Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
చర్మం టైట్ గా, ఫైనీగా మారడానికి సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెమిడీస్..!
చర్మం టైట్ గా, షైనీగా ఉన్నప్పుడే.. మీరు చాలా ఎట్రాక్టివ్ గా ఉంటారు. ఎక్కువ అందమైన చర్మం పొందే ఛాన్స్ ఉంటుంది. కానీ.. ప్రస్తుతమున్న అలవాట్లు, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు తోడై.. చర్మం నిర్జీవంగా మారడానికి కారణమవుతోంది.
ఇన్ని సమస్యల కారణంగా చర్మం డల్ గానే కాదు.. లూజ్ గా మారుతోంది. ఇలా వదులైపోయిన చర్మాన్ని టైట్ గగా మార్చడానికి కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. వాటిని ఇంట్లోనే తయారు చేసుకుని రెగ్యులర్ గా ప్రయత్నిస్తే.. మీ స్కిన్ టైట్ గా, షైనీగా మారుతుంది.

కలబంద
కలబంద గుజ్జుని ఫేస్ కి అప్లై చేసి.. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. చర్మంపై ఉన్న డస్ట్ తొలగిపోయి చర్మం మెరిసిపోతుంది.

అరటిపండు
బాగా పండిన అరటిపండుని గుజ్జుగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి.. 15 నిమిషాలు ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవచ్చు. లేదా అరటిపండు గుజ్జులో తేనె, పెరుగు కలిపి రాసినా.. చర్మం టైట్ గా మారుతుంది.

గుడ్డులోని తెల్లసొన
గుడ్డులోని తెల్లసొనను ఫేస్ కి ప్యాక్ లా అప్లై చేయాలి. పూర్తీగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే.. చర్మం కాంతివంతంగా మారుతుంది.

పాలు
కొద్దిగా ముల్తానీ మట్టిలో కొన్నిపాలు మిక్స్ చేసి ప్యాక్ లా ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే.. చర్మం టైట్ గా మారుతుంది.

పాలపొడి
కొద్దిగా పాలపొడి తీసుకుని కొన్ని నీళ్లు కలిపి పేస్ట్ చేసుకోవాలలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటే.. చర్మానికి తేమ అంది.. టైట్ గా మారుతుంది.

స్ట్రాబెర్రీ
స్ట్రాబెర్రీలతో చర్మాన్ని టైట్ గా మార్చవచ్చు. ముందుగా స్ట్రాబెర్రీని పేస్ట్ చేసుకుని కొద్దిగా మొక్కజొన్న పిండి కలపాలి. ఈ ప్యాక్ ని ఫేస్ కి అప్లై చేసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications
