Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
మొటిమలను నివారించే విటమిన్ సి హానీ ఫేస్ ప్యాక్ ...
ప్రస్తుత రోజుల్లో స్త్రీ , పురుషులిద్దరిలో వేధిస్తున్న సమస్య మొటిమలు. ఈ మొటిమలు ఏ రూపంలో అయినా ముఖం మీద ఏర్పడవచ్చు. చిన్నవిగా, పెద్దవిగా, చిన్న బుడిపెలుగా , బ్లాక్ హెడ్స్ లేదా సాధారణ మొటిమల రూపంలో కనబడుతాయి . మొటిమలు ఎలా ఏర్పడినా ఇవి మీ అందాన్ని పాడు చేస్తాయి . అంతే కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ను దెబ్బ తీస్తాయి.
ఈ మొటమలకు ప్రధాణ కారణం చర్మ రంద్రాలు మూసుకుపోవడం . డెడ్ స్కిన్ సెల్ తొలగించకపోవడం, అలాగే చర్మ రంద్రాల్లో బ్యాక్టీరియా చేయడం, ఇంకా ఇతర చర్మ సమస్యలు మొటిమలకు కారణమవుతుంది.
ఇంకా ఒత్తిడి, మరియు హార్మోనుల్లో మార్పులు వల్ల చర్మంలో మొటిమలు ఏర్పడుతాయి. ఈ మొటిమలు, మచ్చలను సులభంగా , సురక్షితంగా తొలగించుకోవడం వల్ల మొటిమలు పగలకుండా ఉంటాయి. ఇలా సురక్షితమైన పద్ధతిలో మొటిమలను నివారించుకోవడం కొద్దిగా కష్టమే . అయితే కొన్ని నేచురల్ పదార్థాలతోటే ఎఫెక్టివ్ గా, సేఫ్ గా తగ్గించుకోవచ్చు. ఈ హోం రెమెడీస్ బ్యూటీ స్ట్రోర్స్ లో లభించే క్రీములకన్నా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

అలాంటి ఎఫెక్టివ్ హోం రెమెడీ మనమే ఇంట్లో తయారుచేసుకొనే పద్ధతిని ఈ క్రింది విధంగా తెలపడం జరిగింది. ఈ సెల్ఫ్ మాస్క్ , విటమిన్ సి పౌడర్ లేదా ఆరెంజ్ తొక్క పొడి , తేనె మరియు లావెండర్ నూనె అవసరమవుతాయి.
విటమిన్ సి పౌడర్ చర్మంలో పిహెచ్ లెవల్ ను రీస్టోర్ చేస్తుంది. అదే విధంగా తేనె ఒక అద్భుతమైన యాంటీసెప్టిక్ , యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల కలిగినది.
ఇక లావెండర్ ఆయిల్ మరో మోస్ట్ బెనిఫిషియల్ ఆయిల్ ఇది. మొటిమలు బ్రేక్ అవుట్ కాకుండా సురక్షితంగా మొటిమలను నివారిస్తుంది. మరి ఈ యాంటీ ఏన్స్ ఫేస్ మాస్క్ ను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...

కావల్సిన పదార్థాలు:
విటమిన్ సి లేదా ఆరెంజ్ పీల్ పౌడర్ : 1టీస్పూన్
తేనె : 1 టీస్పూన్
2-3 చుక్కల లావెండర్ ఆయిల్
ఎలా ఉపయోగించాలి:
ఈ పదార్థాలన్నింటిని మిక్స్ బౌల్లో వేసి మిక్స్ చేయాలి. తర్వాత ఈ ఫేస్ మాస్క్ ను ముఖం మరియు మెడకు అప్లై చేయాలి.
20 నిముషాలు తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి.
వారంలో రెండు సార్లు ఈ మాస్క్ వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications