Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
సన్ స్క్రీన్ రాసుకున్నా చర్మం నల్లబడుతుందా.. మీరు చేసే అతి పెద్ద తప్పులు ఇవే.!
సీజన్ ఏదైనా చర్మ సంరక్షణలో భాగంగా సన్ స్క్రీన్ లోషన్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడటం తప్పనిసరిగా మారిపోయింది. ముఖ్యంగా బయటకు వెళ్లిన సందర్భాల్లో చర్మాన్ని దుమ్ము, ధూళి నుంచి రక్షించుకునేందుకు, వేసవి బారి నుంచి కాపాడుకునేందుకు ఇవి దోహదపడతాయి. ఈ క్రమంలో కొందరు సన్ స్క్రీన్ లోషన్‌ను ప్రతిరోజూ రాసుకున్నా వారి చర్మం నల్లబడటంతో ఇబ్బంది పడుతుంటారు. ఇందుకు కారణాలేంటి.. డెర్మటాలజిస్ట్ నిపుణులు ఏం చెబుతున్నారంటే..

సూర్యరశ్మి నుంచి వచ్చే యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి, వేడి కారణంగా స్కిన్ నల్లబడకుండా ఉండేందుకు సన్ స్క్రీన్ లోషన్ ఉత్తమమైనదిగా డెర్మటాలజిస్టులు సూచిస్తారు. అయితే ప్రతిరోజూ వీటిని వాడుతున్నా చర్మం కందిపోయి రంగు మారుతోందని బాధపడుతుంటారు. ఈ నలుపు శాశ్వతంగా మారి శరీరం కలర్ ఒకే మాదిరిగా ఉండదు. ఇలా మారడానికి కొన్ని కారణాలున్నాయి.
సన్ స్క్రీన్ లోషన్ రాసుకునేటప్పుడు చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు. రోజుకి ఒకసారి రాసుకుంటే సరిపోతుంది కదా అని భావిస్తుంటారు. కానీ అది సరైన పద్ధతి కాదు. ఈ లోషన్‌ను రోజుకి రెండుసార్లు తప్పనిసరిగా చర్మానికి అప్లై చేసుకోవాలని డెర్మటాలజిస్టులు సూచిస్తున్నారు. అప్పుడే చర్మంపై అద్భుతమైన రక్షణ పొరలా పనిచేసి వడదెబ్బ నుంచి టానింగ్ నుంచి కాపాడుతుంది.
వేసవి కాలం, వర్షా కాలం, చలికాలం సీజన్ ఏదైనా సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాలు నేరుగా చర్మంపై ప్రభావం చూపిస్తాయి. అందుకే ఏ కాలమైనా సరే తప్పనిసరిగా రోజుకి రెండు సార్లు సన్‌స్క్రీన్ లోషన్‌ను రాసుకోవాలి. చేతులు, ముఖం మురికి లేకుండా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ లోషన్‌ను అప్లై చేసుకోవాలి. లేదంటే కనబడని దుమ్ము, ధూళి.. క్రీమ్‌తో కలిసి చర్మ రంధ్రాల్లోకి చేరుకుపోయి చిరాకును కలిగిస్తుంది.
సన్ స్క్రీన్ లోషన్‌ను ఉపయోగించే ముందు ఎలాంటి ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారనేది గమనించుకోవాలి. ఎస్పీఎఫ్, పీఏ రేటింగ్‌లు చర్మంపై వాటి పనితీరును ప్రతిబింబిస్తాయి. కొనుగోలు చేసే ముందు ఎస్పీఎఫ్, పీఏలను పరిగణనలోకి తీసుకోవాలి. వీటి రేటింగ్‌లు చర్మం నల్లబడటాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. కనీసం ఎస్పీఎఫ్ 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న లోషన్లను ఎంచుకుని రెండు పూటలా మర్దన చేసుకోవాలి. ఇక పీఏ+++ రేటింగ్ ఉన్నవి యూవీ కిరణాల ప్రభావం పడకుండా కాపాడుతుంది..
ఏ కాలమైనా చర్మం పొడిబారకుండా తేమగా ఉంటే ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే తేమను అందించే క్రీమ్ ఆధారిత సన్ స్క్రీన్ లోషన్ వాడటం ఉత్తమం. ఆయిల్ స్కిన్ ఉన్నవారు జిడ్డుగా లేని, తేలికైన జెల్, మాట్-ఫినిష్ సన్ స్క్రీన్ లోషన్‌ను ఎంచుకోవాలి. సున్నితమైన చర్మం ఉన్నవారు జింక్ ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్ ఉండే మినరల్ సన్ స్క్రీన్ ఉత్తమంగా పనిచేస్తుంది.

మీరు బయటకు వెళ్లే కనీసం 15 నిమిషాల ముందు ముఖానికి, మెడకి, చేతులకు సన్ స్క్రీన్ లోషన్‌ను మృదువుగా మర్దన చేసుకోవాలి. ముఖానికి, మెడకి సుమారు పావు టీస్పూన్ పరిమాణంలో పట్టించడం ద్వారా ఎండ ప్రభావం శరీరంపై పడదు. ఎక్కువ సమయం పాటు ఎండలో గడపాల్సి వస్తే ప్రతి రెండు గంటలకోసారి అప్లై చేసుకోవాలి. సాధారణ సందర్భాల్లో రోజుకి రెండు సార్లు అప్లై చేసుకోవడం ద్వారా చర్మం నల్లబడకుండా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
