Latest Updates
-
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.!
చక్కెర లేదు, నూనె లేదు..ఎముకలను ఉక్కులా మార్చే, పిల్లల జ్ఞాపకశక్తి పెంచే ప్రోటీన్ లడ్డూ!
ప్రస్తుత బిజీ లైఫ్ లో సరైన పోషకాహారం తీసుకోవడం అనేది ఒక సవాలుగా మారింది. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ శారీరక, మానసిక ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో అవసరం. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లల్లో జ్ఞాపకశక్తిని, తెలివితేటలను పెంపొందించడానికి, మహిళల్లో తరచుగా కనిపించే రక్తహీనత సమస్యను దూరం చేయడానికి ఒక అద్భుతమైన పౌష్టికాహారమే ప్రోటీన్ లడ్డూ.

రోజూ ఒక లడ్డూను ఆహారంలో భాగంగా తీసుకుంటే కొద్ది రోజుల్లోనే శరీరంలో అద్భుతమైన మార్పును గమనించవచ్చు. ఏ వయసు వారైనా నిశ్చింతగా తినదగిన ఈ హెల్దీ ప్రోటీన్ లడ్డూను మన ఇంట్లోనే చాలా సులభంగా, తక్కువ ఖర్చుతో ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
ప్రోటీన్ లడ్డూ తయారీకి కావలసిన పదార్థాలు
బాదం పప్పు - 1 కప్పు
నువ్వులు (తెల్ల లేదా నల్ల నువ్వులు) - 1 కప్పు
ఆర్గానిక్ బెల్లం తురుము -అర కప్పు
యాలకులు - 5
నెయ్యి - 1 లేదా 2 టీస్పూన్లు
ప్రోటీన్ లడ్డూ తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద మందపాటి పాన్ పెట్టుకోవాలి. అందులో ఒక కప్పు బాదం పప్పు వేసి నూనె లేకుండానే మీడియం మంటపై దోరగా వేయించాలి. అవి వేగాక ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లార్చాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న పాన్ లోనే ఒక కప్పు నువ్వులు
వేసి రెండు నిమిషాల పాటు కలుపుతూ చిటపటలాడేవరకు వేయించాలి. ఎక్కువగా
వేయిస్తే చేదు వస్తుంది. వేగిన నువ్వులను కూడా ప్లేట్ లోకి
తీసుకుని చల్లారనివ్వాలి. తర్వాత వీటిని మిక్సీ గిన్నెలో వేసి పల్స్
మోడ్ లో (మధ్యలో ఆపుతూ) పొడిపొడిగా గ్రైండ్ చేయాలి.
ఆ పొడిలో అరకప్పు బెల్లం తురుము వేసి, చేత్తో బాగా కలపాలి. ఆ తర్వాత
మళ్లీ మిక్సీలో వేసి లడ్డూ చుట్టడానికి వీలుగా ముద్దలా అయ్యే వరకు
గ్రైండ్ చేయాలి.
-గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, కొద్దిగా కరిగించిన వేడి నెయ్యిని, సన్నగా తరిగిన బాదం ముక్కలను కలిపి చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకోవాలి.
-అంతే ప్రోటీన్ లడ్డూలు రెడీ.

పోషక విలువలు
ఈ లడ్డూ కేవలం రుచికి మాత్రమే పరిమితం కాదు, పోషకాలకు ఇది ఒక పవర్ హౌస్.
బాదం పప్పు: ప్రతి 100 గ్రాములలో సుమారు 21 గ్రాముల ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, 12 గ్రాముల డైటరీ ఫైబర్, విటమిన్ E, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
నువ్వులు: నువ్వులలో పాలలో కంటే ఎక్కువ క్యాల్షియం (దాదాపు 975 మి.గ్రా) ఉంటుంది. అలాగే ఐరన్, జింక్, 17 గ్రాముల ప్రోటీన్ మెండుగా లభిస్తాయి.
బెల్లం: ఇందులో క్యాలరీలతో పాటు శరీరానికి కావలసిన ఐరన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
ఒక లడ్డూ (సుమారు 30 గ్రాములు) తినడం ద్వారా శరీరానికి తక్షణమే 5-6 గ్రాముల ప్రోటీన్, క్యాల్షియం, శక్తి అందుతాయి.
ఆరోగ్య ప్రయోజనాలు
బాదంలో ఉండే విటమిన్ E, రైబోఫ్లేవిన్, ఎల్ కార్నిటైన్ వంటి పోషకాలు మెదడు కణాల అభివృద్ధికి దోహదపడి, పిల్లల్లో జ్ఞాపకశక్తిని విశేషంగా పెంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించి, కంటిచూపును మెరుగుపరుస్తాయి.
రక్తహీనతకు చెక్: నువ్వులు, బెల్లం కలయిక వల్ల ఈ లడ్డూలో ఐరన్ స్థాయిలు అత్యధికంగా ఉంటాయి. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి, ముఖ్యంగా మహిళల్లో, ఎదిగే ఆడపిల్లల్లో రక్తహీనత దరిచేరనివ్వదు.
దృఢమైన ఎముకలు: నువ్వులలో ఉండే అధిక క్యాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం ఎముకలను, దంతాలను ఉక్కులా మారుస్తాయి. కీళ్ల నొప్పులతో బాధపడే వృద్ధులకు ఇది ఎంతో మేలు చేస్తుంది.
ఇన్ స్టంట్ ఎనర్జీ : ఇందులో కృత్రిమ చక్కెరలు, నూనెలు లేవు. సహజసిద్ధమైన బెల్లం, డ్రై ఫ్రూట్స్ వాడటం వల్ల పిల్లల్లో వచ్చే అలసట, నీరసం తగ్గిపోయి రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications