Latest Updates
-
జస్ట్ 20 నిమిషాల్లో ది బెస్ట్ సాంబార్ రైస్.. రెస్టారెంట్ ని మించిన రుచితో ఎలా చేసుకోవాలంటే.. -
మలబద్దకంతో బాధపడుతున్నారా? మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఈ ఫుడ్స్ తినండి -
అన్నం, కూర అక్కర్లేదు..ఇదొక్కటి ఉంటే చాలు పొట్టకి హాయిగా, లంచ్ బాక్స్ కి బెస్ట్..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ లడ్డు ఒక్కటి తింటే చాలు..శరీరానికి అవసరమయ్యే కాల్షియం, ప్రొటీన్, ఇంకా చాలా పోషకాలు -
వేడి చేసి మూత్రం సరిగ్గా రావట్లేదా? మన పూర్వీకుల ఈ పచ్చడి తింటే చాలు..చుక్క నూనె లేకుండానే క్షణాల్లో చేయండిలా -
చాలా తక్కువ టైంలో రుచికరమైన, పౌష్టికమైన పచ్చడి.. ఉల్లిపాయలతో ఈజీగా చేసేయండిలా.. -
పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసులు..పక్షవాతం రాకుండా అడ్డుకునే బెస్ట్ వ్యాయామం ఇదే! -
క్యాలరీలు తక్కువ, ప్రొటీన్ ఎక్కువ..తోటకూర అలసందల వేపుడు ఇలా చేస్తే అదరహో.. -
కొండలను ఢీకొట్టే శక్తినిచ్చే బార్లీ మిక్స్..ఒక్కసారి చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ చిటికెలో -
ఎక్కువ ప్రొటీన్, బోలెడంత ఫైబర్..చుక్క నూనె లేకుండా ఎనకటి తరం హెల్తీ జొన్న ఆవిరి కుడుము చేసుకోండిలా..
క్లియర్ స్కిన్ కోసం హీరోయిన్స్ ఫాలో అయ్యే సింపుల్ హోం రెమిడీస్..!!
వెండితెరపై వెలిగిపోయే అందాల తారలను చూసి.. వావ్ వాళ్ల స్కిన్ అంత గ్లోయింగ్ గా, క్లియర్ గా ఎలా ఉంటుంది ? వాళ్లు ఎలాంటి కేర్ తీసుకుంటారు ? అన్న డౌట్స్ చాలామంది అమ్మాయిలకు వస్తుంటాయి. మరికొందరైతే.. వాళ్లు రెగ్యులర్ గా పార్లర్లకు వెళ్తారు కాబట్టి.. వాళ్ల చర్మం అంత మెరిసిపోతుందని భావిస్తారు.
కానీ.. హీరోయిన్స్ స్కిన్ సీక్రెట్స్ ఎక్కడో పార్లర్ లో కాదు.. ఇంట్లోనే ఉన్నాయట. ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్, ట్రీట్మెంట్స్ తోనే వెండితెర ముద్దుగుమ్మల చర్మం గ్లోయింగ్ గా ఉంటుందని భావిస్తే.. మీరు పొరబడ్డట్టే. బ్యూటీ ప్రొడక్ట్స్, ట్రీట్మెంట్స్ వల్ల చర్మంపై సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని వాళ్లు భావించి.. హోం రెమిడీస్ ఫాలో అవుతూ.. చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకుంటున్నారట.
బాలీవుడ్ లో టాప్ ఛెయిర్ లో ఉన్న యంగ్ అండ్ బ్యూటిఫుల్ బ్యూటీస్ తమ చర్మ సౌందర్యానికి ఫాలో అయ్యే టిప్స్ అండ్ ట్రిక్స్ ని రివీల్ చేసేశారు. సింపుల్ గా ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతోనే క్లియర్ స్కిన్ పొందుతామంటున్న వాళ్ల టిప్స్ ఏంటో తెలుసుకోండి. ఏ హీరోయిన్ ఎలాంటి రెమిడీస్ ఫాలో అవుతుందో మీకోసం..

అలియా భట్
వాగ్యూ ఇంటర్వ్యూలో బబ్లీ బ్యూటీ అలియా భట్ తన స్కిన్ సీక్రెట్ ని రివీల్ చేసింది. ఈమె తన కళ్లు హెల్తీగా ఉండటానికి ఐస్ క్యూబ్స్, చర్మ సమస్యలు దరిచేరకుండా ఉండటానికి ముల్తానీ మట్టిని ఉపయోగిస్తుందట.

పరిణీతి చోప్రా
చర్మ సౌందర్యానికి పరిణీతి చోప్రా వాళ్ల అమ్మ ఎప్పుడూ.. హోం రెమిడీస్ నే ఫాలో అవమని చెప్పేదట. అన్నీ ఫాలో అవకపోయినా.. న్యాచురల్ అలోవెరా జ్యూస్ ని ముఖానికి ఎప్పుడూ పట్టించడం అలవాటుగా మారిందట. ఇది అప్లై చేయడం వల్ల.. చర్మం సాఫ్ట్ గా, మాయిశ్చరైజ్డ్ గా ఉంటుందని చెబుతోంది ఈ బ్యూటీ.

దీపికా పదుకొనె
వారానికి ఒకసారి ఖచ్చితంగా కొబ్బరినూనెతో జుట్టుకి మసాజ్ చేసుకుంటుందని.. పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకొనె. దీనివల్ల ఎక్కువసేపు ఎండలో ఉండటం వల్ల డ్యామేజ్ అయిన జుట్టుకి పోషణ అందుతుందని చెబుతోంది. ఈ హెయిర్ కేర్ టిప్ ని.. తన చిన్నతనం నుంచి ఫాలో అవుతోందట.. ఇది చాలా వండర్ ఫుల్ గా పనిచేస్తోందని చెబుతోంది.

సోనమ్ కపూర్
బాలీవుడ్ బ్యూటీ.. సోనమ్ కపూర్ చాలా సింపుల్ టిప్ తో.. అందమైన చర్మాన్ని సొంతం చేసుకుంది. ముందుగా పాలతో చర్మానికి బ్లీచ్ చేసి, తర్వాత శనగపిండి, పెరుగు ఫేస్ ప్యాక్ అప్లై చేస్తుంది. అలాగే జుట్టు సంరక్షణకు నెలకు రెండు సార్లు ఆల్మండ్ ఆయిల్, కొబ్బరినూనె, షీకాకాయ మిశ్రమాన్ని పట్టిస్తుందట. ఇది జుట్టుకి చాలా స్మూత్ నెస్ అందిస్తుందట.

కరీనా కపూర్
సైజ్ జీరోతో ఆకట్టుకున్న కరీనా కపూర్.. ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు.. స్కిన్ లో ఎలాంటి మార్పూ రాలేదు. ఈ ముద్దుగుమ్మ తేనెను చర్మానికి పట్టించడం వల్ల.. చర్మం హైడ్రేట్ గా ఉంటుందట. ఇదే ఈ బ్యూటీ స్కిన్ సీక్రెట్.

అనుష్కా శర్మ
అనుష్కా శర్మ క్లియర్ స్కిన్ సీక్రెట్ కూడా.. చాలా సింపుల్ రెమిడీ. రోజ్ వాటర్ తో ఫేస్ వాష్ చేసి.. వేప ఆకుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటుందట. దీనివల్ల చర్మం డెటాక్సిఫై అవుతుంది. హాట్ ఆయిల్ ట్రీట్మెంట్స్.. జుట్టుని హెల్తీగా మారుస్తాయి అంటోంది ఈ ముద్దుగుమ్మ.

ఐశ్వర్యారాయ్
ఈ ప్రపంచంలోనే అత్యంత అందమైన అమ్మాయిగా క్రేజ్ సంపాదించిన ఐష్ కూడా తన బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసింది. దోసకాయ చర్మ సమసస్యలకు, శనగపిండిలో పాలు లేదా పెరుగు కలిపి పట్టించడం వల్ల చర్మానికి మాయిశ్చరైజర్ అందిస్తుందని చెబుతోంది. దీనివల్ల టాక్సిన్స్ తొలగిస్తుంది. అలాగే తేనె, నిమ్మరసం, హాట్ వాటర్ తో లోషన్ ప్రిపేర్ చేసుకుని శరీరానికి అప్లై చేస్తుందట.



Click it and Unblock the Notifications
