పసుపు ఫేస్ ఫ్యాక్ తో ఫెయిర్ స్కిన్ మీ సొంతం...!!

పసుపుతో ప్రాచీన కాలం నుండి భారతీయులు వంటకాలలో పసుపుకు చాలా ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. కానీ ఈ తరంలో తెలియని తనం వల్ల పసుపు యెక్క ప్రాధాన్యతను కొందరు విస్మరిస్తున్నారు. పసుపు కేవలం వంటకానికి రంగును తెచ్చేది మాత్రమే కాదు. పసుపుతో నీరుకలిపి మెత్తగా పేస్ట్ లా చేసి క్రమంగాలోనికి తీసుకుంటే శరీరానికి చురుకుదనం పెరుగుతుందని ఆయుర్వేదం వెల్లడిస్తోంది.

పసుపును వాడిన ఆహారము చర్మరోగాలను హరిస్తుంది. కొన్ని సార్లు మనం తీసుకునే ఆహారంలో విషపధార్థాలు లేక మలినపధార్థాలు కలిసి ఉండి మనలోకి వెళుతాయి. పసుపు కావాలిసినంతగా కలిపిన ఆహారం విష మరియు మలిన పధార్థాలను పసుపు తొలగిస్తుంది. గ్యాస్ట్రబుల్ మరియు కడుపులో మంటలాంటి సమస్యలను పసుపు ఓ చక్కని రోగనివారిణిగా గుర్తించబడుతుంది.

సౌందర్యాన్ని మెరుగు పరిచే పరిశ్రమలు కూడా పసుపుకు ఎంతో ఋణపడి ఉన్నాయి. మెత్తగా పేస్టులా కలిపి చర్మానికి రుద్దుకున్నట్లయితే చర్మం నునుపుగా మారి తేజోవంతమవుతుంది. అలా పసుపు బాహ్య మరియు అంతరప్రయోజనాలకు ఎంతాగానో ఉపయోగపడుతుంది.

చర్మాన్ని సంరక్షించే పదార్దాలలో, పసుపు ఎంతో ముఖ్యమైనది. ఇది మన చర్మంలోని జిడ్డు తనాన్ని తొలగించి, దద్దుర్లు, మొటిమల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఇది మన చర్మాన్ని నిగారింపచేసి ఎంతో అందంగా మరియు మృదువుగా మారుస్తుంది. పసుపులోని గుణాలు చర్మాన్ని శుభ్రపరిచి, పనికిరాని అంటే సరిగా లేని చర్మాన్ని తోలగించి కొత్తగా, అందమైన మరియు, ఎంతో మృదువైన చర్మాన్ని ఇస్తుంది.

ఈ పసుపుతో చేసిన "ఫేస్ ప్యాక్" మొటిమల్ని నిర్మూలించి, చర్మాన్ని ఎంతో కాంతివంతంగా చేస్తుంది. ఇది మీ శరీరంలోని మలినాలని, దుమ్ము, ధూళిని, మరియు బ్యాక్టీరియా ని తొలగించి యాంటీ బాక్టీరియల్ గా పనిచేస్తుంది. పసుపు మీ చర్మంలోని జీవం కోల్పోయిన కణాలని తొలగించి, శుబ్రపరిచి, ఎంతో కాంతివంతమైన, మరియు తేజోవంతమైన చర్మాన్ని ఇస్తుంది. మన చర్మం లోని రంద్రాలని దుమ్ము మరియు మలినాల నుండి శుభ్రపరిచి, సహజత్వంతో కూడిన చర్మాన్ని ఇస్తుంది. పసుపు మాత్రమే కాకుండా పసుపుకి ఇతర సౌందర్య ఉత్పత్తులను జోడించడం వల్ల ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది .

పసుపు మరియు ఓట్స్ పిండితో తయారు చేసిన

పసుపు మరియు ఓట్స్ పిండితో తయారు చేసిన "ఫేస్ ప్యాక్"

కావలసినవి : పసుపు: 2 చిటికెలు (కొద్దిగా), ఓట్స్ పిండి: 4-5 స్పూన్లు, తేనె: 3-4 స్పూన్లు, పచ్చి పాలు: 4-5 స్పూన్లు

తయారుచేసుకునే విధానం : పైన సూచించినవన్నీ ఒక గిన్నేలొ కలిపి పేస్టులా చేసుకోవాలి, దానిని మీ ముఖానికి రాసుకుని 15-20 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే, పాలు తేనే మన ముఖంలోని తేమను కాపాడతాయి, పసుపు మన ముఖం పై ఉన్న మచ్చలు, మోటిమలను శుబ్రం చేసి, ఎంతో కాంతివంతమైన చర్మాన్ని ఇస్తుంది. ఈ చిట్కా పొడిగల చర్మం ఉండి మొటిమలతో బాధపడేవారికి ఎంతో మంచి ఫలితాలని ఇస్తుంది.

పసుపు & పెరుగుతో తయారు చేసిన

పసుపు & పెరుగుతో తయారు చేసిన "ఫేస్ ప్యాక్"

కావలసినవి : పసుపు: 3-4 చిటికెలు (కొద్దిగా), పెరుగు: 12 కప్పు

తయారుచేసుకునే విధానం : పైన సూచించినవన్నీ ఒక గిన్నేలొ కలిపి పేస్టులా చేసుకోవాలి, దానిని మీ ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే,సుర్యుని వేడి వల్ల మాడిన, లేదా రంగు మారిన చర్మం అందంగా మారుతుంది, ఈ మిశ్రమాన్ని ముఖానికే కాకుండా కాళ్ళు, చేతులకు కూడా రాసుకుని 15-20 నిమిషాల తర్వాత శుబ్రపరుచుకుంటే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.

పసుపు మరియు గంధముతో (sandal) తయారు చేసిన

పసుపు మరియు గంధముతో (sandal) తయారు చేసిన "ఫేస్ ప్యాక్"

కావలసినవి : పసుపు: 3-4 చిటికెలు (కొద్దిగా), గంధపు పొడి (sandal wood powder) 1-2 టేబుల్ స్పూన్లు, పాలు: 1-2 స్పూన్లు

తయారుచేసుకునే విధానం : పైన సూచించినవన్నీ ఒక గిన్నేలొ కలిపి పేస్టులా చేసుకోవాలి, దానిని మీ ముఖానికి రాసుకుని 10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే,మీ చర్మంలోని నల్లదనం మొత్తం పోయి ఎంతో కాంతివంతమైన, మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది.

పసుపు మరియు తేనెతో తయారు చేసిన

పసుపు మరియు తేనెతో తయారు చేసిన "ఫేస్ ప్యాక్"

కావలసినవి : పసుపు: 2 చిటికెలు (కొద్దిగా), తేనె 2-3 టేబుల్ స్పూన్లు పన్నీరు 1-2 టేబుల్ స్పూన్లు

తయారుచేసుకునే విధానం : పైన సూచించినవన్నీ ఒక గిన్నేలొ కలిపి పేస్టులా చేసుకోవాలి, దానిని మీ ముఖానికి, మెడకి రాసుకుని 10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే, మీ ముఖం పై ఉన్న ముడతలు పోయి మృదువైన చర్మాన్ని పొందుతారు.ముఖంలో రేడియంట్ లుక్ అంధిస్తుంది.

పసుపు మరియు నిమ్మరసంతో తయారు చేసిన

పసుపు మరియు నిమ్మరసంతో తయారు చేసిన "ఫేస్ ప్యాక్"

కావలసినవి: పసుపు 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం 1-2 టేబుల్ స్పూన్లు

పైన సూచించినవన్నీ ఒక గిన్నేలొ కలిపి పేస్టులా చేసుకోవాలి, దానిని మీ ముఖానికి, మెడకి రాసుకుని 10 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే, ఈ మిశ్రమం ఒక బ్లీచింగ్ లా ఉపయోగపడి మీ ముఖానికి కాంతినిస్తుంది. పైన సూచించినవి అన్నీ మీ చర్మ సౌందర్యాన్ని కాపడటానికి ఎంతో ఉపయోగపడతాయి, అందమైన చర్మం పొందాలంటే పైన సూచించిన పాటించండి, మెరుగైన ఫలితాలు పొందుతారు.

పసుపు మరియు మస్టర్డ్ ఆయిల్:

పసుపు మరియు మస్టర్డ్ ఆయిల్:

కావల్సినవి: పచ్చి పసుపు : కొద్దిగా, మస్టర్డ్ ఆయిల్ : ఒక టీస్పూన్

తయారుచేసుకునే విధానం : పచ్చిగా ఉన్న పసుపు అల్లంలా అగుపిస్తుంది. ఈ పచ్చి పసుపుకొమ్మ మీద మస్టర్డ్ ఆయిల్(ఆవనూనె)పోయాలి. తర్వాత దీన్ని పేస్ట్ లా గ్రైడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నుండి వచ్చే రసానికి కొద్దిగా మస్టర్డ్ ఆయిల్ మిక్స్ చేసుకొని, ముఖానికి పట్టించాలి. ఇది తడి ఆరిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ముఖంలో కాంతి నిండుతుంది.

 పసుపు-పాల క్రీమ్:

పసుపు-పాల క్రీమ్:

కావల్సినవి: పసుపు : 1 టీస్పూన్, పాలకక్రీమ్ ఒక టీస్పూప్

తయారుచేసుకునే విధానం : అతి త్వరగా ఫెయిర్ స్కిన్ పొందడానికి పాలు, పసుపు క్రీమ్ బాగా సహాయపడుతుంది. తాజా మిల్క్ క్రీమ్ మీ చర్మానికి మాయిశ్చరైజ్ చేస్తుంది మరియు మీ చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది.

పసుపు-రోజ్ వాటర్:

పసుపు-రోజ్ వాటర్:

కావల్సినవి: పసుపు ఒక టీస్పూన్ , రోజ్ వాటర్ రెండు టీస్పూన్లు, పెరుగు అరటీస్పూన్

తయారుచేసుకునే విధానం : పసుపులో , ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. అలాగే అర టేబుల్ స్పూన్ పెరుగు వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ టర్మరిక్ ఫేస్ ప్యాక్ మీ చర్మానికి రిలాక్స్ ఇస్తుంది మరియు డీస్ట్రెస్ గా పనిచేస్తుంది.

 పసుపు-కుంకుమపువ్వు:

పసుపు-కుంకుమపువ్వు:

కావల్సినవి : కుంకుమ పువ్వు ఒక టీస్పూన్, పసుపు : ఒక టీస్పూన్

తయారుచేసుకునే విధానం : కుంకుమ పువ్వు యొక్క ప్రాధాన్యత ఏంటో మీకు తెలిసినదే, చందనం తర్వాత కుంకుమ పువ్వు అందాన్ని మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. కాబట్టి కుంకుమపువ్వు, పసుపు రెండింటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ కు కొద్దిగా పాలు మిక్స్ చేసి, ముఖానికి పట్టించడం వల్ల, ఇది తక్షణ మెరుపు అందిస్తుంది. ముఖం ప్రకాశవంతంగా కనబడుతుంది.

 పసుపు మరియు ముల్తానీ మట్టి:

పసుపు మరియు ముల్తానీ మట్టి:

కావల్సినవి: పసుపు: 1టీస్పూన్ , ముల్తాని మట్టి: 1టీస్పూన్

తయారుచేసుకునే విధానం : ఆయిల్ స్కిన్ మరియు మొటిమల నివారణకు ఫుల్లర్స్ ఎర్త్ లేదా ముల్తానీ మట్టి ఏవిధంగా సహాయపడుతుందో అందరికీ తెలిసిన విషయమే. పసుపు పేస్ట్, పాలు మరియు ముల్తానీ మట్టి సమానంగా తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ కూలింగ్ ఫేస్ ప్యాక్ ను ముఖానికి పట్టించి మెరిసే, ప్రకాశవంతమైన చర్మాన్ని పొందండి.

పసుపు మరియు శెనగపిండి:

పసుపు మరియు శెనగపిండి:

కావల్సినవి: పసుపు : 1టీస్పూన్, శెనగపిండి: ఒక టీస్పూన్

పసుపు ఇండియన్ బ్యూటీ ప్రొడక్ట్. కాబట్టి పసుపు పేస్ట్ కు శెనగపిండి, పాలు కలిపి బాగా మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ మీద రుద్దాలి.అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల చర్మంలోని డెడ్ స్కిన్ సెల్ మరియు మురికిని తొలగిస్తుంది.

Story first published: Monday, July 25, 2016, 18:00 [IST]
Desktop Bottom Promotion