Latest Updates
-
శరీరంలో చెత్త మొత్తాన్ని తొలగించి, లివర్ ని శుభ్రపర్చే టీ ..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
చలికాలంలో దగ్గు, జలుబు మాయం చేసే సూప్ ఇదే..ఇడ్లీతో ముంచుకుని తిన్నా కేక -
అందమైన అమ్మాయి పిలిచిందని వెళ్తే..యువకుడికి ఊహించని షాక్! -
విటమిన్ A, C, K, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ కూర తింటే చలికాలంలో రోగాలన్నీ పరార్! -
బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే రవ్వ బన్ అప్పం.. తింటే వదలరు..10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
కీళ్ల నొప్పులు మాయం చేసే 1:4 మ్యాజిక్..ఇలా చేస్తే జీవితంలో మోకాళ్ల నొప్పులు రావు! -
చలికాలంలో ఎముకలను దృఢంగా ఉంచే రాగి మునగాకు రోటీ..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ -
టపాసుల నిప్పురవ్వలు పడి చర్మం కాలితే వెంటనే చేయాల్సిన, చేయకూడని పనులివే! -
దీపావళి స్పెషల్..బ్యాచిలర్స్ కూడా సులభంగా వండేలా.. అదిరిపోయే పొల్లాచి చికెన్ బిర్యానీ చేసుకోండిలా.. -
దీపావళి స్పెషల్.. రొటీన్ కు భిన్నంగా నోరూరించే గుంటూరు చికెన్ రోస్ట్.. ఈజీగా చేసుకోండిలా..
పొద్దున్నే 9 గంటలలోపు ఈ 5 పనులు చేస్తే.. మీ ఆయుష్షు 20 ఏళ్లు పెరుగుతుంది!
పొద్దున్న 9లోపు 5 పనులు చేస్తే మీ ఆయుష్షు 20 ఏళ్లు పెరుగుతుందట. మీ ఆయుష్షు పెంచుకోడానికి గంటలు గంటలు జిమ్ లో కష్టపడాల్సిన పని లేదు,బాడీని పాడు చేసే క్రేజీ డైట్ లు అసలే అక్కర్లేదు. లక్షల మందిపై చేసిన మిలియన్ వెటర్నరీ ప్రోగ్రామ్ రీసెర్చ్ ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది.
మన రోజువారీ జీవనశైలిలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే, పురుషుల ఆయుష్షు 24 సంవత్సరాలు, మహిళల ఆయుష్షు 20 సంవత్సరాలు పెరుగుతుంది. అయితే దీనికోసం కొండలు పిండి చేయాల్సిన అవసరం లేదు. రోజు పొద్దున్ను 9 గంటల్లోపు జస్ట్ 10 నిమిషాల్లో జస్ట్ 5 సింపుల్ హ్యాబిట్స్ పాటిస్తే చాలని కిఫీ హాస్పిటల్ యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో డాక్టర్ సుబ్రమణ్యం కారుటూరి చెప్పారు.

మొదటిది..పొద్దున్నే లేవగానే గుప్పెడు వాల్ నట్స్ తినడం
. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ స్టడీ ప్రకారం రోజూ నట్స్ తినేవారికి చావు ముప్పు 20 శాతం తగ్గుతుంది. వాల్ నట్స్ లో ఉండే ఒమేగా 3, ఎల్ ఆర్జినీన్ మన రక్తనాళాలను రిలాక్స్ చేసి, బ్లడ్ ఫ్రెషర్ అదుపులో ఉంచుతాయి.
రెండోది..మీ మార్నింగ్ కాఫీ లేదా గ్రీన్ టీ
JAMA స్టడీ ప్రకారం రోజుకి 2 కప్పులు కాఫీ తాగేవారిలో అకాల మరణ ముప్పు 12 శాతం తగ్గుతుంది. ఇది కెఫిన్ వల్ల కాదని, కాఫీలోని పాలిఫినాల్స్ వల్ల అని డాక్టర్ సుబ్రమణ్యం తెలిపారు . ఒకవేళ మీరు గ్రీన్ టీ తాగితే అందులో EG CG కెమికల్ క్యాన్సర్ ముప్పును 11 శాతం తగ్గించి పొట్ట దగ్గర ఉన్న పాత కొవ్వును కరిగిస్తుంది. కాకపోతే చక్కెర, పాలు లేకుండా ప్లెయిన్ గా తాగాలి.
మూడవది..చాలామంది అస్సలు పట్టించుకోని సైలెంట్ క్లిలర్-ఏకాంతం
ఒక రీసెర్చ్ ప్రకారం ఒంటరితనం వల్ల మరణించే ప్రమాదం 57 శాతం పెరుగుతుంది. ఎందుకంటే ఒంటరితనం మన నరాల వ్యవస్థను నిరంతర స్ట్రెస్ లో ఉంచుతుంది. పొద్దున్న లేచి, ఫోన్ పట్టకోవడం ఆపేసి, ఇంట్లో వాళ్లలో ఒక్క 5 నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడండి, లేదా ఒక ఒక చిన్న కాల్ చేయండి. మంచి మనుషుల కలయిక, సిగరెట్ మానడంతో సమానమైన ఆయుష్షును ఇస్తుందని డాక్టర్ సుబ్రమణ్యం చెప్పారు.

నాల్గవది..ఉదయాన్నే ఒక్క 10 నిమిషాలు ఎండలో నిలబడటం
పొద్దుటి సూర్యరశ్మి మన కళ్లపై పడగానే, మెదడులో బయోలాజికల్ క్లాక్(జీవగడియారం)రీసెట్ అవుతుంది. ఇది రాత్రికి సరిగ్గా నిద్ర పట్టేలా చేసే మెలటోనిన్ హార్మోన్ ను యాక్టివేట్ చేస్తుంది. మంచి నిద్ర మీ ఆయుష్షుని మరో 3 ఏళ్లు పెంచుతుంది.
ఐదవది..ఉదయం ఎండలోనే ఒక 15 నిమిషాలు నడవడం. రోజూ కేవలం 15 నిమిషాలు నడిచినా చాలు ఆయుష్షు 3 ఏళ్లు పెరుగుతుందని,4 లక్షల మందిపై చేసిన రీసెర్చ్ చెబుతుంది. ఉదయాన్నే నడక వల్ల సూర్యర్శి, వ్యాయామం, మైండ్ రిలాక్సేషన్ అన్నీ ఒకేసారి లభిస్తాయి.
చివరగా తినే తిండి..
పొద్దున్నే బిస్కెట్లు, బ్రెడ్ లు, ఇడ్లీలు, చపాతీలు తిని బ్లడ్ షుగర్ స్పైక్స్ తెచ్చుకోవద్దు. ప్రొటీన్, పీచు పదార్థం, ఫైబర్ ఎక్కువగా ఉండే గుడ్లు, జ్యూస్ లో చియా సీడ్స్ లేదా ఫ్లాక్ సీడ్స్ వేసుకుని తీసుకోండి. ఇది రోజుంతా మిమ్మల్ని ఎనర్జిటిక్ గా ఉంచుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
