Latest Updates
-
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.!
అసలు ఎన్ని రోజులకు ఒకసారి ఫేస్ ప్యాక్ అప్లై చేయాలి ?
ప్రతి ఒక్కరూ చర్మం సంరక్షణ కోసం చాలా కేర్ తీసుకుంటారు. చర్మం నిగారిస్తూ.. ఫ్రెష్ గా కనిపించాలని.. ఫేస్ క్రీమ్ లు, ఫేస్ వాష్ లు, ఫేస్ ప్యాక్ లు ఉపయోగిస్తూ ఉంటారు. మరికొందరు రెగ్యులర్ గా పార్లర్ కి వెళ్లి ఫేషియల్స్ కూడా చేయిస్తూ ఉంటారు. అయితే.. ఇంట్లోనే రెగ్యులర్ గా హోం మేడ్ ఫేస్ ప్యాక్ లు వేసుకోవడం అలవాటుగా ఉంటుంది కొంతమందికి.
మరి ఫేస్ ప్యాక్ లు వేసుకున్నప్పుడంతా.. ఎన్ని రోజులకు ఒకసారి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి ? ఎన్ని రోజులకు వేసుకుంటే.. చర్మం నిగారిస్తుంది ? అనేది చాలా మందికి ఉండే సందేహం. అలాగే న్యాచురల్ ఫేస్ ప్యాక్స్ ఉపయోగిస్తే.. చర్మం స్మూత్ గా, క్లియర్ గా ఉంటుదా అనేది కూడా సందేహమే. అయితే మీ చర్మ తత్వాన్ని బట్టి ఎన్ని రోజులకు ఒక సారి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి అనేది ఆధారపడి ఉంటుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. మరి మీ చర్మ తత్వాన్ని బట్టి.. ఎన్ని రోజులకు ఒకసారి ఫేస్ ప్యాక్ వేసుకోవాలో తెలుసుకోండి ?

స్కిన్ టైప్
డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్, కాంబినేషన్ స్కిన్.. ఇలా మీ స్కిన్ టైప్ తెలుసుకుని ఫేస్ ప్యాక్ ఎన్ని రోజులకు ఒకసారి, ఎలాంటి ప్యాక్ వేసుకోవాలి అనేది డిసైడ్ అవ్వాలి.

ఆయిలీ స్కిన్
ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్లు 15 రోజులకు ఒకసారి ఫేస్ ప్యాక్ ఉపయోగించడం మంచిది.

నార్మల్, సెన్సిటివ్, డ్రై స్కిన్
నార్మల్, సెన్సిటివ్, డ్రై స్కిన్ కలిగిన వాళ్లు.. మూడు వారాలకు లేదా నెలకు ఒకసారి ఫేస్ ప్యాక్ వేస్తే సరిపోతుందని సూచిస్తున్నారు.

కాంబినేషన్ స్కిన్
కాంబినేషన్ స్కిన్ ఉన్నవాళ్లు వారానికి ఒకసారి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు పొందుతారని బ్యూటీ ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు. కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్లు రెండు రకాల ఫేస్ ప్యాక్ లు ఉపయోగించాలి. ఒకటి ఆయిలీ స్కిన్ తగ్గించేది, ఇంకొకటి.. డ్రైనెస్ తగ్గించేది.

మాయిశ్చరైజర్
మీది ఎలాంటి స్కిన్, ఎలాంటి ఫేస్ ప్యాక్ ఉపయోగిస్తున్నారు అనేది అనవసరం. ముఖ్యంగా.. చర్మం హైడ్రేట్ గా ఉండాలి. కాబట్టి చర్మంపై కాస్త తేమ ఉండగానే మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల.. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

గ్లోయింగ్ స్కిన్ ఫేస్ ప్యాక్
చర్మానికి క్లెన్సింగ్ ఎఫెక్ట్ ఇచ్చే నిమ్మకాయను ఎప్పుడూ.. డైరెక్ట్ గా ఉపయోగించరాదు. కాబట్టి.. ఏదైనా పదార్థంలో ఉపయోగించే వాడితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే నిమ్మ లేదా విటమిన్ సి ఉండే ఫేస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల.. ట్యాన్, పిగ్మెంటేషన్ నివారించవచ్చు. కాబట్టి ఒక టమోటా గుజ్జు, ఒక స్పూన్ పాలు, ఒక స్పూన్ పసుపు, నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి.. ఫేస్ ప్యాక్ అప్లై చేయాలి.

డల్ స్కిన్
నిర్జీవంగా మారిన చర్మ తత్వానికి వేపతో తయారు చేసిన ఫేస్ ప్యాక్స్ వేసుకుంటే.. మీ చర్మం గ్లోయింగ్ గా మారుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని వేప ఆకులను వేడినీటిలో ఉడికించి మెత్తటి పేస్ట్ లా తయారు చేసి ముఖానికి పట్టించాలి. 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

అలోవెరా
అలో వెరా జెల్ చర్మానికి అప్లై చేయడం వల్ల మాయిశ్చరైజర్ ని రీస్టోర్ చేయడంతో పాటు.. చర్మాన్ని స్మూత్ గా మార్చి.. గ్లో తీసుకొస్తుంది.



Click it and Unblock the Notifications