాయనేది వాస్తవం. ఇంటి అద్దె, కిరాణా సామాను, రవాణా ఖర్చులు, ఎలక్ట్రిసిటీ ఖర్చులు, ఇంటి అవసరాలు.. ఇలా ఎంత లేదన్నా ఉండే చోటు బట్టి దాదాపు రూ. 70 వేల నుంచి రూ. 80 వేలు ఖర్చవుతుంటాయి.

ఈ క్రమంలో ఇంత చిన్న వయసులోనే నెలవారీ పొదుపు చేయాలనే ఆలోచన రావడం అభినందనీయమని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుత ఖర్చులు, భవిష్యత్తు అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ మాత్రం పొదుపు చాలా తక్కువ అని కొందరు పేర్కొన్నారు. అయితే ఈ పొదుపును ఎక్కడ, ఎలా పెట్టుబడి పెట్టాలి.. లేదంటే తన ఆదాయాన్ని పెంచుకోవడానికి దృష్టి సారించాలా అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా నేటి యువత భావిస్తున్నారు.
ఈ క్రమంలో 20 ఏళ్ల వయసు నుంచే పొదుపు ప్రారంభించాలనుకునేవారు.. లాంగ్ టర్మ్ ప్లాన్ బెనిఫిట్స్ గురించి ఆలోచించడం ముఖ్యమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. టర్న్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్‌కి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు. ఇక కొంత మొత్తంలో అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. నెలకు కొంత మొత్తంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి వాటిలో సేవింగ్స్ చేసుకోవడం ద్వారానూ మున్ముందు ఆర్థికంగా ఆసరాగా ఉంటుందని సూచిస్తున్నారు. తర్వాత వేతనం పెరిగినప్పుడు ఈ సేవింగ్స్ ఇంకా సులభం అవుతాయి. ఫలితంగా దీర్ఘకాలిక ఆర్థిక స్వాతంత్ర్యం లభిస్తుంది.



Click it and Unblock the Notifications
