Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
డైట్ లో ఎలాంటి మార్పుల వల్ల మొటిమలు నివారించవచ్చు ?
ప్రస్తుత రోజుల్లో మొటిమలతో బాధపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా టీనేజర్స్ లో ఈ సమస్య అధికంగా ఉంది. ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్స్, సరైన శుభ్రత పాటించకపోవడం, వాతావరణ కాలుష్యం వంటి కారణాల వల్ల చర్మంలో మొటిమల ఎక్కువ అవుతాయి. ఎఅలాగే స్కిన్ ఇరిటేషన్ , అసౌకర్యానికి గురిచేస్తాయి.
మొటిమలు నివారించుకోవడానికి అమ్మాయిలు మార్కెట్లో చూసిన అన్ని రకాల క్రీములను ఉపయోగించి చర్మాన్ని మరింత వరెస్ట్ గా మార్చుకుంటుంటారు. ఈ ఖరీదైన క్రీములు ఉపయోగించడం వల్ల సమస్యలు మరింత ఎక్కువ చేసుకుంటారు. వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. చాలా తక్కువ ప్రయోజనాలు ఉంటాయి.
ఇలాంటి హానికర క్రీముల కన్నా సహజసిద్దంగా మనకు అందుబాటులో ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల అనేక చర్మ సమస్యలు దూరం చేసుకోవచ్చు. మీ చర్మానికి కొన్ని పోషకాలు తప్పనిసరిగా అవసరం అవుతాయి. ఈ పోషకాల వల్ల మీ చర్మం సున్నితంగా, నునుపుగా, అందంగా తయారవుతుంది. కాబట్టి సింపుల్ గా డైట్ లో మార్పులు చేసుకోవడం వల్ల చర్మంలో మొటిమలను నివారించుకోవడంతో పాటు, ఇతర చర్మ సమస్యలు లేకుండా అల్టిమేట్ రిజల్ట్ అందిస్తుంది.

ఆకుకూరలు:
ఆకుకూరలు ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందాన్ని మెరుగుపరచడంలో కూడా గ్రేట్ గా సహాయపడతాయి. మొటిమలు నివారిస్తాయి. ఎందుకంటే ఆకుకూరల్లో విటమిన్ ఇ, ఐరన్, న్యూట్రీషియన్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి క్రమంగా చర్మానికి రక్తప్రసరణ అందిస్తాయి. ఇన్ఫ్లమేషన్ తో పోరాడతాయి. చర్మంలో కొల్లాజన్ ఉత్పత్తిని మెరుగుపరిచి చర్మం యవ్వనంగా, టైట్ గా క్లియర్ గా కనపడటానికి సహాయపడుతాయి.

బాదం:
చర్మ సౌందర్యానికి గ్రేట్ స్నాక్ ఇది. ఇందులో ఉండే విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల చర్మానికి మంచిది. బాదంలో ఫైబర్ ఎక్కువగా క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇతర నట్స్ తో పోల్చితే ఇది చాలా గ్రేట్ స్నాక్. బాదంలో విటమిన్ ఇ, బి విటమిన్, మెగ్నీషియం, న్యూట్రీషియన్ అధికంగా ఉన్నాయి. బాదం చర్మానికి మేలు చేస్తుంది కాబట్టి, దీన్ని రెగ్యులర్ గా తీసుకోవాలి. సులభంగా జీర్ణమవుతుంది. చర్మానికి మాత్రమే కాదు, జుట్టుఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

కొబ్బరి నూనె:
కొబ్బరి నూనెను వంటల తయారీలో కూడా ఉపయోగిస్తారు. కోకనట్ ఆయిల్లో యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది బ్యాక్టీరియాతో పోరాడుతుంది. మంచి బ్యాక్టీరియాను అందిస్తుంది. నిజానికి కొబ్బరి నూనె థైరాయిడ్, మెటబాలిజం మెరుగుపరచడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

కీరదోసం:
కీరదోసకాయను చూస్తే చాలా మంది దీన్ని వాటరీ లేదా బోరింగ్ ఫుడ్ అని అనుకుంటారు. కానీ ఇందులో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. ఒక గ్లాసు కీరదోసకాయ రసాన్నీ నిద్రించే ముందు తాగడం వల్ల, ఇది శరీరంను డిటాక్సిఫై చేస్తుంది. స్కిన్ తేమగా మారుతుంది, డ్రైనెస్ తగ్గుతుంది, మొటిమలను నివారించుకోవచ్చు. కీరదోసకాయల తొక్కలో ఉండే సిలికా సౌందర్య లక్షణాలను కలిగి ఉన్నది.

బఠాణీలు:
వెజిటేరియన్స్ ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పొందడానికి ఫిష్ తినాల్సిన అవసరం లేదు, వాటి స్థానంలో బీన్స్ తినవచ్చు. బీన్స్ కంటే బఠాణీల్లో జింక్, ఐరన్, విటమిన్ బి, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది. మొటిమలు, మచ్చలు నివారిస్తుంది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది. వీటిని సలాడ్స్ లో చేర్చుకోవచ్చు.

క్యారెట్స్:
క్యారెట్స్ ఎక్కువగా తీసుకోవాలి! మీరు బ్రైట్ గా కనబడుతారు. క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. అంతే కాదు, క్యారెట్ రెగ్యులర్ గా తినడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. అదే సమయంలో మొటిమలను నివారిస్తుంది.

నీళ్లు ఎక్కువగా తాగాలి:
రోజుకు సరిపడా నీళ్లు తాగాలి. నీరు ఎక్కువగా తాగడం వల్ల స్కిన్ ఎప్పుడూ హైడ్రేట్ గా ఉంటుంది. శరీరంలోని మలినాలను మాత్రమే కాదు, చర్మంలోని మలినాలను కూడా తగ్గిస్తుంది.

షుగర్ ఫుడ్స్ తగ్గించాలి:
జంక్ ఫుడ్, అన్ హెల్తీ ఫ్యాట్ ఫుడ్స్ తగ్గించడం వల్ల చర్మం త్వరగా క్లియర్ గా మారుతుంది .



Click it and Unblock the Notifications