Latest Updates
-
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.!
30లోకి ఎంట్రీనా ? యంగ్ లుక్ తీసుకొచ్చే ఫేస్ ప్యాక్స్
ముప్పై దాటాక ముఖంపై ముడతలు, నిర్జీవమైన చర్మం, వయసు పైబడుతున్న సంకేతాలు. ఇవన్నీ చాలా ఇబ్బందికి గురిచేస్తాయి. అప్పుడే.. వయసు పెరిగిందా అన్న భావనను కలిగిస్తాయి. అలాగే యంగ్ లుక్ పొందడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. లేదంటే.. మీరు వయసుకంటే పెద్దవారిలా మారిపోతారు. కాబట్టి.. మూడు పదుల్లోనూ.. నవ యవ్వనంగా మెరిసిపోవాలంటే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవడం మంచిది.
జుట్టు రాలడం, బట్టతల, చుండ్రు నివారించే ఆనియన్ జ్యూస్ ట్రీట్మెంట్
అయితే 30లోకి ఎంటర్ అవుతున్నారంటే.. ఇక పార్లర్స్ లో ప్రతి నెలా ఫేషియల్స్.. యాంటీ ఏజింగ్ క్రీమ్ లు వాడటం మొదలుపెడుతున్నారా ? అలాంటి కెమికల్ ప్రాడక్ట్స్ వాడితే.. మీ చర్మానికి హాని కలిగే అవకాశాలున్నాయి. అలాగే.. కొంతమంది చర్మ తత్వానికి అవి సరిపడవచ్చు.. మరికొంతమందికి అలర్జీలు తీసుకురావచ్చు. కాబట్టి.. ఎప్పుడైనా సహజ మార్గాలను ఎంచుకుంటేనే.. సహజ మెరుపును సొంతం చేసుకోవచ్చు. అలాంటి న్యాచురల్ అండ్ సేఫ్ రెమిడీస్ మీ కోసం.

రెండు టీస్పూన్ల రోజ్ వాటర్‌లో ఒక చుక్క గ్లిజరిన్ తీసుకుని రెండు చుక్కల నిమ్మరసం కలపాలి. ఇందులో కాటన్ ముంచి తీసి ముఖానికి, మెడ భాగానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల రోజంతా చర్మంకు మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది. అలాగే చర్మం యంగ్ లుక్ తో మెరిసిపోతుంది.
ఆయిలీ స్కిన్ ఇబ్బందిపెడుతోందా ? డోంట్ వర్రీ..
ఎగ్ చర్మ సౌందర్యంలో చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. టీస్పూన్ తెల్లసొన తీసుకోవాలి. అర టీస్పూన్ నిమ్మరసం తీసుకుని తెల్లసొనలో వేసి బాగా కలపాలి. చిక్కగా అయిన తర్వాత ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు మూడు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

క్యారెట్స్ తింటే ఆరోగ్యమే కాదు.. దాన్ని సౌందర్య సాధనంగా కూడా ఉపయోగించవచ్చు. చిన్న క్యారట్ ముక్క, సగం బంగాళాదుంప తీసుకుని నీటిలో వేసి మెత్తగా ఉడకబెట్టాలి. తర్వాత రెండిటినీ గుజ్జులా చేయాలి. అందులో చిటికెడు బేకింగ్ సోడా, పసుపు వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని రెండు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే.. చర్మంపై ముడతలు పడకుండా.. స్మూత్ గా ఉంటుంది.



Click it and Unblock the Notifications
