Latest Updates
-
చలికాలం స్పెషల్ రోగనిరోధక శక్తిని పెంచే ప్రొటీన్ రిచ్ పెసరపప్పు సూప్..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు పరోటా ఇంట్లోనే చేసుకోండిలా.. -
పొద్దున్నే 9 గంటలలోపు ఈ 5 పనులు చేస్తే.. మీ ఆయుష్షు 20 ఏళ్లు పెరుగుతుంది! -
శరీరంలో చెత్త మొత్తాన్ని తొలగించి, లివర్ ని శుభ్రపర్చే టీ ..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
చలికాలంలో దగ్గు, జలుబు మాయం చేసే సూప్ ఇదే..ఇడ్లీతో ముంచుకుని తిన్నా కేక -
అందమైన అమ్మాయి పిలిచిందని వెళ్తే..యువకుడికి ఊహించని షాక్! -
విటమిన్ A, C, K, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ కూర తింటే చలికాలంలో రోగాలన్నీ పరార్! -
బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే రవ్వ బన్ అప్పం.. తింటే వదలరు..10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
కీళ్ల నొప్పులు మాయం చేసే 1:4 మ్యాజిక్..ఇలా చేస్తే జీవితంలో మోకాళ్ల నొప్పులు రావు! -
చలికాలంలో ఎముకలను దృఢంగా ఉంచే రాగి మునగాకు రోటీ..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్
రోజూ నిమ్మరసం తాగుతుంటే కిడ్నీ రాళ్లు రావా?
కొత్త రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికి చాలా మంది ఉదయాన్నే ఒక గ్లాసు నిమ్మరసం నీళ్లు తాగడానికి ఇష్టపడతారు. శరీరాన్ని డిటాక్స్ చేయడం నుండి జీర్ణక్రియను మెరుగుపరచడం వరకు దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయని నమ్ముతారు. ముఖ్యంగా ప్రతిరోజూ నిమ్మరసం తాగితే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం తప్పుతుందని పెద్దలు చెబుతుంటారు. అసలు ఈ నమ్మకం వెనుక ఎంత నిజం ఉంది? కిడ్నీల ఆరోగ్యంపై నిమ్మరసం నిజంగానే ప్రభావం చూపుతుందా? దీనికి శాస్త్రీయంగా ఉన్న ఆధారాలేమిటో ఇక్కడ చూద్దాం.
సిట్రేట్ చేసే అద్భుతమైన మేలు
నిమ్మకాయలలో విటమిన్ సి తో పాటు సిట్రేట్ అత్యధిక మోతాదులో లభిస్తుంది. ముఖ్యంగా ఈ సిట్రేట్ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..మూత్రంలో సిట్రేట్ లెవల్స్ సరిగ్గా ఉంటే కాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఏర్పడే ముప్పు గణనీయంగా తగ్గుతుంది. ఎందుకంటే సిట్రేట్ అనేది కాల్షియంతో సులభంగా బంధం ఏర్పరచుకుని, స్పటికాలుగా మారి రాళ్లుగా గడ్డకట్టే అవకాశాలను సమర్థవంతంగా అడ్డుకుంటుంది.

నీటి పాత్ర చాలా కీలకం
అయితే కేవలం నిమ్మరసం తాగడం వల్ల మాత్రమే ఈ పూర్తి ప్రయోజనం లభిస్తుందని అనుకోవడం పొరపాటే. కిడ్నీల సంరక్షణకు తగిన మోతాదులో సాధారణ నీరు త్రాగడం కూడా అంతే ముఖ్యం. శరీరంలో హైడ్రేషన్ కొరత ఏర్పడితే మూత్రం చిక్కగా మారుతుంది. దీనివల్ల మినరల్స్ ఒకచోట చేరి రాళ్లుగా ఏర్పడే ముప్పు పెరుగుతుంది. అందువల్ల, మామూలు నీరు పుష్కలంగా తాగడమే కిడ్నీలో రాళ్ల సమస్యను నివారించడంలో ప్రధాన మార్గం. నిమ్మరసం అనేది నీరు త్రాగే అనుభూతిని మరింత రుచికరంగా మార్చడానికి ఒక మంచి మార్గమే తప్ప అదే సర్వరోగ నివారిణి కాదు.

అందరికీ ఇది సురక్షితమేనా?
నిమ్మరసం అందరికీ ఒకేలా ప్రయోజనకరంగా పనిచేస్తుందని చెప్పలేం. కొన్ని ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారికి ఇది నష్టాన్ని కలిగించవచ్చు. ఉదాహరణకు ఇప్పటికే కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారికి నిమ్మరసం హానికరం కావొచ్చు. అటువంటి వాళ్లు రోజువారీగా ఎంత ద్రవాహారం తీసుకోవాలనే దానిపై కచ్చితంగా డాక్టర్ల సలహా తీసుకోవాలి.
అంతేకాకుండా నిమ్మకాయలో పొటాషియం కూడా లభిస్తుంది. కిడ్నీల పనితీరు మందగించినప్పుడు, శరీరం నుండి అదనపు పొటాషియంని బయటకు పంపే సామర్థ్యం తగ్గిపోతుంది. దీనివల్ల రక్తంలో పొటాషియం స్థాయిలు ప్రమాదకరంగా పెరిగే అవకాశం ఉంది. ఇవే కాకుండా నిమ్మరసాన్ని అధికంగా తీసుకోవడం వల్ల కొందరిలో ఎసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు, కడుపులో మంట రావచ్చు. నిమ్మలోని ఆమ్ల గుణం వల్ల దంతాల ఎనామెల్ దెబ్బతినే ప్రమాదం కూడా లేకపోలేదు.
ఇది గుర్తుంచుకోండి
నిమ్మరసం అనేది మూత్రపిండాల్లో రాళ్లకు శాశ్వత నివారణ లేదా మందు కాదని గుర్తించుకోవాలి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి ఇది సమతుల్య ఆహారంలో, రోజూ తగినన్ని నీళ్లు తాగే అలవాటులో ఒక భాగం మాత్రమే అవుతుంది. ఒకవేళ మీకు ముందే కిడ్నీ వ్యాధి లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే, మీ అంతట మీరే ప్రతిరోజూ నిమ్మరసం తాగడం ప్రారంభించకండి. ఏదైనా కొత్త ఆహారపు అలవాటును అలవర్చుకునే ముందు డాక్టర్ సలహా తీపసుకోవడం బెటర్.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
