Latest Updates
-
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే..
స్కిన్ టైట్ చేసే పసుపు ఇతర కాంబినేషన్ ఫేస్ మాస్కులు
ఆరోగ్యకరమైన చర్మ సౌందర్యం కోసం మనకు ఒక వరంలా ప్రక్రుతి ప్రసాధించబడిన పదార్థం పసుపు. పసుపులో వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు, అద్భుతమైన సౌందర్య గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.ముఖంలో మొటిమలున్నా, లేదా ముఖం మచ్చలు, నలుపుదనంతో ఉండటం ఏ ఒక్క అమ్మాయి ఇష్టపడదు.
ప్రకాశవంతమైన స్కిన్ కంప్లెక్షన్ కలిగి ఉండటానే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు . అయితే ఇలా చర్మం పాడవడానికి అనేక కారణాలున్నాయి. అందులో అనారోగ్యకరమైన డైట్, స్ట్రెస్, కాలుష్యం, జీన్స్, వయస్సు మొదలగునవి కారణం కావచ్చు. ఈ కారణాల వల్లే స్కిన్ కంప్లెక్షన్ డల్ గా మరియు నిర్జీవంగా కనబడుతుంది.
ఇలాంటి స్కిన్ సమస్యల వల్లే మనలో ఒక నమ్మకాన్ని కోల్పోతాము మరియు మనం కొద్దిగా డిప్రెషన్ కు కారణం అవుతుంది.
అయితే ఈ సమస్యల నుండి బయట పడటానికి కొన్ని రకాల కాస్మోటిక్స్ అంటే బోటాక్స్, కెమికల్ పీల్స్ మొదలగునవి సహాయపడుతాయి. ఇవి మనల్ని అందంగా కనబడేలా చేస్తాయి. కానీ కొంత మందికి ఇవి నెగటివ్ ఎఫెక్ట్స్ ను కలిగిస్తాయి . ఇలాంటి కోవకు మీరు చెందిన వారైతే , భయపడాల్సిన పనిలేదు , మీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇతర మార్గాలు చాలా ఉన్నాయి. వీటితో మీ చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడంతో పాటు స్కిన్ కాంప్లెక్స్ ను మెరుగుపరుచుకోవచ్చు. కొన్ని నేచురల్ పదార్థాలతోనే మీరే ఇంట్లో స్వయంగా తయారుచేసుకొనే హోం రెమెడీస్ తో స్కిన్ కాంప్లెక్షన్ పెంచుకోవచ్చు.
అటువంటి నేచురల్ పదార్థాల్లో పసుపు ఒకటి. ఇది మన వంటగదిలోఒక నిత్యవసర వస్తువు. దీన్ని పురాతన కాలం నుండి కాస్మోటిక్ రెమెడీ గా ఉపయోగిస్తుంటారు.
ఇంకా ఆయుర్వేద రెమెడీస్ లో కూడా ఈ పసుపును ఎక్కువగా మెడిసిన్ గా ఉపయోగిస్తున్నారు . పసుపు మన చర్మాన్నియంగ్ గా మరింత అందంగా మార్చుతుంది. మరి అదేలా సాధ్యం అవుతుంది. అందుకు మీరు ఇంట్లో చేయాల్సిన పద్దతులేంటి, ఎలా అనుసరించాలో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

1. రెమెడీ 1: కావాల్సినవి:
శెనగపిండి, ఆలివ్ ఆయిల్ మరియు పసుపు
ఈ కాంబినేషన్ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసి , కొద్దిసేపటితర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ చర్మాన్ని అందంగా మార్చుతుంది . పసుపు స్కిన్ టోన్ ను లైట్ మరియు ఎఫెక్టివ్ గా మార్చుతుంది.

2. తయారుచేయు విధానం:
ఒక చెంచా శెనగపిండి, అర చెంచా పసుపు, మరియు ఆలివ్ ఆయిల్ ను బౌల్లో తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో 20 నిముషాలు పెట్టి చల్లబడనివ్వాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 25నిముషాల తర్వాత, స్క్రబ్ చేస్తూ గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి . తర్వాత మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి.

3. రెమెడి2 :
తేనె మరియు పసుపు
ఈ రెండింటి కాంబినేషన్ వండర్ ఫుల్ ఎఫెక్ట్ ను అందిస్తుంది . చర్మంలోపల కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది . తేనెలోని ఎక్స్ ఫ్లోయేటింగ్ ప్రొపర్టీస్ , తేనె డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది . దాంతో చర్మం యంగ్ గా మరియు ప్రకాశవంతంగా కనబడేలా చేస్తుంది.

4. తయారుచేయు పద్దతి:
కొద్దిగా పసుపు తీసుకొని అందులో 2 చెంచాలా తేనె మిక్స్ చేయాలి. చిక్కటి పేస్ట్ లా చేయాలి. ఈ సేస్ట్ ను చర్మానికి అప్లై చేయాలి. చర్మానికి అప్లై చేస్తూ మసాజ్ చేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

5. రెమెడి 3:
పసుపు మరియు గుడ్డు
ఈ పసుపు , గుడ్డు చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . చర్మం సాగడాన్ని మరియు ముడుతలను నివారిస్తుంది . చర్మ రంద్రాలను తగ్గిస్తుంది . చర్మానికి మంచి పోషణను అందిస్తుంది . గుడ్డు లోని ప్రోటీన్స్ స్కిన్ కంప్లెక్షన్ ను మెరుగుపరుస్తుంది . మంచి రేడియన్స్ ను అందిస్తుంది.

6. తయారుచేయు పద్దతి:
ఒక గుడ్డును బాగా గిలకొట్టి అందులో కొద్దిగా పసుపు వేయాలి. ఈ రెండింటి మిశ్రమాన్ని చిక్కటి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో స్క్రబ్ చేస్తూ శుభ్రం చేసుకోవాలి.

7.రెమెడీ 4:
కావల్సినవి: పసుపు, అవొకాడో మరియు పెరుగు
ఈ పవర్ ఫుల్ మిశ్రమం చర్మం నలుపును ఎఫెక్టివ్ గా పోగొడుతుంది . దాంతో చర్మం చాలా స్మూత్ గా మార్చుతుంది . స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది. అవొకాడో మీ చర్మ కణాలకు పోషణను అందిస్తుంది . పసుపు మరియు పెరుగు హెల్తీ గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది . చర్మ కాంతిని పెంచుతుంది.

8.తయారుచేయు పద్దతి:
అవొకాడో గుజ్జు మరియు పసుపును ఒక కప్పు పెరుగులో మిక్స్ చేయాలి . ఈ మిశ్రమాన్ని 15 నిముషాలు నానబెట్టాలి . ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసి 25 నిముషాల తర్వాత మన్నికైన ఫేష్ వాష్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి.

9.రెమెడీ 5:
కావల్సినవి: గందం, పసుపు మరియు రోజ్ వాటర్:
ఈ మిశ్రమం మీ చర్మం చూడటానికి కాంతివంతంగా మార్చుతుంది , గందం మరియు పసుపు కాంబినేషన్ స్కిన్ లైటనింగ్ గుణాలు కలిగి ఉన్నాయి.

10.తయారుచేయు పద్దతి:
ఒక చెంచా గందం పొడిలో మరియు పసుపును ఒక బౌల్లో తీసుకొని , అందులో కొన్ని చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేసి చిక్కగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి 15నిముషాలు మైల్డ్ ఫేస్ వాష్ లో చల్లటి నీరు ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి.

11. రెమెడీ 6:
పసుపు, శెనగపిండి మరియు బాదం ఆయిల్:
ఈ పసుపు రెమెడీ వండర్ ఫుల్ గా వర్క్ చేస్తుంది . ముఖంలో అవాంఛిత రోమాలను తొలగిస్తుంది . ఈ కాంబినేషన్ లో పసుపు మరియు శెనగపిండి, హెయిర్ ను తొలగించే ఏజెంట్ గా పనిచేస్తుంది . అభ్యంతరకరంగా కనిపించే ఫేషియల్ హెయిర్ ను రూట్స్ నుండి తొలగిస్తుంది . బాదం నూనె చర్మానికి మాయిశ్చరైజర్ ను అందిస్తుంది . చర్మాన్ని సాప్ట్ గా మార్చుతుంది.

12. తయారుచేయు పద్ధతి:
ఒక బౌల్లో శెనగపిండి మరియు పసుపు తీసుకొని బాగా మిక్స్ చేయాలి . అందులోని కొన్ని చుక్కల బాదం నూనె వేసి చిక్కగా పేస్ట్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి హెయిర్ పెరిగే వ్యతిరేఖ పద్ధతిలో నిధానంగా మర్దన చేయాలి. ఇలా స్క్రబ్ చేయడటం వల్ల అవాంఛిత రోమాలు పెరగకుండా అడ్డుకుంటుంది.



Click it and Unblock the Notifications